Monthly Archives: December 2020

15 రోజుల పాటు ఇళ్ల పండగ : జగన్‌

పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని, 15 రోజుల పాటు ఇళ్ల పండగ జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొమరగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 28.30లక్షల ఇళ్లస్థలాల్లో ఇళ్లు, మరో 2.62 లక్షల టిడ్కో ప్లాట్లు పంపిణీ చేస్తున్నామని వివరించారు. వైకుంఠ ఏకాదశి, క్రిస్‌మస్‌ సందర్భంగా మహిళలకు ఇళ్ల పట్టాలను అందజేయడం ఆనందంగా ఉందన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు మొక్కుబడిగా ...

Read More »

రైతుల ఖాతాల్లోకి రూ.18 వేల కోట్లువిడుదల చేసిన మోడీ!

కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతుల ఖాతాల్లోకి రూ.18 వేల కోట్లు విడుదల అయ్యాయి. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ‘కిసాన్‌ కల్యాణ్‌ సమ్మేళన్‌’ పేరిట మధ్యప్రదేశ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌ విధానంలో పాల్గొన్నారు. అంతకుముందు కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం ద్వారా రూ.18 వేల కోట్లు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 9 కోట్ల మంది రైతులకు ఈ నిధి అందనున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు తరహాలోనే కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ ...

Read More »

వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద జగన్‌ నివాళి

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండలంలోని ఇడుపులపాయలో తన తండ్రి కీర్తిశేషులు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద గురువారం నివాళులర్పించారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలో బస చేసిన ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి గురువారం తన గెస్ట్‌ హౌస్‌ నుండి వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్దకు 9.45 గంటలకు చేరుకున్నారు. అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గన్నారు. ముఖ్యమంత్రి వెళ్లిన తర్వాత జగన్‌ తల్లి విజయమ్మ, సతీమణి భారతి, చెల్లెలు షర్మిల కూడ నివాళులర్పించారు. కోవిడ్‌ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద ...

Read More »

మహేష్‌ బాబు‌ ఫ్యామిలీకి పవన్‌ దంపతుల కానుకలు.

డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ వేడుకలను ప్రపంచం మొత్తం ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా ఒకరికి ఒకరు కానుకలు ఇచ్చిపుచ్చుకుని తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ఈ నేపథ్యంలోనే పవర్‌ స్టార్‌, అన్నా లెజినోవా దంపతులు సూపర్‌ స్టార్‌ మహేష్‌ ఫ్యామిలీకి క్రిస్మస్‌ గిఫ్ట్‌ పంపారు. ఈ విషయాన్ని మహేష్‌ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పేర్కొంది. అంతేగాక పవన్‌ దంపతులకు నమ్రత కూడా కృతజ్ఞతలు తెలియజేసింది. పవన్‌ సతీమణి అన్నా లెజినోవా రష్యన్‌.. ఆమె క్రిస్టియన్‌. అందువల్ల పవన్‌ దంపతులు క్రిస్మస్‌ ...

Read More »

సెకండ్‌ వేవ్‌పై పూర్తి స్థాయిలో అప్రమత్తం : మంత్రి ఆళ్ల నాని

రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విషయంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఎపి డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జాగ్రత్తలు చేపట్టిందని పేర్కొన్నారు. కరోనా కొత్త వైరస్‌ ప్రయాణికుల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉందని భావిస్తుండడంతో విమాన ప్రయాణికుల రాకపోకలపై ప్రత్యే దృష్టి పెట్టాలని సిఎం జగన్మోహన్‌ రెడ్డి ఆదేశించారని ...

Read More »

జగన్‌ ను కలిసిన ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌

జగన్‌ క్యాంపు కార్యాలయంలో కొత్తగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆదిత్యనాథ్‌ దాస్‌, డిజిపి గౌతం సవాంగ్‌ లు బుధవారం సిఎం జగన్‌ ను మర్యాదపూర్వకంగా కలిశారు. సిఎం జగన్‌ కు ఆదిత్యనాథ్‌ దాస్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 31 న ప్రస్తుత సిఎస్‌ నీలం సాహ్ని పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు నూతన సిఎస్‌గా ఆదిత్యనాథ్‌ దాస్‌ బాధ్యతలను స్వీకరించనున్నారు.

Read More »

బిగ్‌బాస్ 4 సోహెల్‌కి మరో బంపర్‌ ఆఫర్‌

బిగ్‌బాస్‌ 4 లో మూడవ స్థానంలో నిలిచి, రూ.25 లక్షలతో పైనల్‌ పోటీ నుంచి నిష్క్రమించిన సోహెల్‌కు ఆఫర్లమీద ఆఫర్లు వస్తున్నాయి. ఫైనల్‌ ప్రోగ్రామ్‌లో మెగాస్టార్‌ చిరంజీవిని ఆయన తీసిన సినిమాకు ప్రోమో విడుదల వంటి వాటికి సహాయపడాలని సోహెల్‌ కోరగా, వెంటనే చిరంజీవి స్పందిస్తూ.. ‘నువ్వు తీయబోయే సినిమాలో ఓ గెస్ట్‌రోల్‌లో నటిస్తానని’ అన్నారు. దీనికి సోహెల్‌ ఎంతో సంతోషించారు. కామెడీ కింగ్‌ బ్రహ్మానందం నుండి తాజాగా బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. బ్రహ్మానందం తానే స్వయంగా సోహెల్‌కి ఫోన్‌ చేసి… ఆయన తీయబోయే ...

Read More »

కరోనా వైరస్‌ విజృంభిస్తోంది.. ప్రతి 33 నిమిషాలకొక కోవిడ్‌ మరణం

అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. గత వారంలో ప్రతి 33 నిమిషాలకు ఒక్కరు చనిపోతున్నట్లు రాయిటర్స్‌ నివేదికలో వెల్లడైంది. దీని ప్రకారం డిసెంబర్‌ 20తో ముగిసిన వారంలో..18 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంతకముందు వారంతో పోల్చి చూస్తే ఈ మరణాల సంఖ్య 6.7 శాతం పెరిగింది. ఏడాది చివర కావడంతో… సెలవులు రావడంతో ఎక్కువ ప్రయాణాలు చేయవద్దని, గుమిగూడవద్దని ఆరోగ్య శాఖ అధికారుల నుండి విజ్ఞప్తి వచ్చినప్పటికీ ప్రజలు వాటిని లెక్కచేయడం లేదు. కేవలం శుక్ర, శని, ఆదివారాల్లో విమానాశ్రయాల్లో 3.2 ...

Read More »

భారత్‌లోకి కరోనా కొత్త రూపం..!.

లండన్‌లో కొత్త రూపం దాల్చిన కరోనా వైరస్‌తో భారత్‌లో కలవరం మొదలైంది. ఇప్పటికే భారత్‌లో చేరి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ కొత్త వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. అయితే కొత్త వైరస్‌ ఎటువంటి ప్రభావం చూపనున్న దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. కొత్త వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి లండన్‌ నుండి వచ్చే విమానాలను భారత ప్రభుత్వం రద్దు చేసింది. లండన్‌ నుండి వచ్చిన 22 మంది ప్రయాణీకుల్ని.. ఢిల్లీకి చెందిన ఆరుగురు ప్రయాణీకులతో సహా కరోనా ...

Read More »

మహారాష్ట్ర బాటలోనే కర్ణాటక .. రాత్రిపూట కర్ఫ్యూ

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ గురించి నెలకొన్న భయాందోళనలు వీడకముందే.. కొత్త రకం కరోనా వైరస్‌ వణుకు పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాత్రిపూట కర్ఫ్యూని విధిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్న రాష్ట్రాల జాబితాలో కర్ణాటక కూడా చేరింది. కర్ణాటక ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. ఈ మేరకు ఆరోగ్యమంత్రితోనూ, సాంకేతిక కమిటీతోనూ సమావేశం జరిపిన తర్వాత ముఖ్యమంత్రి యడియూరప్ప ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బుధవారం ...

Read More »