Monthly Archives: July 2020

24 గంటల్లో 50 వేలకుపైగా కేసులు

దేశంలో మొదటిసారిగా ఒక్కరోజులో 50 వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఇవే అత్యధికమని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటలలో దేశంలో 52,123 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో 775 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 15,83,792కి చేరింది. అలాగే మొత్తం మరణాల సంఖ్య 34,968కి చేరింది. 5,28,242 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 10,20,582 మంది కోలుకున్నారు. కాగా, నిన్నటి వరకు ...

Read More »

మరో యువ నటుడు ఆత్మహత్య

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య ఇప్పటికీ బాలీవుడ్‌ను వెంటాడుతుండగా మరో యువనటుడు, ‘ఖుల్తా ఖలీ ఖులేనా’ ఫేమ్ మయూరి దేశ్ ముఖ్ భర్త నాందేడ్ లో ఆత్మహత్య చేసుకున్నాడు . ప్రముఖ మరాఠీ యువ నటుడు అశుతోష్ భక్రే (32) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరాఠ్వాడ ప్రాంతంలోని నాందేడ్ పట్టణంలోని తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన మయూరి దేశ్ ముఖ్ అభిమానులకు షాక్ ఇచ్చింది. అదే సమయంలో, మరాఠీ ...

Read More »

మాజీ మంత్రి కొప్పన మోహనరావు కన్నుమూత

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కొప్పన మోహనరావు(75) బుధవారం కన్నుమూశారు. కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు(1978,1989) కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. కోట్ల విజయభాస్కరరెడ్డి హయంలో అటవీ శాఖ మంత్రిగా పని చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో కొప్పన వైఎస్సార్‌సీపీకి సేవలందించారు.

Read More »

వారం రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ -పేర్ని నాని

కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు ఉధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆగస్టు 3 నుంచి 9 వరకు మచిలీపట్నంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘మచిలీపట్నంలో కరోనాను కట్టడి చేయడంలో భాగంగా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ అభిప్రాయం సేకరించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఉదయం 6 నుంచి 9 వరకు నిత్యావసరాలకు అనుమతిస్తున్నాం. మిగిలిన వ్యాపారాలన్నీ కూడా పూర్తిగా మూసివేయబడతాయి. బస్సులు, ఆటోలు, మోపెడ్‌లు రోడ్లపై తిరగ రాదు. అందరూ కూడా ...

Read More »

ఏపీ రాజ్‌భవన్‌లో కరోనా కలకలం

ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అధికారిక భవనమైన రాజ్‌భవన్‌లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ పనిచేస్తున్న వారిలో 15 మంది భద్రతా సిబ్బంది కరోనా బారినపడ్డారు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన ఉన్నతాధికారులు అక్కడ పనిచేస్తున్న మొత్తం 72 మంది భద్రతా సిబ్బందిని ఒకేసారి మార్చి, వారి స్థానంలో కొత్త వారిని నియమించారు. రాజ్‌భవన్‌ను పూర్తిగా శానిటైజ్‌ చేశారు. గతంలోనూ ఇక్కడ పనిచేసే పలువురు అధికారులు, సిబ్బంది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

Read More »

రామ్‌గోపాల్‌ వర్మకు మరోసారి జరిమానా విధించిన జిహెచ్‌ఎంసి

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు హైదరాబాద్‌ మహా నగరపాలక సంస్థ (జిహెచ్‌ఎంసి) అధికారులు వరుసగా రెండోసారి జరిమానా విధించారు. ఇటీవల ఆయన చిత్రం ‘పవర్‌స్టార్‌’కు సంబంధించిన పోస్టర్లను బహిరంగ ప్రదేశాల్లో అంటించినందుకు జిహెచ్‌ఎంసి అధికారులు ఈ నెల 22న రూ.4 వేలు జరిమానా విధించింది. అయితే ఇదే పాంతంలో సుమారు 30కి పైగా పోస్టర్లు అంటించినట్లు అధికారులు గుర్తించారు. వీటికి అనుమతులు తీసుకోలేదని తేలడంతో జిహెచ్‌ఎంసి సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సెల్‌ రూ.88 వేలు చెల్లించాలని ఈ-చలానా జారీ చేసింది. కాగా, లాక్‌డౌన్‌ అనంతరం మొదటి ...

Read More »

సెప్టెంబర్‌ కల్లా బాలానగర్‌ ఫ్లైఓవర్‌ పూర్తి: కేటీఆర్‌

అండర్‌ బ్రిడ్జ్‌తో ఫేతే నగర్‌ బ్రిడ్జ్‌పై రద్దీ తగ్గుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. బుధవారం కేటీఆర్‌ మాట్లాడుతూ, ‘137 కొత్త లింక్‌ రోడ్లు వేస్తున్నాం. ఆర్ యూ బీ వలన ఫేతే నగర్ బ్రిడ్జ్ పై రద్దీ తగ్గుతుంది. దీని వలన 6.5 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఈ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తాం. రేపు రెండు లింక్‌ రోడ్లు ప్రారంభిస్తాం. సెప్టెంబర్‌ వరకు బాలా నగర్‌ ప్లై ఓవర్‌ పూర్తి అవుతుంది. రోడ్డు విస్తరణలో ఎక్కవ మొక్కలు నాటాలి. త్వరలోనే నగరంలో లక్ష ...

Read More »

మలేసియా మాజీ ప్రధానికి 12 ఏళ్ల జైలు శిక్ష

మ‌లేషియా డెవ‌ల‌ప్‌మెంట్ బెర్హాద్‌(వ‌న్ ఎండీబీ) ఫండ్ కేసులో భారీ అవినీతి ఆరోపణలపై మ‌లేషియా మాజీ ప్ర‌ధాని న‌జీబ్ ర‌జాక్ దోషిగా తేలారు. దీంతో మాజీ ప్రధానికి కౌలాలంపూర్‌లోని హైకోర్టు 12 ఏళ్ళ జైలుశిక్ష విధించింది. 2009 నుంచి 2018 వ‌ర‌కు న‌జీబ్ మ‌లేషియా ప్ర‌ధానిగా చేశారు. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆయన అవినీతి బయటపడటంతో అధికారాన్ని కోల్పోయారు. మలేసియాలో ఓ మాజీ ప్రధానిని దోషిగా కోర్టు నిర్ధారించడం ఇదే మొదటిసారి. అధికార దుర్వినియోగం, మనీలాండరింగ్‌, నమ్మక ద్రోహంకు పాల్పడ్డారని నజీబ్ పై అభియోగాలున్నాయి. ...

Read More »

రియా చక్రవర్తిపై కేసు నమోదు

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. సుశాంత్‌ స్నేహితురాలు రియా చక్రవర్తిపైన పట్నాలోని రాజీవ్ నగర్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సుశాంత్‌ మృతిపై ఆయన తండ్రి కృష్ణ కుమార్‌సింగ్‌ ఫిర్యాదుతో రియాపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. సుశాంత్ అకౌంట్ నుంచి రూ.15 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయినట్లు గుర్తించారు. ఆయనకు సంబంధించిన ఆర్థిక అంశాలతో పాటు ఇతర విషయాలను రియా స్వయంగా పర్యవేక్షించినట్లు తెలిపారు. ఈ మేరకు రియాను బుధవారం విచారించనున్నట్లు పోలీసులు ...

Read More »

పైలట్‌ వ్యూహం బెడిసికొట్టిందా?

రాజస్తాన్‌లో రాజకీయ హైడ్రామా కొనసాగుతుండగా.. తిరుగుబాటు నేత, మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌కు కాంగ్రెస్‌ శిబిరంలో మద్దతు, సానుభూతి తరిగిపోతోందని పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటును కొనసాగిస్తుండటంతో పార్టీలో అంతర్గతంగా పైలట్‌కున్న పట్టు, సానుభూతిని ఆయన కోల్పోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎల్పీ భేటీలకు డుమ్మా కొట్టడంతో రాజస్తాన్‌ డిప్యూటీ సీఎంగా పైలట్‌ను తొలగించిన సమయంలో ఆయన పట్ల కాంగ్రెస్‌ పార్టీలో సానుభూతి పెరిగింది. ఈ క్రమంలో అధీర్‌ రంజన్‌ చౌధరి, అభిషేక్‌ సింఘ్వి, సల్మాన్‌ ఖుర్షీద్‌, శశి థరూర్‌, ...

Read More »