Monthly Archives: June 2020

అల్లరి నరేశ్‌కు స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌ తెలిపిన నాని

అల్లరి నరేశ్‌కు స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌ తెలిపిన నాని

తెరంగేట్రం చేసిన తొలి చిత్రం పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న కామెడీ హీరో అల్లరి నరేశ్‌. ఓ వైపు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు నటుడిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ పలు విభిన్న చిత్రాల చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో పూర్తిగా తన పంథా మార్చుకొని పలు సీరియర్‌ క్యారెక్టర్స్‌ ట్రై చేస్తున్నాడు. ఇలా ప్రయోగాత్మకంగా చేసింది ‘నాంది’. ఈరోజు నరేశ్‌ బర్త్‌డే సందర్భంగా అభిమానులకు వరుస సర్‌ప్రైజ్‌లు వస్తున్నాయి. అతడి తాజా చిత్రాలు నాంది, బంగారు బుల్లోడు చిత్రాల టీజర్లు ...

Read More »

తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా

తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా

కరోనా కారణంగా తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. రేపటి నుంచి జరగాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ విధిస్తే.. పరీక్షలు ఎలా నిర్వహిస్తారనే దానిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. లాక్‌డౌన్‌ స్పష్టత ఇచ్చాకే పిటిషన్‌పై విచారణ జరపాల్సి ఉంటుందని తెలిపింది. అయితే లాక్‌డౌన్‌ నిర్ణయంపై ఆధారపడి ఉందని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం ప్రవేశ పరీక్షలను ...

Read More »

వైద్య, ఆరోగ్య చరిత్రలో రేపు నూతనధ్యాయం- డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

వైద్య, ఆరోగ్య చరిత్రలో రేపు నూతనధ్యాయం

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్‌ సర్వీసులు తిరిగి రేపటి నుంచి అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి వస్తున్నట్లు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య చరిత్రలో రేపు నూతనధ్యాయానికి తెరతీస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గత టీడీపీ హయాంలో 108 వాహనాలు నిర్లక్ష్యంగా వ్యవహరించి పేదల ప్రాణాలను హరించాయన్నారు.ఆళ్ల నాని మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 201 కోట్ల రూపాయలు నూతన 108, 104 వాహనాలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు ...

Read More »

తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుకు కరోనా

తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుకు కరోనా

తెలంగాణలో కరోనా వైరస్‌ సాధారణ ప్రజలతోపాటు ప్రజా ప్రతినిధులను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ నేతలను కరోనా వైరస్‌ వెంటాడుతోంది. ఇటీవల హోంశాఖ మంత్రి మమమూద్‌ అలీకి కరోనా సోకగా, తాజాగా తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. మూడు రోజుల నుంచి జ్వరం గొంతునొప్పితో బాధపడుతున్న ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. పద్మారావుతోపాటు మరో నలుగురు కుటుంబ సభ్యులు సైతం కోవిడ్‌ బారిన పడ్డారు. వీరంతా ప్రస్తుతం సికింద్రాబాద్‌లో హోం క్వారంటైన్‌లో ఉన్నారు

Read More »

అల్లరి నరేష్ ఫ్యాన్స్‌కు ఓ సర్‌ప్రైజ్

అల్లరి నరేష్ ఫ్యాన్స్‌కు ఓ సర్‌ప్రైజ్

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం ‘నాంది’ టీజర్ విడుదలైంది. నేరాలు, ఖైదీలు, వారి శిక్షలు నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాతో నరేష్ తన విలక్షణ నటనతో ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. జైలులో న‌గ్నంగా దర్శనమిచ్చి ఈ చిత్ర వైవిధ్యంపై భారీ అంచనాలు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా మీరందరూ నాపై అంతులేని ప్రేమ, విశ్వాసంతో ఆశ్చర్యపరిచారు, సో.. ఈ పుట్టినరోజుకు నేను అందరినీ ఆశ్చర్యపర్చాలని నిర్ణయించుకున్నానంటూ కథానాయకుడు నరేష్ ...

Read More »

ఏపీలో మరో 704 కరోనా కేసులు

ఏపీలో మరో 704 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో మరో 648 కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 51మందికి, విదేశాల నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ మేరకు మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 18,114 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, మొత్తం 704 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,595కి చేరింది. ఇక గడచిన 24 ...

Read More »

రాష్ట్రపతికి రంగరాజన్‌ లేఖ

రాష్ట్రపతికి రంగరాజన్‌ లేఖ

ఉద్యమం సంధానకర్త రంగరాజన్‌ భారత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవిద్‌కు లేఖరాశారు. సోమవారం ఈ విషయాన్ని ఆయన విలేకరులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనంతపద్మనాభ స్వామి దేవాలయం కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పును ఎందుకు వాయిదా వేస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికే శబరిమల ఆలయం తీర్పును కోర్టు ధర్మానికి విరుద్ధంగా ఇచ్చిందని మండిపడ్డారు. అదేవిధంగా పూరీ జగన్నాథ్‌ రథయాత్ర నిర్వహించొద్దని తీర్పు ఇచ్చి.. తర్వాత ప్రజల ఆగ్రహాన్ని గమనించి పరిమిత సంఖ్యలో భక్తులతో రథయాత్ర తీయొచ్చని తన తీర్పును తానే మార్చుకుందన్నారు. ...

Read More »

2న రాష్ట్ర మంత్రివర్గ భేటీ

2న రాష్ట్ర మంత్రివర్గ భేటీ

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జూలై 2న రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా వైరస్‌ కట్టడి కోసం లాక్‌డౌన్‌ విధించే అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కరోనా వ్యాప్తి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో 15 రోజుల పాటు అత్యంత కఠినంగా లాక్‌డౌన్‌ విధించాలని ప్రతిపాదిస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌లో భాగంగా అత్యంత కఠినంగా కర్ఫ్యూ విధించాలని, రోజుకు కేవలం గంటా రెండు గంట లు మాత్రమే ...

Read More »

విశాఖ గ్యాస్‌ లీకేజీ ఘటనపై సీఎం జగన్‌ ఆరా

విశాఖ గ్యాస్‌ లీకేజీ ఘటనపై సీఎం జగన్‌ ఆరా

విశాఖ సమీపంలోని పరవాడలో సాయినార్‌ లైఫ్‌ సెన్సైస్‌ ఫార్మా కంపెనీలో ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. సీఎంవో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ఇద్దరు మరణించారని, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఒకరు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని, మరో ముగ్గురు సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. రియాక్టర్‌ వద్ద లీకేజీ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. సోమవారం రాత్రి 11:30 గంటలకు ప్రమాదం జరిగిందని, తమ దృష్టికి వచ్చిన ...

Read More »

అనుచరుడి దారుణ హత్య..కన్నీటి పర్యంతమైన మంత్రి పేర్నినాని

అనుచరుడి దారుణ హత్య..కన్నీటి పర్యంతమైన మంత్రి పేర్నినాని

కృష్ణా జిల్లాలో హత్యకు గురైన వైసీపీ నేత, మాజీ మార్కెట్‌యార్డ్‌ ఛైర్మన్‌  మోకా భాస్కర్‌రావు భౌతికకాయాన్ని మంత్రి పేర్ని నాని సందర్శించారు. భాస్కర్‌రావు భౌతికకాయాన్ని చూడగానే మంత్రి కన్నీటి పర్యంతమయ్యారు. భాస్కర్‌ రావు మంత్రి పేర్ని నానికి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. భాస్కర్‌రావు హత్యకు గురయ్యారనే విషయం తెలియగానే నాని హుటాహుటిన మచిలీపట్నం చేరుకున్నారు. భాస్కర్‌ రావుపై మచిలీపట్నంలో ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ను ఆసుపత్రికి తరలించగా అక్కడ చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ...

Read More »