Monthly Archives: October 2020

చలో గుంటూరు జైలు ఉద్రిక్తం.. గృహనిర్బంధంలో పలువురు నేతలు..

రాజధాని ఎస్‌సి ఐకాస, అమరావతి పరిరక్షణ సమితి నేతల పిలుపు మేరకు.. శనివారం చేపట్టిన చలో గుంటూరు జైలు ఉద్రిక్తంగా మారింది. అమరావతి రైతులను అరెస్టు చేసి వారికి బేడీలు వేసి తరలించినందుకు నిరసనగా.. చలో గుంటూరు జైలుకు పిలుపునిచ్చిన రాజధాని ఎస్‌సి ఐకాస, అమరావతి పరిరక్షణ సమితి నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. రైతులను రిమాండ్‌లో ఉంచిన జైలు వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జైలు పరిసరాల్లోకి ఎవ్వరూ రాకుండా ఆంక్షలను ...

Read More »

ఘనంగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి

శుక్రవారం ప్రముఖ నటి కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి చేసుకున్న ఫొటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నమే పెళ్లికూతురుగా ముస్తాబైన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేయగా, ‘సో ప్రెట్టి’ అంటూ… మంచులక్ష్మీ ప్రసన్న కితాబిచ్చిన సంగతి తెలిసిందే. వైరల్‌ అవుతోన్న కాజల్‌ పెళ్లిఫొటోలపై మనమూ ఓ లుక్కేద్దాం..!

Read More »

పసుపు పండగలో పెళ్లికూతురు కాజల్‌

మరికొన్ని గంటల్లో టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ తన బ్యాచిలర్‌ జీవితానికి గుడ్‌బై చెప్పనున్నారు.  రేపు చందమామ కాజల్‌ అగర్వాల్‌ ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. అక్టోబర్‌ 30న తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్‌ కిచ్లును వివాహమాడనున్న విషయం తెలిసిందే. పెళ్లి పనులన్నీ కాజల్‌ సోదరి నిషా అగర్వాల్‌ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పటికే కాజల్‌ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా బుధవారం మెహెందీ ఫంక్షన్‌ నిర్వహించగా.. నేడు(గురువారం) హల్దీ, వేడుకలను నిర్వహించారు. పసుపు రంగు దుస్తులు, పువ్వుల రూపంలో ఏర్పాటు ...

Read More »

ఎపిలో భారీగా పెరిగిన ఇంటర్నెట్‌ డేటా వినియోగం

కరోనా లాక్‌డౌన్‌ తరువాత రాష్ట్రంలో ఇంటర్నెట్‌ డేటా వాడకం జోరందుకుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు టెలికం కంపెనీలు, బ్రాడ్‌ బ్యాండ్‌, ఫైబర్‌నెట్‌ ప్రొవైడర్లు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. ” గతంలో వారంలోని అన్ని రోజులూ.. వారాంతాలకు డేటా వినియోగంలో చాలా తేడా ఉండేది. ప్రస్తుతం వారంలోని అన్ని రోజులూ ఒకే తరహా డేటా వినియోగం కనిపిస్తోంది. అది అంతకంతకూ పెరుగుతోంది.” అని సంస్థలు ధ్రువీకరిస్తున్నాయి. జియో డేటా వినియోగం ప్రస్తుతం సగటున రోజుకు 6,000 టీబీ. లాక్‌డౌన్‌ తర్వాత దాదాపు ఇది ...

Read More »

5 రోజుల్లో తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు

 రానున్న ఐదు రోజుల్లో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండి) అంచనా వేసింది. తమిళనాడు, కోస్తాంధ్రకు ఉత్తర దిశగా అల్పపీడనం నెలకొందని, ఈ ప్రభావంతో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో ఐదు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని ఐఎండి గురువారం ట్విట్టర్‌ ద్వారా పేర్కొంది. వచ్చే 24 గంటల్లో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని, అదేవిధంగా ఈనెల 30తో పాటు వచ్చే నెల 1,2 తేదీల్లో కూడా రాష్ట్రంలో భారీ ...

Read More »

నవంబర్‌లో బ్యాంకులకు 8 రోజుల సెలవులు

నవంబర్‌ నెలలో దీపావళి, గురునానక్‌ జయంతి పండుగల సందర్భంగా.. దేశంలోని అన్ని ప్రైవేటు, పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులకు 8 రోజుల సెలవులను అధికారులు ప్రకటించారు. పబ్లిక్‌ హాలిడేలతోపాటు పండుగల నేపథ్యంలో.. బ్యాంకులకు 8 రోజులపాటు మూతపడనున్నాయి. నవంబరు నెలలో అయిదు ఆదివారాలు, రెండు శనివారాలు రావడంతో బ్యాంకులకు సెలవు అని, దీంతోపాటు దీపావళి, గురునానక్‌ జయంతి సందర్భంగా ఉన్న సెలవులను ప్రకటించారు. నవంబరు నెలలో బ్యాంకులు 8 రోజులు మూతపడనున్నాయని, ఖాతాదారులు సెలవు రోజుల్లో ఆన్‌లైన్‌, ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ సౌకర్యాలను వినియోగించుకోవాలని బ్యాంకు అధికారులు ...

Read More »

దేశంలో కొత్తగా 49 వేల కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. బుధవారం నాడు దేశ వ్యాప్తంగా 49,881 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80,40,203కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 517 మంది చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 1,27,527కి చేరుకుంది. నిన్న దేశవ్యాప్తంగా 56,480 మంది డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటి వరకు 73,15,989 మంది కోలుకున్నారని, ఇంకా 6,03,687 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దాదాపు 90.99 శాతం మంది కోలుకున్నారు.

Read More »

అయోధ్య అంశాన్ని ప్రస్తావించిన మోడీ

బీహార్‌ అంసెబ్లీ రెండో దశ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. బుధవారం దర్భంగ, ముజఫర్‌పూర్‌, పాట్నాల్లో జరిగిన ర్యాల్లీలో ఆయన ప్రసంగించారు. ఈ ప్రచారంలో అయోధ్య అంశాన్ని ప్రస్తావించారు. దర్భంగ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ‘ ఇది సీతాదేవి జన్మభూమి. అనేక దశాబ్ధాల పోరాటం తరువాత ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ప్రారంభమయింది. గతంలో మందిరం ఆలస్యం గురించి బిజెపిని తిట్టేవారే.. ఇప్పుడు ప్రశంసించాల్సి వస్తుంది’ అని అన్నారు. పాట్నా, ముజఫర్‌పూర్‌ ర్యాలీల్లో ఆర్‌జెడి నేత, మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వియాదవ్‌పై ...

Read More »

కరోనాతో జడ్జి మృతి

కరోనా కోరలకు ఒక జడ్జీ బలయ్యాడు. గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జీ నజీర్‌ ఇటీవల కరోనా బారిన పడ్డారు. స్థానిక కార్పొరేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందారు. కొలుకున్నాక ఇంటికి వద్దానుమనుకున్న సమయంలో ప్లేట్‌లెట్ల సంఖ్య ఆకస్మాత్తుగా పడిపోయింది. దీంతో అనారోగ్యం పాలైన ఆయన్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఆపోలో ఆసుపత్రిలో చేర్చారు. బుధవారం ఆయన చనిపోయారు. జడ్జి నజీర్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Read More »

లెక్చరర్‌గా వెంకటేశ్‌

దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ నటుడు వెంకటేశ్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్‌ లెక్చరర్‌ పాత్రలో కనిపిస్తారు. ఈ పోర్షన్‌ మొత్తం వినోదాత్మకంగా ఉంటుందని దర్శకుడు తెలిపాడు. సురేశ్‌బాబు ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం వెంకటేశ్‌ ‘నారప్ప, ఎఫ్‌ 3’ సినిమాలు ఒప్పుకున్నారు. ఇవి పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా షూటింగ్  ఆరంభం కానుంది.

Read More »