Monthly Archives: September 2020

రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌.. ‘ఆదిపురుష్‌’ నుంచి మరో అప్‌డేట్‌!

పాన్‌ ఇండియా స్టార్‌గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న టాలీవుడ్‌ యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అనూహ్యంగా ‘ఆదిపురుష్‌’ను ప్రకటించి టాలీవుడ్‌ను, అభిమానులను ఆశ్చర్యపరచిన సంగతి తెలిసిందే.. ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్‌డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్‌ కనిపించనుండగా ఆ పాత్రకు దీటుగా అంతే ప్రధాన్యత ఉన్న రావణుడి పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఓం రౌత్‌ ...

Read More »

వైఎస్‌ఆర్‌కు కుటుంబసభ్యుల నివాళులు

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, ఇతర కుటుంబసభ్యులు పాల్గన్నారు. వీరితో పాటు టిటిడి చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, రవీంద్రనాథ్‌ రెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డి తదితరులు పాల్గన్నారు.

Read More »

దేశంలో కొత్తగా 78,357 కేసులు.. 1,054 మరణాలు నమోదు!

దేశంలో కరోనా తీవ్రత ఏ మాత్రమూ తగ్గలేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 78,357 కేసులు నమోదయ్యాయి. ఇలా 70 వేలకు పైగా వరుసగా ఇది నాలుగో సారి నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తంగా బుధవారం నాటికి కేసుల సంఖ్య 37 లక్షల 69 వేలకు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 1,045 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 66,333కు చేరుకుంది. కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 29,01,908 మంది డిశ్చార్జ్‌ కాగా, ...

Read More »

సుశాంత్ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌

సుశాంత్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాచక్రవర్తి సోదరుడు, నటుడు షోయిక్‌కి డ్రగ్స్‌ సరఫరా చేసిన ఇద్దరు వ్యక్తులను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిబి) బుధవారం అరెస్ట్‌ చేసింది. ఈ నిందితులకు సుశాంత్‌ మేనేజర్‌ శామ్యూల్‌ మిరాండాతో సంబంధాలు ఉన్నాయని, షోయిక్‌ సూచనల మేరకే మిరాండాకు డ్రగ్స్‌ ఇచ్చేవారని ఎన్‌సిబి తెలిపింది. షోయిక్‌, మిరాండాల మధ్య వాట్సప్‌ చాట్‌ల ఆధారంగా బాంద్రాకు చెందిన అబ్దుల్‌ బాసిత్‌ పరిహార్‌, అంథేరికి చెందిన జైద్‌ విలత్రాలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. ఇద్దరు నిందితులను పోలీసుల కస్టడీని కోరుతూ కోర్టులో ...

Read More »

ప్రణబ్ జీ ఇక సెలవు.. ఢిల్లీలో ముగిసిన అంత్యక్రియలు

ఢిల్లీ: లోధీ శ్మశాన వాటికలో కుటుంబ సంప్రదాయాల ప్రకారం మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం.. సైనిక లాంఛనాలతో ప్రణబ్ భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది ప్రణబ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 10 రాజాజీ మార్గ్‌లోని ప్రణబ్ నివాసం నుంచి ఆయన పార్థీవ దేహాన్ని అంబులెన్స్‌లో శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. సాధారణంగా ప్రముఖుల అంతిమ యాత్ర పుష్పాలతో అలంకరించిన గన్ క్యారేజీ వాహనంలో సాగుతుంది. కానీ కరోనా కారణంగా అంబులెన్స్‌లో ప్రణబ్ పార్థీవ దేహాన్ని ...

Read More »

బాలాపూర్ లడ్డూ వేలం రద్దు

బాలాపూర్ లడ్డూ వేలం రద్దు

కరోనా వైరస్ జనం ప్రతీ ఏటా ఘనంగా చేసుకునే.. పండగలు పబ్బాలపై నీళ్లు చల్లింది. అన్ని పండగలు ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సైలంట్‌గా జరిగిపోతున్నాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలు కూడా అలాగే ముగిశాయి. ఇక ఇవాళ మహా నిమజ్జన వేడుక సైతం కళ తప్పింది. ప్రతీ ఏటా ఎంతో ఘనంగా జరిగే బాలాపూర్ లడ్డూ వేలం సైతం ఈసారి కరోనా వైరస్ కారణంగా రద్దు అయ్యింది. బాలాపూర్ లడ్డూకు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ లడ్డూను దక్కించుకునేందుకు చాలామంది పోటీ పడుతుంటారు. ...

Read More »

శశికళకు భారీ షాక్‌.. 65 ఆస్తులు అటాచ్‌ చేసిన ఆదాయపు పన్ను శాఖ!

జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా నిరూపితమై, ప్రస్తుతం బెంగళూరు జైల్లో శిక్షను అనుభవిస్తున్న శశికళకు ఆదాయపు పన్ను శాఖ భారీ షాక్‌ ఇచ్చింది. ఆమెకు చెందిన రూ.300 కోట్ల నగదుతో పాటు, 65 ఆస్తులను అటాచ్‌ చేసింది. అమె పలు షెల్‌ కంపెనీల ద్వారా బినామీ కంపెనీలను ఏర్పాటు చేసుకుని, వాటి ద్వారా కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టినట్టు ఐటి శాఖ గుర్తించింది. ముఖ్యంగా 1995 మార్చి 9న ‘శ్రీహరి చందన ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరిట ఏర్పాటు చేసిన కంపెనీ లావాదేవీలన్నీ అక్రమమేనని ...

Read More »

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి పెద్ద సర్‌ప్రైజ్‌ రెడీ అవుతోందా?

త్రివిక్రమ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కలయికలో మరో భారీ చిత్రం తెరపైకి రానున్న విషయం తెలిసిందే. ‘అరవింద సమేత వీరరాఘవ’ వంటి ఫ్యాక్షన్‌ మూవీ తరువాత మరోసారి వీరిద్దరూ కలిసి ఓ సినిమాకు కమిట్‌ అయ్యారు. ఎన్టీఆర్‌ 30వ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్‌, ఎస్‌.రాధాకష్ణ నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. సమకాలీన రాజకీయాలపై మాటల మాంత్రికుడి వ్యంగ్యాస్త్రంగా ఈ సినిమా వుంటుందని ముందు ప్రచారం జరిగింది. అయితే రెగ్యులర్‌ ఫ్యామిలీ యాక్షన్‌ ...

Read More »

సంగీత దర్శకుడు కీరవాణి ప్లాస్మా దానం

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ప్లాస్మా దానం చేశారు. కీరవాణి, రాజమౌళి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌ వచ్చిన సమయంలోనే తాము కరోనా వైరస్‌ను జయిస్తామని, ప్లాస్మాను దానం చేస్తామని తెలిపారు. ప్రస్తుతం వారు, వారి కుటుంబసభ్యులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పుడు కీరవాణి, ఆయన తనయుడు కాలభైరవ కిమ్స్‌ హాస్పిటల్‌లో ప్లాస్మాను దానం చేశారు. ఈ విషయాన్ని కీరవాణి ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ‘కిమ్స్‌ హాస్పిటల్లో నేను, నా కొడుకు భైరవ స్వచ్చదంగా ప్లాస్మాను డొనేట్‌ చేశాం. రక్తదానం చేసినట్లే అనిపించింది. ప్లాస్మా ...

Read More »