Monthly Archives: November 2020

వంద రోజుల మహిళా మార్చ్‌ బ్రోచర్‌ ను విడుదల చేసిన ‌ జగన్

శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో వంద రోజుల మహిళా మార్చ్‌ బ్రోచర్‌ ను సిఎం వైఎస్‌ జగన్‌ సోమవారం విడుదల చేశారు. నవరత్నాలు, ప్రభుత్వ పథకాల అమలు.. వాటిపై అవగాహనతోపాటు దశలవారీ మద్యపాన నిషేధం, దిశ యాప్‌, ఇతర చట్టాలు, హెల్ప్‌ లైన్‌ నంబర్ల పై మార్చి 8 వరకు వంద రోజుల కార్యాచరణను ఎపి మహిళా కమిషన్‌ రూపొందించింది. వంద రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాలేజీ విద్యార్ధినులకు రక్షణ టీం లు, సైబర్‌ నేరాలపై అవగాహన సదస్సులను మహిళా కమిషన్‌ నిర్వహించనుంది. ఈ ...

Read More »

అసెంబ్లీ లో సంతాప తీర్మానాలు

సంతాప తీర్మానాలు ఆమోదించిన తర్వాత శాసనసభను స్పీకర్‌ తమ్మినేని సీతారాం కొద్దిసేపు వాయిదా వేశారు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసన మండలిలో కూడా ప్రణబ్‌ ముఖర్జీ, ఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాటు మాజీ ఎమ్మెల్సీల మృతికి సంతాప తీర్మానాలను ఆమోదించారు.

Read More »

పంచాయతీరాజ్‌ సవరణ చట్టానికి ఆమోదం, టిడిపి వాకౌట్‌

 పంచాయితీరాజ్‌ చట్టానికి గతంలో అసెంబ్లీ ఆమోదించి పంపిన సవరణ బిల్లును మరోసారి సోమవారం శాసనసభ ఆమోదించింది. దీనిపై శాసనమండలి ద్వారా కొన్ని సవరణలు ప్రతిపాదించి అసెంబ్లీకి తిప్పి పంపగా వాటిని అసెంబ్లీ తిరస్కరించింది. ఇంతకముందు చేసిన బిల్లును యధాతథంగా ఆమోదించింది. దీనిపై ప్రతిపక్ష తెలుగుదేశం అభ్యంతరం వ్యక్తం చేసింది. మండలి ప్రతిపాదించిన సవరణలపై అసెంబ్లీలో చర్చ జరపాలని డిమాండ్‌ చేసింది. టిడిపి డిమాండ్‌ను స్పీకర్‌ తోసిపుచ్చారు. దీనికి నిరసనగా టిడిపి వాకౌట్‌ చేసింది. కొత్త సవరణ ప్రకారం పంచాయితీ రాజ్‌ ఎన్నికల్లో డబ్బు గానీ, ...

Read More »

ఆ స్టార్‌ హీరోని పెళ్లి చేసుకోవాలనుకున్నా: మంచు లక్ష్మీ

మంచు లక్ష్మీ నటిగా, వ్యాఖ్యాతగా, నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. ఇటీవల మంచు లక్ష్మీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తాను ఓ స్టార్‌ హీరోను పెళ్లి చేసుకోవాలనుకున్నానని, అయితే తనకు పెళ్లి అవుతున్నప్పుడు చాలా బాధడ్డానని చెప్పుకొచ్చింది. ఆ హీరోకి పెళ్లి అవుతుంటే చాలా ఏడ్చేసిందట! మరి మంచు లక్ష్మీని ఇంతలా ఏడ్చించిన ఆ స్టార్‌ హీరో ఎవరా అనుకుంటున్నారా? ఈ అమ్మడు బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ ఖాన్‌పై మనసు పారేసుకుందట! తనను పెళ్లి కూడా ...

Read More »

తీరం దాటిన తుపాను…పలు చోట్ల భారీ వర్షాలు

నివర్‌..షివర్‌ పుట్టిస్తోంది. పుద్చుచేరి సమీపంలో తీరం దాటి అతి తీవ్ర తుపాను నుండి తీవ్ర తుపానుగా బలహీనపడింది. బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి, గురువారం తెల్లవారు జామున 2.30 గంటల మధ్య నివర్‌ తుపాన తీరం దాటినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తుపాను అలజడికి తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. చలికి తోడు, వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు బెంబెలెత్తుతున్నారు. తుపాను తీరం దాటాక గంటకు 120-145 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. ...

Read More »

నివర్‌ తుఫాన్.. భారీగా కురుస్తున్న వర్షాలు

నివర్‌ తుపాన్‌ బుధవారం తీరం దాటింది. పుద్చుచేరి సమీపంలో తీరం దాటి అతి తీవ్ర తుపాను నుండి తీవ్ర తుపానుగా బలహీనపడింది. బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి, గురువారం తెల్లవారు జామున 2.30 గంటల మధ్య నివర్‌ తుపాన తీరం దాటినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈదురుగాలులు 100-110కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అవి గంటకు 120 వేగం వరకు పుంజుకుంటాయని వాతారణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు భారత్‌లో వచ్చిన ఏడు రకమైన తుపానుల్లో..ఇది ఐదవదని, బలమైనదని చెప్పారు. ...

Read More »

పెను తుఫానుగా నివర్‌..

బంగాళాఖాతంలో కొనసాగుతున్న నివర్‌ తుఫాను మరికొన్ని గంటల్లో పెను తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం అర్థరాత్రికి లేదా గురువారం ఉదయానికి కరైకల్‌-మమల్లపురం వద్ద తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం సాయంత్రం కడలూరుకి 180 కిమీలు, పుదుచ్చేరికి 190 కిమీల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది. తుపాను గంటకు 11 కిమీల వేగంతో తీరం వైపుగా కదులుతున్నట్లు తెలిపింది. కొన్ని గంటల్లో పెను తుఫానుగా మారుతుందని తెలిపింది. తీరం దాటే సమయంలో గాలుల వేగం 120 కిమీల నుంచి ...

Read More »

ఆస్కార్‌ బరిలో ‘జల్లికట్టు’

మరో మలయాళ చిత్రం తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. లిజో జోసి పెల్లిస్సెరీ దర్శకత్వం వహించిన ‘జల్లికట్టు’ చిత్రం 93వ ఆస్కార్‌ పురస్కారాల పోటీకి భారతదేశం తరపున వెళ్లనుంది. ఉత్తమ చిత్రాల పోటీలో నిలవనుంది. ”శకుంతలాదేవి, గుంజన్‌ సక్సేనా, ఛపాక్‌, గులాబో సితాబో, చెక్‌పోస్ట్‌, స్కై ఈజ్‌ పింక్‌.. వంటి 27 చిత్రాలను పరిశీలించిన అనంతరం జల్లికట్టును ఎంపిక చేసినట్లు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా జ్యూరీ బోర్డ్‌ చైర్మన్‌ రాహుల్‌ రావైల్‌ తెలిపారు. మనుషుల్లో దాగున్న క్రూరత్వాన్ని, జంతువుల పట్ల మానవుల తీరును ...

Read More »

దేశంలో మళ్లీ కరోనా విజృంభణ

దేశంలో కరోనా తగ్గుముఖం పట్టినట్లు పట్టి, మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో నమోదైన గణాంకాలే అందుకు నిదర్శనం. గత 24 గంటల్లో దేశంలో 44, 376 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 92, 22, 217కు చేరువైంది. గడిచిన 24 గంటల్లో 37, 816 మంది కోలుకోగా, మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య కూడా 86 లక్షలను దాటింది. అదేవిధంగా 481 మంది మృతి చెందగా, ఇప్పటి వరకు 1,34, 699 మంది కరోనాకు బలయ్యారు. భారత్‌లో ...

Read More »

తమిళనాడును వణికిస్తున్న ‘నివర్‌’..

 ‘నివర్‌’ తుపాన్‌ తమిళనాడును వణికిస్తోంది. అతి తీవ్ర తుపాన్‌గా మారి తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా ముంచుకొస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు ‘నివర్‌’ ప్రభావం ఉండటంతో ఎపిలోని తుపాన్‌ ప్రభావిత కొన్ని జిల్లాల్లో అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. సముద్రంలో ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ ఉండటంతో తుపాన్‌ మరింత బలపడుతూ తీరంవైపుగా వస్తోంది. చెన్నైకి ఆగేయంగా 330 కిలోమీటర్ల దూరంలో నివర్‌ తుపాన్‌ కొనసాగుతోంది. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌ వైపు దూసుకొస్తోంది. బుధవారం సాయంత్రం కరైకల్‌, మామళ్లపురం మధ్య తీరాన్ని తాకుతుందని, తీరం దాటే సమయంలో తుపాన్‌ మరింత ...

Read More »