Monthly Archives: October 2020

సీఎం జగన్ ఇంట విషాదం… వైఎస్ భారతి తండ్రి కన్నుమూత..!

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మామ, వైఎస్‌ భారతి తండ్రి, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. కాగా.. గంగిరెడ్డి సీఎం వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి తండ్రి. ఆయన పులివెందులలో ప్రముఖ వైద్యులుగా ఉన్నారు. పులివెందుల చుట్టుపక్కల గ్రామాల్లో మంచి హస్తవాసి వైద్యుడిగా గంగిరెడ్డికి పేరుంది. అంతేకాదు పేదల డాక్టర్‌గా మంచి గుర్తింపు పొందారు కూడా. కాంగ్రెస్ లో ...

Read More »

‘నిశ్శబ్దం’ రివ్యూ

టాలీవుడ్‌లో లేడి ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి. భాగమతి తర్వాత ఈమె నటించిన మరో చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం క్రాస్‌ జోనర్‌ మూవీ. థియేటర్స్‌ ఓపెన్‌ అయ్యే విషయంలో ఓ క్లారిటీ రాకపోవడంతో మేకర్స్‌ సినిమాను అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేశారు. తెలుగులో నిశ్శబ్దం, తమిళ, మలయాళంలో సైలెన్స్‌ పేరుతో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అనుష్క దివ్యాంగురాలి పాత్రలో నటించింది. ట్రైలర్‌తోనే ఓ హైప్‌ను క్రియేట్‌ చేయడంతో సినిమాపై ...

Read More »

ట్రంప్‌ దంపతులకు కరోనా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇంట్లో కరోనా కలకలం మొదలైంది. ట్రంప్‌తో పాటు, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌లు కరోనా బారిన పడ్డారు. తన సలహాదారు హోప్‌ హిక్్స‌కు కరోనా సోకడంతో పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ట్రంప్‌, మెలానియాకు ఇద్దరికీ కరోనా సోకినట్లు శుక్రవారం వచ్చిన ఫలితాల్లో నిర్ధారణైంది. తాముద్దిరమూ కరోనా బారిన పడ్డామని, క్వారెంటైన్‌కు వెళ్లామని ట్రంప్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముంగిట..ఇప్పటికే ప్రచారాల్లో బిజీగా గడుపుతున్న ట్రంప్‌కు కరోనా సోకడంతో ఆయన విజయావకాశాలపై పలువురు అనుమానాన్ని ...

Read More »

ఢిల్లీలో ప్రియాంక గాంధీ ధర్నా

కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ఢిల్లీలో ధర్నా చేపట్టారు. హత్రాస్‌ బాధితురాలికి న్యాయం జరగాలంటూ డిమాండ్‌ చేశారు. హత్రాస్‌ ఘటనపై దేశమంతా స్పందించాలని ఆమె కోరారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయమూ దక్కలేదని అన్నారు. అంత్యక్రియలు కూడా కుటుంబ సభ్యులు నిర్వహించలేకపోయారని పేర్కొన్నారు. ఇది మన దేశ సంప్రదాయం కానేకాదని అన్నారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకూ అంతా కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. యుపిలోని హత్రాస్‌లో దళిత యువతిపై సామూహిక అత్యాచారం చేయడంతో ఢిల్లీలో చికిత్స పొందుతూ బాధితురాలు ఇటీవల మృతిచెందిన ...

Read More »

బాపు మ్యూజియంను ప్రారంభించిన సిఎం జగన్‌

విజయవాడ బందరు రోడ్డులో ఉన్న విక్టోరియా మెమోరియల్‌ భవన ప్రాంగణంలో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునీకరించిన బాపు మ్యూజియంను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి గురువారం ప్రారంభించారు. రూ.8 కోట్లతో ఈ మ్యూజియాన్ని అభివృద్ధి చేశారు. తొలుత ప్రాంగణానికి చేరుకున్న సిఎం జగన్‌.. విక్డోరియా మహల్‌లోని బాపూజీ చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ నాయకుల విగ్రహాలను పరిశీలించారు. ఆదిమానవ చరిత్రకు సాక్షిగా నిలిచే పురాతన వస్తువులు, శిల్పకళా సంపదతోపాటు ఆధునిక హంగులతో మ్యూజియాన్ని తీర్చిదిద్దారు. 10 లక్షల ఏళ్ల చరిత్రకు సాక్షిగా నిలిచే ...

Read More »

హథ్రాస్‌ వెళ్తుండగా… రాహుల్‌ గాంధీ అరెస్టు!

యుపిలో అత్యాచారానికి గురై ఇటీవల మరణించిన బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించడానికి హాథ్రాస్‌కు బయలుదేరిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని పోలీసులు అరెస్టు చేశారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ కలిసి వెళ్తుండగా వారి కాన్వారుని గ్రేటర్‌ నోయిడా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలతో కలిసి వారు రోడ్డు మార్గాన నడుచుకుంటూ వెళ్తుండగా యమునా ఎక్స్‌ప్రెస్‌  వద్ద పోలీసులు అడ్డుకొని రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, రాహుల్‌కు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ క్రమంలో రాహుల్‌ గాంధీ కిందపడిపోయారు. ...

Read More »

డ్రగ్స్‌ కేసులో ముగ్గురు బడా హీరోలు.. వారి ఫోన్లపై ఎన్‌సిబి నిఘా

డ్రగ్స్‌ కేసులో ఇంతవరకు బాలీవుడ్‌ హీరోయిన్ల పేర్లు మాత్రమే వినిపించాయి.. కానీ బడా హీరోలుగా చెలామణీ అవుతున్న కొందరు ఇప్పుడు వెలుగులోకి వచ్చారు. వారు డ్రగ్స్‌ వాడుతున్నట్లు పక్కా ఆధారాలు లభ్యమయ్యాయని సమాచారం.రియా చక్రవర్తి, దీపికా పదుకొణె, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సారా అలీఖాన్‌, తదితరులను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిబి) ఇప్పటికే విచారించింది. కొందరు హీరోయిన్ల మొబైల్‌ ఫోన్లలో గతంలో డిలీట్‌ అయిన డేటాను ఎన్‌సిబి తాజాగా పునరుద్ధరించింది. డ్రగ్స్‌ వినియోగానికి సంబంధించి ఇందులో కీలక వివరాలు ఉన్నట్లు సమాచారం. ఈ సమాచారం ఆధారంగా ...

Read More »