Monthly Archives: July 2020

వచ్చే ఏడాది వరకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో.. తమ ఉద్యోగులకు వచ్చే ఏడాది జులై వరకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సదుపాయాన్ని కల్పించనున్నట్లు గూగుల్‌ తెలిపింది. తమ ఉద్యోగులకు 2021,జూన్‌ 30 వరకు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ సదుపాయన్ని పొడిగిస్తున్నట్లు గూగుల్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చీఫ్‌ సుందర్‌ పిచారు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు రెండు లక్షల ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు జనవరితో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ కాలపరిమితి ముగియనున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి కేసులు పెరుగుతునప్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల సంస్థ తెలిపింది. మరి కొన్ని రోజుల్లో ...

Read More »

మహారాజకీయాల్లో ఫొటో కలకలం

మహారాజకీయాల్లో ఫొటో కలకలం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌థాకరే పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ .. ఎన్‌సిపి నేత అజిత్‌ పవార్‌ పోస్ట్‌ చేసిన ఫొటో ‘మహా’ రాజకీయాల్లో కలకలంగా మారింది. రాష్ట్రంలోని మహావికాశ్‌ అగాఢ ప్రభుత్వ భవిష్యత్తు ప్రతిపక్షాల చేతిలో లేదని, స్టీరింగ్‌ తన చేతిలోనే ఉందన్న ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే వ్యాఖ్యానించిన కొద్దిగంటల్లోనే ఈ ఫొటో వెలువడడం గమనార్హం. బిజెపి నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ మాట్లాడుతూ..ఆటో రిక్షా ఎటు వెళ్లాలన్న విషయాన్ని డ్రైవర్‌ నిర్ణయించడని, వెనక కూర్చున్న ప్రయాణికులే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. ...

Read More »

కరోనా నుంచి కొలుకున్న ఐశ్వర్య, ఆద్యా

కరోనా వైరస్‌ సోకి పది రోజుల క్రితం నానావతి ఆసుపత్రిలో చేరిన ఐశ్వర్యరారు బచ్చన్‌, ఆమె కూతురు ఆద్యా కోలుకున్నారు. వారి రిపోర్ట్స్‌ నెగిటివ్‌ రావడంతో సోమవారం ఆసుపత్రి నుంచి ఢిశ్చార్జ్‌ అయ్యారు. ఈ విషయాన్ని అభిషేక్‌ బచ్చన్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. అందరి ప్రార్ధనాల కారణంగా ఐశ్వర్య, ఆద్యా కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారని ఆయన వెల్లడించారు. తాను, తన తండ్రి అమితాబ్‌ బచ్చన్‌ ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నామని రాశారు. జులై 11వ తేదీ నుంచి వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ...

Read More »

నేడు అబ్దుల్‌కలాం 5వ వర్ధంతి

నేడు అబ్దుల్‌కలాం 5వ వర్ధంతి

భారతదేశ 11వ రాష్ర్టపతి ఏపీజే అబ్దుల్‌ కలాంకు దేశ వ్యాప్తంగా నివాళులర్పిస్తున్నారు. నేడు ఆయన 5వ వర్ధంతి. డాక్టర్ ఏపీజే కలాం అక్టోబర్ 15, 1931లో తమిళనాడులో జన్మించారు. 2002, 2007 మధ్య భారతదేశ 11వ అధ్యక్షుడిగా పనిచేశారు. ఈయన్ను ‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అని కూడా పిలుస్తారు. 1998 పోఖ్రాన్- II అణు పరీక్షల్లో కలాం కీలక పాత్ర పోషించారు.  భారతదేశం అంతరిక్ష కార్యక్రమానికి, క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన విశేష కృషి చేశారు.  జూలై 27, 2015న షిల్లాంగ్‌లోని ఇండియన్ ...

Read More »

తమిళనటి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం

తమ భావాలను పదిమందితో పంచుకునేందుకు సోషల్‌మీడియా మంచి వేదికగా నిలుస్తోంది. అయితే దానినే కొంతమంది మరొకరిని వేధించేందుకు ఆయుధంగా మార్చుకుంటున్నారు. దీంతో ఈ వేధింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా సోషల్‌మీడియాలో తనపై వేధింపులు ఎక్కువవుతున్నాయంటూ తమిళ, కన్నడ నటి విజయలక్ష్మి ఆత్మహత్యకు యత్నించారు. అంతకుముందు ఫేస్‌బుక్‌లో వీడియోలు పోస్టు చేసిన నటి ‘నామ్‌ తమిళర్‌’ పార్టీ నేత సీమన్‌, ‘పనన్‌కట్టు పడై’కి చెందిన హరి నాడార్‌ మద్దతుదారులు తనను వేధింపులకు గురిచేస్తున్నారని, దీంతో బిపి మాత్రలు మింగినట్లు అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ...

Read More »

శ్రావణ సోమవారాలు శివారాధనకు విశేష రోజులు !

శ్రావణమాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి. ఈ మాసం శివపూజకు విశిష్టమైనది. శ్రావణంలో వచ్చే సోమవారాలు శివారాధనకు విశేషమైనవిగా పరిగణించపబడతాయి. ముఖ్యంగా భగవదారాధనలో శివ, కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుందని ప్రతీతి. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్ర వచనం. సోమవారాల్లో శివుడి ప్రీత్యా ర్థాం ఈ వ్రతాన్ని (ఉపవాసదీక్షను) చేయాలి. ...

Read More »

కరోనా టైమ్‌లో సీతాఫలం తినొచ్చా..

ఇప్పుడు అందరం ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాం. హెల్దీ లైఫ్ స్టైల్ కి అలవాటు చేసుకోవడం మొదలుపెట్టాం. అలాంటి హెల్దీ ఫుడ్స్ లో ఒకటి సీతా ఫలం. ఇది సీతా ఫలాలు వచ్చే కాలం. ఏ కాలం లో వచ్చే పండ్లూ కూరగాయల్ని ఆ కాలంలో తీసుకోవడం వల్ల సీజనల్ ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. సీజనల్ ప్రాబ్లమ్స్ తగ్గించడమే కాకుండా సితాఫలంలో ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో, ఈ కాలంలో ఈ పండు ని ఎందుకు రెగ్యులర్ ...

Read More »

మెరిసే చర్మం కోసం కుంకుమ పువ్వుతో ఈ మాస్క్ ట్రై చేయండి..

కుంకుమ పువ్వు వంటకాల రుచిని పెంచుతుందని అంటారు, అయితే ఇది మీ అందాన్ని కూడా పెంచుతుంది. వర్షాకాలంలో, మారుతున్న ఉష్ణోగ్రతలు, తేమ, పురుగు, లేదా దోమ కాటులకు మీ చర్మం గురవుతుంది. కాబట్టి చర్మ సంరక్షణ చర్యలలో భాగంగా కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ఇందుకోసం కొన్ని ఇంటి చిట్కాలు, DIY లు మీ చర్మ సంరక్షణకి ఎంతగానో సాయపడతాయి. ఇవి తక్కువ ఖర్చుతో కూడుకుని, సులభంగా వాడే విధంగా ఉంటాయి. చర్మ సంరక్షణకు ఉపయోగించే పదార్ధాలలో కుంకుమ పువ్వు, కేసర్ అత్యంత ప్రాచుర్యం ...

Read More »

భారత్‌కు వ్యతిరేకంగా జీవాయుధాలపై పాాక్-చైనా ప్రయోగం

భారత్‌కు వ్యతిరేకంగా జీవాయుధాలపై పాాక్-చైనా ప్రయోగం

ప్రమాదకరమైన జీవ ఆయుధాల తయారీకి పాకిస్థాన్‌, చైనాలు ఒక రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని ఆస్ట్రేలియా పత్రిక ఓ సంచనల కథనం వెలువరించింది. ఆంత్రాక్స్‌ సహా పలు ప్రమాదకర జీవాయుధాలకు సంబంధించిన పరిశోధనలు ఆ రెండు దేశాలు చేపట్టాయని పరిశోధనాత్మక దినపత్రిక ద క్లాక్సన్ తెలిపింది. పాకిస్థాన్‌కు చెందిన సైనిక రక్షణ శాస్త్ర, సాంకేతిక సంస్థ (డెస్టో)తో చైనాకు చెందిన వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ మూడేళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుందని పేర్కొంది. ‘కొత్తగా ఉత్పన్నమవుతున్న అంటువ్యాధులు.. వ్యాప్తి, నియంత్రణ’పై సంయుక్తంగా పరిశోధన చేయడం దీని ప్రధాన ...

Read More »

వివాహ బంధంతో ఒక్కటైన నితిన్, షాలిని

హీరో నితిన్, షాలిని వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలస్‌లో వైభవంగా జరిగింది. కొవిడ్-19 నిబంధనలను పాటిస్తూ చాలా కొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నితిన్-షాలిని వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకలో సినీ పరిశ్రమ నుంచి వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కార్తికేయ పాల్గొన్నారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ కవిత, పలువురు టీఆర్ఎస్ నేతలు హాజరై వధూవరులను ఆశీర్వాదించారు.

Read More »