Monthly Archives: July 2020

ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ధర్మాన కృష్ణదాస్

ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ధర్మాన కృష్ణదాస్

ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇకపై నాలుగేళ్ల పాటు చెల్లుబాటు అయ్యేవిధంగా దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ నమ్మకం నిలబెట్టేలా పనిచేస్తానని తెలిపారు. బియ్యం కార్డు ఉన్న వారికి ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరం లేదని ఆయన ప్రకటించారు. అర్హులైన వారికి ఆగస్టు 15న 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి దాదాపు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు

Read More »

సీఎం శివరాజ్‌సింగ్‌కు కరోనా పాజిటివ్‌

ప్రాణాంతక కరోనా వైరస్‌ దేశంలో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతోంది. ఇ‍ప్పటికే పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వైరస్‌బారినపడగా.. తాజాగా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత శివరాజ్‌సింగ్‌ చౌహన్‌కు కరోనా సోకింది. గత రెండు రోజులుగా తీవ్ర దగ్గు, జలుబుతో బాధపడుతున్న సీఎంకు శనివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో భోపాల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నారు. సీఎంకు పాజిటివ్‌గా తేలడంతో ఆయనతో సమీపంగా మెలిగిన వారంతా ...

Read More »

ఆగస్టు నుంచి సినిమా థియేటర్లు ప్రారంభం?

ఆగస్టు నుంచి సినిమా థియేటర్లు ప్రారంభం

కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ వల్ల దేశ వ్యాప్తంగా సినిమా థియేటర్లు బంద్‌ అయిన విషయం తెలిసిందే. వాటిని వచ్చే నెలలో మళ్లీ తెరవాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ సిఫారసు చేసింది. ఆ శాఖ కార్యదర్శి అమిత్‌ ఖరీ సినిమా పరిశ్రమ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈ విషయం తెలిపారు. ఈ విషయంపై తుది నిర్ణయాన్ని త్వరలోనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజరు భల్లా తీసుకుంటారని చెప్పారు. కరోనా కట్టడి జాగ్రత్తలో భాగంగా సీట్ల మధ్య ఖాళీ ఉంచి ...

Read More »

టీడీపీకి మరో విషాదం.. గంటా ప్రధాన అనుచరుడు నలంద కిషోర్ మృతి

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిషోర్‌ చనిపోయారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు.. అక్కడ తుది శ్వాస విడిచారు. సోషల్ మీడియా పోస్టుల విషయంలో నెల క్రితం ఆయన్ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. టీడీపీ నేతలు కూడా ఆయన అరెస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెట్టారని మాజీ మంత్రి గంటా మండిపడ్డారు. విశాఖ నుంచి కర్నూలుకు రోడ్డు మార్గంలో తరలించి అక్కడ విచారణ ...

Read More »

ఎల్లుండి మరోసారి సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

ఎల్లుండి మరోసారి సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. జులై 27న సోమవారం నాడు సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుపై చివరిసారిగా జూన్ 16,17 తేదీల్లో ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో మహమ్మారి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రులతో చర్చించేందుకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అయితే, కేవలం మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులతోనే ప్రధాని ...

Read More »

దేశంలో 13 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం… గత 24 గంటల్లో భారత్‌లో 48,916 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 757 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 13,36,861కి చేరగా, మరణాల సంఖ్య మొత్తం 31,358కి పెరిగింది. 4,56,071 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 8,49,431 మంది కోలుకున్నారు. కాగా, నిన్నటి వరకు ...

Read More »

మెగా డాటర్‌ టీమ్‌కి కరోనా పాజిటివ్‌

మెగా ఫ్యామిలీ నుంచి చిరు పెద్ద కుమార్తె సుస్మిత నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. భర్త విష్ణుతో కలిసి ‘గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌ టైన్‌మెంట్స్‌’ పేరుతో ఓ నూతన నిర్మాణ సంస్థని స్థాపించిన సుస్మిత ఓ వెబ్‌ సిరీస్‌ నిర్మాణం కూడా ఇటీవలే మొదలుపెట్టారు కూడా. ఈ వెబ్‌ సిరీస్‌కి ‘ఓరు’ ఫేమ్‌ ఆనంద్‌ రంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ జీ5లో స్ట్రీమింగ్‌ కానున్న ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా, ...

Read More »

నితిన్‌ పెళ్ళిలో పవన్ కళ్యాణ్

హీరో నితిన్‌, షాలిని వివాహ వేడుక జూలై 26 రాత్రి 8:30 గంటలకు హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరుకానున్నారు. అయితే శుక్రవారం నితిన్‌ పెళ్లికొడుకు ఫంక్షన్‌ నిర్వహించారు. ఈ ఫంక్షన్‌కు నితిన్‌ ఎంతో అభిమానించే పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఇంకా హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ నిర్మాత చినబాబుతో పాటు మరికొందరు హాజరైయ్యారు. అయితే నితిన్‌ పెళ్లి వేడుకకు పవన్‌ హాజరవ్వడం లేదని, ...

Read More »

ఏపీలో కరోనా ప్రకంపనలు: ఒక్క రోజే 8,147 కేసులు

ఏపీలో కరోనా వైరస్ ప్రకంపనలు రేపుతోంది. ప్రతి రోజూ రికార్డులు బద్దలయ్యేలా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా టెస్టులు భారీగా నిర్వహిస్తుండగా.. కేసులు కూడా అంతే స్థాయిలో నమోదవుతున్నాయి. శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో మరోసారి రికార్డు బ్రేక్ చేసే స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అలాగే ఒకే రోజు ఏకంగా 49 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 48,114 మందికి పరీక్షలు నిర్వహించగా ఏకంగా 8,147 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ ...

Read More »

నిమ్మగడ్డ అంశంలో స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అంశంలో కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్‌పై స్టే ఇవ్వాలని ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం విచారించింది. ఎపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విషయంలో ప్రతి విషయం తమకు తెలుసని, తామే కావాలని ఈ కేసులో స్టే ఇవ్వట్లేదని ధర్మాసనం తెలిపింది. గవర్నర్‌ లేఖ పంపినా రమేష్‌కుమార్‌కు పోస్టింగ్‌ ఇవ్వకపోవడం అత్యంత ...

Read More »