Monthly Archives: September 2020

రాజ్యసభ నుండి వాకౌట్ చేసిన ప్రతిపక్షాలు

ఎనిమిది మంది ఎంపిలపై సస్పెన్షన్‌ వేటును వ్యతిరేకిస్తూ.. ప్రతిపక్షాలు మంగళవారం రాజ్యసభ నుండి వాకౌట్‌ చేశాయి. అనంతరం సస్పెన్షన్‌ వేటు పడిన ఎంపిలకు మద్దతుగా పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేపట్టాయి. ఎనిమిది మంది సభ్యుల సస్పెన్షన్‌ను రద్దు చేయడంతో పాటు మూడు కీలక డిమాండ్లను కేంద్రం ఆమోదించేవరకు రాజ్యసభ కార్యకలాపాలను బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ ప్రకటించారు.కాగా, సోమవారం రాజ్యసభలో సస్పెండ్‌ వేటు పడిన ఎంపిలు రాత్రి నుండి పార్లమెంట్‌ ఆవరణలోనే ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే.

Read More »

యువ హీరో ప్లాన్‌ భలే..

యువ హీరో కార్తికేయ గుమ్మకొండ ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో యూత్‌ ఆడియన్స్‌ కి బాగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ‘గుణ 369’ ‘హిప్పీ’ ’90 ఎంఎల్‌ ‘గ్యాంగ్‌ లీడర్‌’ వంటి సినిమాలలో నటించాడు. కార్తికేయ ప్రస్తుతం ”చావు కబురు చల్లగా” అనే మూవీలో నటిస్తున్నాడు. గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌ లో అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాస్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కొత్త దర్శకుడు కౌశిక్‌ పెగళ్ళపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌ గా నటిస్తోంది. తాజాగా ఈ ...

Read More »

ఫేస్‌బుక్‌కు మరోసారి నోటీసులు

 ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌ ఇండియాకు ఢిల్లీ అసెంబ్లీ శాంతి, సామరస్య కమిటీ మరోసారి నోటీసులు జారీ చేసింది. బుధవారం జరిగే విచారణకు హాజరుకావాలని, హాజరుకావడానికి నిరాకరిస్తే శిక్షాత్మక చర్యలు ఉంటాయని ఫేస్‌బుక్‌ ఇండియా అధిపతి అజిత్‌ మోహన్‌కు శుక్రవారం జారీ చేసిన నోటీసుల్లో కమిటీ హెచ్చరించింది. ‘నోటీసును విస్మరించడం, ఖండించడం ఉద్దేశపూర్వకంగా చేసిన ఉల్లంఘన చర్యగా పరిగణించబడుతుంది. తద్వారా ఫేస్‌బుక్‌ ఇండియాకు వ్యతిరేకంగా ప్రారంభించిన వివిధ చర్యలకు ప్రేరేపించబడుతుంది’ అని కమిటీ చైర్‌పర్సన్‌ రాఘవ్‌ చధా ఒక ప్రకటనలో తెలిపారు. ఫేస్‌బుక్‌కు ...

Read More »

ఏసీబీ కస్టడీకి మెదక్ అదనపు కలెక్టర్ నగేష్

మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ తో పాటు మిగితా నలుగురు నిందితులు ఏసీబీ కస్టడీకి తరలించారు. ప్రస్తతుం హైదరాబాద్ చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్నారు. జైలు నుండి బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంకు ఐదుగురు నిందితులను తరలిస్తున్నారు. నర్సాపూర్ మండలం చిప్పలతుర్తి గ్రామంలోని సర్వే నెంబర్ 58.59 లోని 112 ఎకరాల భూమికి సంబంధించిన noc ఇవ్వడం కోసం కోటి 12 లక్షలు లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులకు అడిషనల్ కలెక్టర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితులకు పీపీ ...

Read More »

సోషల్‌ డైలమా చూశా.. భయమేసింది.. సమంత

సాంకేతికత కొత్త పుంతలు తొక్కడం వల్ల ప్రయోజనం ఎంతో నష్టమూ అంతే. ఏ చిన్న అవకాశం దొరికినా టెక్నాలజీని ఉపయోగించుకుని వ్యక్తిగత సమాచారాన్నంతా లాగేసి ఇబ్బంది పెట్టే వ్యక్తులు బాగా పెరిగిపోయారు. ఈ విషయంలో సెలబ్రెటీలైన తమకు కూడా ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయని అంటోంది హీరోయిన్‌ సమంత. నెట్‌ ఫ్లిక్స్‌లో ఈ మధ్య ‘సోషల్‌ డైలమా’ అనే డాక్యుమెంటరీ చూశానని.. అది చూసినపుడు చాలా భయం కలిగిందని.. ప్రస్తుతం మన జీవితాలను ‘డేటా’ అనే అంశం శాసిస్తోందని.. వ్యక్తులకు ప్రైవేట్‌ లైఫ్‌ అన్నదే లేకుండా ...

Read More »

బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్..ఆ ఇద్దరూ డేంజర్ జోన్‌లో

నిజానికి తొలివారంలోనే కరాటే కళ్యాణి ఎలిమినేషన్‌కి నామినేట్ కానప్పటికీ.. చాలామంది ఆమె ఆటతీరుపై అసహనం వ్యక్తం చేశారు. కళ్యాణి తొలివారం జస్ట్ మిస్.. లేదంటే సీజన్ 3లో నటి హేమను పంపించినట్టుగానే తొలివారమే బ్యాగ్ సర్దించేవాళ్లమంటూ విపరీతంగా కామెంట్స్ వినిపించాయి. అయితే రెండో వారం నామినేషన్స్‌లోకి వచ్చిన తొమ్మది మందిలో కరాటే కళ్యాణి ఉండనే ఉంది. గంగవ్వ, నోయల్, కరాటే కళ్యాణి, మొనాల్ గజ్జర్, సొహైల్, అమ్మా రాజశేఖర్ కుమార్ సాయి, దేత్తడి హారిక, అభిజిత్‌‌లు రెండో వారం నామినేషన్స్‌లో ఉండగా.. వీరిలో ఈ ...

Read More »

పేటీఎంకు గూగుల్ భారీ షాక్

టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా మొబైల్ వాలెట్ సంస్థ పేటీఎంకు భారీ షాకిచ్చింది. ఒక్కదెబ్బతో పేటీఎంను కనిపించకుండా చేసింది. అంటే గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించింది. దీనికి కూడా ఒక ప్రధాన కారణంగా ఉంది. గ్యాంబ్లింగ్ యాప్‌ను తన ప్లాట్‌ఫామ్‌పై ప్రోత్సహించమని గూగుల్ స్పష్టం చేసింది. అందుకే గూగుల్ ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్‌ను తొలగించినట్లు స్పష్టం చేసింది. గూగుల్ తన బ్లాగ్‌లో ఇండియాలో గ్యాంబ్లింగ్ పాలసీపై ఒక పోస్ట్ చేసింది. ఇందులో గ్యాంబ్లింగ్‌కు సంబంధించిన విషయాలను హైలైట్ చేసింది. ‘తమ కస్టమర్లకు సురక్షితమైన ...

Read More »

రాజ్యసభ ఎంపి అశోక్‌ గస్తీ కరోనాతో మృతి

రాజ్యసభ ఎంపి, కర్ణాటక బిజెపి నేత అశోక్‌ గస్తీ (55)కరోనాతో కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యం బారిన పడిన ఆయన మణిపాల్‌ ఆసుపత్రిలో చేరారు. అనంతరం నిర్వహించిన పరీక్షలో కరోనా పాజిటివ్‌ అని తేలింది. కరోనాకు చికిత్స పొందుతూ గురువారం రాత్రి 10.31 గంటలకు మృతి చెందినట్లు ఆసుపత్రి డైరెక్టర్‌ మనీష్‌రారు తెలిపారు. న్యూమోనియాతో కూడిన కోవిడ్‌-19 లక్షణాలతో ఆసుపత్రిలో చేరగా, పలు అవయవాల పనితీరు వైఫల్యం చెందడంతో ఆయన పరిస్థితి విషమంగా మారిందని, ఐసియులో లైఫ్‌ సపోర్ట్‌పై ఉంచి చికిత్స అందిచామని చెప్పారు. ఉత్తరకర్ణాటకలోని ...

Read More »

ఐపిఎల్‌కు దుబాయ్‌ ముస్తాబు.. చెన్నై-ముంబై మధ్య ఫస్ట్‌ మ్యాచ్‌!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌) రానే వచ్చింది. మార్చి 29 నుంచే మొదలవ్వాల్సిన ఐపిఎల్‌.. కరోనా కారణంగా వాయిదా పడింది. టి20 ప్రపంచకప్‌ కూడా వాయిదా పడటంతో ఐపిఎల్‌ నిర్వహణకు లైన్‌ క్లియర్‌ అయింది. అయితే భారత్‌లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటం, దుబాయ్‌లో కేసుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఐపిఎల్‌-2020 లీగ్‌ను యుఎఇలో సెప్టెంబరు 19 నుంచి నిర్వహించేందుకు బిసిసిఐ నిర్ణయించింది. దీంతో కరోనా వల్ల ఇళ్లకే పరిమితమైన జనాలకు ఇప్పుడు ఈ లీగ్‌ కాస్త ఊరట కలిగిస్తుందని ...

Read More »

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. వేడుకలకు దూరం

ప్రధాని నరేంద్ర మోదీ 70వ జన్మదినం సందర్భంగా ఆయనకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని తన పుట్టినరోజును ఎటువంటి హంగూ ఆర్బాటం లేకుండా అత్యంత సాధారణంగా జరుపుకుంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారు. పుట్టినరోజు నాడు అమ్మ వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకోవడం లేదా సాధారణ ప్రజానీకంతో గడపడం ఆనవాయితీ. తొలిసారి 2014లో ప్రధాని హోదాలో పుట్టినరోజు నాడు తన మాతృమూర్తి హీరాబెన్‌ను కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.

Read More »