Monthly Archives: May 2020

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: సీఎం జగన్

‘మన పాలన–మీ సూచన’ పేరుతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మేధోమథన సదస్సుల్లో భాగంగా మంగళవారం వ్యవసాయం, అనుబంధ రంగాలపై సమీక్ష జరిగింది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ‘రైతు, రైతు కూలీల్లో చిరునవ్వు చూడటమే మనలక్ష్యం. 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో రైతుల కష్టాలను చూశా. రైతుల కష్టాలను తొలగించేలా మేనిఫెస్టో రూపొందించాం. పంటల సాగు ఖర్చు తగ్గించగలిగితే రైతులు లాభపడతారు. ప్రకృతి వైపరిత్యాలు వచ్చినప్పుడు రైతులను ఎలా కాపాడుకోవాలో కూడా ఆలోచించాం. ...

Read More »

ఏపీలో మరో 48 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 48 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,719కు చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 8,148 శాంపిల్స్‌ను పరీక్షించగా 48కి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 55 మంది డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటి వరకు 1903 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో కరోనా బారినపడి ఇప్పటివరకు 57 ...

Read More »

చంద్రబాబుకు నందిగం సురేష్‌ సవాల్‌

రాజధాని ప్రాంతంలో తాను భూములను కబ్జా చేసినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ సవాల్‌ విసిరారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించపోతే చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాజధానిలో తానూ తన అనుచరులు భూమిని కబ్జా చేశారని తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.సొమవారం తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో నందిగం సురేష్‌ మాట్లాడారు. ‘నిజనిర్ధారణ కమిటీ వేస్తే టీడీపీ నేతలు చేసిన అరాచకం బయటపడుతుంది. చంద్రబాబుది కోర్టు స్టేల బతుకు. నిజాలు ...

Read More »

సీఎం జగన్‌ అధ్యక్షతన ‘మన పాలన- మీ సూచన’

వ్యవస్థలో మార్పు తీసుకువస్తేనే తప్ప, ప్రజలను మనం ఆదుకోలేమనే భావన కలిగిందని, సుపరిపాలన అందించేందుకు ఒక​ వ్యవస్థను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆ వ్యవస్థే.. గ్రామ సచివాలయ వ్యవస్థ అని ఆయన పేర్కొన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని సీఎం జగన్‌ ప్రశంసించారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్ల వ్యవస్థ ద్వారా వైరస్‌ నియంత్రణ చర్యలు చేపట్టామన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంగా అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలు.. ఆయా ...

Read More »

ఏపీలో కొత్తగా మరో 44 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 44 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,671కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది. గత 24 గంటల్లో 10,240 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 44 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని తెలిపింది

Read More »

ఒక్క రోజులో 6,977 కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 6,977 కరోనా కేసులు నమోదు కాగా, 154 మంది మృతిచెందారు. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే గరిష్టం కావడం గమనార్హం. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,38,845కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 57,720 మంది కరోనా నుంచి కోలుకోగా.. 4,021 మంది ...

Read More »

భారత్‌లో లక్షా ముప్పైవేలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 6,767 కరోనా కేసులు నమోదు కాగా, 147 మంది మృతిచెందారు. ఒక్క రోజు వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,31,868కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు 54,440 మంది కరోనా నుంచి కోలుకోగా, 3,867 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 73,560 ...

Read More »

ముస్లిం సోదరులకు ఏపీ గవర్నర్‌ శుభాకాంక్షలు

క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికనే రంజాన్‌ పర్వదినం అని ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. ఆయన ఆదివారం రాజ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్‌ మాసం ‘ఈద్ ఉల్ ఫితర్’ ముగిసిన శుభవేళ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర ఖురాన్ బోధనలు యుగ యుగాలుగా మానవాళిని ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. రంజాన్ మాస పవిత్రతతో ప్రతి వ్యక్తి మానసిక పరివర్తన చెంది ప్రేమమూర్తిగా మారుతాడని ఆయన అన్నారు.రంజాన్ మాసంలో ఆధ్యాత్మిక ఆరాధనతో అనుబంధం మరింత బలపడుతుందని గవర్నర్‌ చెప్పారు. క్రమశిక్షణను ...

Read More »

కేసీఆర్ పై మండిపడ్డ ఎంపీ బండి సంజయ్

తెలంగాణ సీఎం కేసీఆర్‌ అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. శనివారం ఆయన నాయకత్వంలో బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్‌ తమిళిసైని కలిసి ఒక వినతిపత్రం అందజేశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, అక్రమ సంపాదన కోసం కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని ప్యాకేజీలుగా విభజించి కొత్తగా టెండర్లను పిలిచారని ధ్వజమెత్తారు. లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సమయంలో నిబంధనలకు వ్యతిరేకంగా టెండర్లను పిలిచి సీఎం కేసీఆర్‌ దోచుకుంటున్నారని ఆరోపించారు. అలాగే, పాత ప్రాజెక్టులను కూడా కేసీఆర్‌ తన ...

Read More »

ఏపీలో కొత్తగా 47 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో శనివారం కొత్తగా 47 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2561కు చేరింది. గడిచిన 24 గంటల్లో 9,136 మంది సాంపిల్స్‌ పరీక్షించగా 47 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారణయింది. కాగా శుక్రవారం కొత్తగా 47 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 1778కి చేరింది. కరోనాతో ఇవాళ కృష్ణా ...

Read More »