Monthly Archives: August 2020

ఒక్కరోజే 61 వేల కేసులు‌, 836 మరణాలు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ అధికమవుతోంది. గడిచిన 24 గంటల్లో 61,408 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 31,06,349 కు చేరింది. తాజాగా 836 మంది వైరస్‌ బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 57,542 కు చేరింది. 57,468 మంది కోవిడ్‌ పేషంట్లు ఆదివారం కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 23,38,036 కు చేరింది. ప్రస్తుతం 7,10,771 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ...

Read More »

దేశంలో 61,408 పాజిటివ్‌ కేసులు నమోదు..

దేశంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 61,408 మందికి కరోనా సోకింది. దీంతో సోమవారం నాటికి కరోనా కేసుల సంఖ్య 31,06,348కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 836 మంది మఅతి చెందారని, ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 57,542కి చేరింది. పెరుగుతున్న పాజిటివ్‌ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తున్నప్పటికీ.. రికవరీల కూడా క్రమంగా పెరుగుతోందని వెల్లడించింది. ఆదివారం 57వేల మంది కరోనా నుండి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ...

Read More »

పెద్ద మనసు చాటుకున్న సబ్‌ఇన్స్‌పెక్టర్‌

పెద్ద మనసు చాటుకున్న సబ్‌ఇన్స్‌పెక్టర్‌

కరోనా సోకిందంటే సాయం అందించేందుకు సొంత మనుషులే భయపడుతున్న పరిస్థితుల్లో ఒక పోలీస్‌ అధికారి ముందుకు వచ్చి తన పెద్ద మనసును చాటుకున్నారు. ప్రత్యేకంగా బోటును ఏర్పాటుచేసి బాధితుడిని ఆస్పత్రికి తరలించేందుకు సహకరించారు. వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లాలోని దొడ్డవరం గ్రామానికి చెందిన కరోనా భాదితుడికి శ్వాస సమస్య తలెత్తడంతో ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. అయితే ఆ గ్రామాన్ని వరదలు ముంచెత్తడంతో ఆస్పత్రికి వెళ్లేందుకు అవకాశం లేదు. దీంతో బాధితుని కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. నాగారం గ్రామానికి చెందిన సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ప్రత్యేకంగా ...

Read More »

వినాయక చవితి వ్రతం.. వినాయక కథ, పూజా విధానం

వినాయకుడి పుట్టిన రోజైన ‘భాద్రపద శుద్ధ చవితి’ రోజునే ‘వినాయక చవితి’ పండుగను హిందువులు జరుపుకుంటారు. వినాయక చవితి రోజున ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికి వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి, ఇంటిని అలంకరించాలి. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్లెంలో బియ్యంవేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరువత్తులు వెలిగించి, దీపారాధన తర్వాత ఈ కింది మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ పూజను ప్రారంభించాలి. శ్లోకం: ‘ఓం ...

Read More »

మై డియర్ ఫ్రెండ్.. చిరుకు మోహన్ బాబు బర్త్‌డే విషెస్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇవాళ రెండు పండగలు చేసుకుంటున్నారు. వినాయక చవితితో పాటు ఇవాళ ఆయన తన పుట్టినరోజు వేడుకల్ని కూడా చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా చిరుకు కుటుంబ సభ్యులతో పాటు.. టాలీవుడ్‌ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మంచు మోహన్ బాబు చిరుకు ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ తెలిపారు. ‘చిరంజీవి నాకు మంచి మిత్రుడు, అతని పేరులోనే ఉంది చిరంజీవి అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. అంటే నిండు నూరేళ్ళు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ ...

Read More »

జాంబీరెడ్డి మోషన్‌ పోస్టర్‌ విడుదల

జాతీయ అవార్డు పొందిన ‘అ’ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌వర్మ దర్శకత్వం వహిస్తోన్న మూడోచిత్రం ‘జాంబీరెడ్డి’. నిజ జీవిత ఘటనలను ఆధారం చేసుకుని జాంబిరెడ్డి సినిమా రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టైటిల్‌ లోగో పోస్టర్‌, హాలీవుడ్‌లో తయారైన వెన్ను జలదరింపజేసే యానిమేషన్‌ పోస్టర్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. కర్నూలు బ్యాక్‌డ్రాప్‌లో కరోనా కనెక్షన్‌తో ఈ సినిమాని తీస్తున్నట్లు ఇదివరకే ప్రశాంత్‌వర్మ ప్రకటించారు. ఈ రోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మోషన్‌ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో ‘వీరహనుమాన్‌ నాట్యమండలి’ ...

Read More »

రేపు మరో అల్పపీడనం.. ఏపీలో ఆ ప్రాంతాలకు భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వరుసగా వానలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు, నదులు, చెరువులు పొంగుతున్నాయి. మరోవైపు ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు రావడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే వర్షాలు మరో రెండు రోజుల పాటు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. తూర్పు మధ్యప్రదేశ్‌ మధ్య భాగం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్లు ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కూడా ...

Read More »

కొలువు తీరిన ఖైరతాబాద్ గణేష్.. భక్తులకు అనుమతి లేదు

తెలంగాణలో వినాయక చవితి వేడుకలంటే అందరి దృష్టి ఖైరతాబాద్ గణపతిపైనే. ప్రతీ ఏటా ఇక్కడ అతి పెద్ద విగ్రహం కొలువు తీరుతోంది. ప్రతీ ఏటా వేలాది భక్తుల పూజలు అందుకుంటాడు ఇక్కడ బొజ్జ గణపయ్య. ఈసారి ఖైరతాబాద్‌లోని గణపయ్య ధన్వంతరి నారాయణుడిగా భక్తులకు దర్శనిమస్తున్నాడు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ సారి విగ్రహం నిర్మాణాన్ని కేవలం 9 అడుగులకే పరిమితం చేశారు. కొవిడ్‌ మహమ్మారికి ఔషధం తెచ్చే ధన్వంతరి నారాయణ గణపతిగా స్వామి దర్శనమిస్తున్నారు. చేతిలో వనమూలికలు, వైద్య పుస్తకంతో ఉన్న వినాయకుడికి కుడివైపున ...

Read More »

ఎంపి మోపిదేవి వెంకటరమణకు తప్పిన ప్రమాదం

రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రయాణిస్తున్న వాహనం, ఆయన కాన్వాయ్ లోని వేరొక వాహనాన్ని ఢకొీట్టింది. కశింకోట మండలం తాళ్లపాలెం జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం… విజయవాడ నుంచి విశాఖపట్నానికి ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ వేర్వేరు వాహనాల్లో తన కాన్వాయ్ తో వెళ్తున్నారు. తాళ్లపాలెం జంక్షన్లో మోపిదేవి వెంకటరమణ ప్రయాణస్తున్న వాహనం కాన్వయ్ లోని ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొంది. దీంతో, మోపిదేవి ...

Read More »

కరోనా పై సీఎం జగన్ సమీక్ష

కోవిడ్‌-19 పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ, కోవిడ్‌-19 ఆస్పత్రుల సంఖ్యను 138 నుంచి 287కు పెంచినట్లు తెలిపారు. స్పెషలిస్టులను, డాక్టర్లను వీలైనంత త్వరగా అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్‌-19 కార్యక్రమాల్లో తాత్కాలికంగా నియమిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు పెంచాలని సీఎం జగన్‌ ఆదేశించారు. కోవిడ్‌ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, వైద్యులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు లోపాలను, సిబ్బంది ...

Read More »