Monthly Archives: August 2020

బ్రేక్ ఫాస్ట్ టైమ్‌లో తేనె, నిమ్మరసం తీసుకుంటున్నారా..

డైజెస్టివ్ సిస్టం ని హెల్దీ గా ఉంచుకోవడం ఆరోగ్యానికి చాలా అవసరం. తీసుకునే ఆహారం, వ్యాయామం, స్లీప్ సైకిల్, ఓవరాల్ హెల్త్… వీటన్నింటిపై అరుగుదల ఆధారపడి ఉంటుంది. మనం చాలా సార్లు రకరకాల ఫ్యాన్సీ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటాం, అరుగుదల బాగుంటుంది, డైజెస్టివ్ సిస్టం చక్కగా పని చేస్తుంది అనుకుంటూ. కానీ, కొన్ని సింపుల్ ఫుడ్స్ ని మన డైట్ లో భాగా చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది.1. తేనె – నిమ్మరసం గోరు వెచ్చని నీటిలో తేనె, నిమ్మ రసం కలిపి ...

Read More »

ఆధార్ కార్డ్ ఉన్న వారికి షాక్..

ఆధార్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కీలకమైన డాక్యుమెంట్లలో ఇది కూడా ఒకటి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ కార్డు ఉండాల్సిందే. అలాగే ఆదాయపు పన్ను చెల్లించే వారికి కూడా ఆధార్ కార్డు అవసరం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా పాన్ కార్డు తీసుకోవాలంటే కచ్చితంగా ఆధార్ ఇవ్వాల్సిందే. ఇలా ఆధార్ కార్డుతో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల ఆధార్ కార్డుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఆధార్ కార్డులో కొన్ని సందర్భాల్లో తప్పులు ఉండే ...

Read More »

ప్రధానికి లేఖ రాసిన 150 మంది విద్యావేత్తలు

జెఇఇ, నీట్‌ పరీక్షలపై భారత్‌, విదేశాలలోని వివిధ యూనివర్శిటీల నుండి 150 మందికి పైగా విద్యావేత్తలు ప్రధాని మోడీకి లేఖ రాశాయి. విదేశాలు, మెడికల్‌, ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలైన జెఇఇ, నీట్‌ పరీక్షల నిర్వహణను మరింత ఆలస్యం చేస్తే విద్యార్థులు భవిష్యత్తులో రాజీపడాల్సి వస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని పలువరు రాజకీయ నేతలు, విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై వారు స్పందిస్తూ.. కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ...

Read More »

TDP నేతకు సుప్రీంకోర్టులో షాక్.. జైలు తప్పదా!

అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేత కందికుంట వెంకట ప్రసాద్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. డీడీల కుంభకోణం కేసును తెలంగాణ హైకోర్టులోనే ఆదేశించింది. ఈ ఏడాది చివరికల్లా కేసును తేల్చేయాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. కందికుంట కేసును ముగ్గురు జడ్జిలతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయమూర్తులు.. కింది కోర్టులో శిక్ష పడిన వ్యక్తి తీర్పును సవాల్‌ చేస్తూ పైకోర్టుకు వెళ్లినప్పుడు ఆ కేసు విచారణలో ఉండగానే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించడం సరికాదని అభిప్రాయపడింది. నకిలీ డీడీలకు సంబంధించిన కేసు హైకోర్టులో పరిష్కారమయ్యే ...

Read More »

తమన్నా పేరెంట్స్‌కి కరోనా.. కోలుకోవాలని సమంత, కాజల్ ప్రార్థనలు

కరోనా మహమ్మారి విజృంభనకు సాధారణ, మధ్య తరగతి వాళ్లే కాదు.. సెలబ్రిటీలు కూడా కుదేలౌతున్నారు. ఇప్పటికే టీవీ, సినిమా ఇండస్ట్రీలకు సంబంధించిన ప్రముఖులు చాలామంది కరోనా బారిన పడ్డారు. అమితాబ్, రాజమౌళి, సింగర్ సునీత, రవిక్రిష్ణ ఇలా చాలామంది కరోనా బారిన పడి తిరిగి కోలుకున్నారు. అయితే లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు కరోనాతో పోరాడుతూ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ తరుణంలో హీరోయిన్ గత వారాంతంలో తన పేరెంట్స్‌లో చిన్నపాటి కరోనా లక్షణాలు కనిపించాయని.. దీంతో జాగ్రత్తలు పాటిస్తూ కరోనా పరీక్షలు చేయగా.. ...

Read More »

దేశంలో 33 లక్షల మార్కును దాటిన కరోనా..

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 33 లక్షల మార్కును దాటింది. గత 24 గంటల్లో 75,760 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 1,023 మంది మృతి  చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 33,10,235 కు చేరగా, మృతుల సంఖ్య  మొత్తం 60,472కి పెరిగింది. దేశంలో కరోనా నుండి ఇప్పటివరకు 25,23,772 మంది కోలుకున్నారు. 7,25,991 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. రికవరీ ...

Read More »

తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభణ.. కొత్తగా 3018 కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విజ‌ృంభిస్తున్నాయి. గడిచిన రెండు రోజులుగా రెండువేలు దాటిన కేసులు గడిచిన 24 గంటల్లో మూడువేలు దాటాయి. తాజాగా 3,018 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,11,688 కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 780కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,060 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి ...

Read More »

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్‌పై విడుదల

టిడిపి నేత, మాజీ మంత్రి కొల్లురవీంద్ర రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుండి బుధవారం విడుదలయ్యారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని వైసిపి నేత మోకా భాస్కరరావు హత్య కేసులో రవీంద్ర అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఎ-4 నిందితునిగా ఉన్న రవీంద్ర గత 53 రోజులుగా జైల్లోనే ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఆయనకు బెయిల్‌ లభించింది.

Read More »

చిన్ననాటి స్నేహితురాలితో శర్వా పెళ్లి

టాలీవుడ్‌ హీరో శర్వానంద్‌ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకోబోతున్నాడని టాలీవుడ్‌ వర్గాలు తెలిపాయి. చిన్ననాటి స్నేహితురాలు, యువ పారిశ్రామికవేత్తతో శర్వా కొద్దికాలంగా ప్రేమలో ఉన్నారు. వారి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలూ అంగీకారం తెలపటంతో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Read More »

అనంత ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో అర్థరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. సకాలంలో అధికారులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. కోవిడ్‌ వార్డులో పక్కనే ఉన్న రికార్డు రూమ్‌లో అర్థరాత్రి సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఫర్నిచర్, రికార్డులు దగ్ధం అయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఐడీ వార్డులో ఉన్న 24మంది కోవిడ్‌ పేషెంట్లను మరో వార్డులోకి తరలించారు. జిల్లా కలెక్టర్‌ సత్య యేసుబాబు, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రమాద స్థలానికి చేరుకుని ...

Read More »