Monthly Archives: January 2021

నిమ్మగడ్డ తీరుపై మళ్ళీ కోర్టుకు ఏపీ సర్కార్‌

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ఆయన లక్ష్మణ రేఖను దాటారని ప్రభుత్వం భావిస్తోంది. నిమ్మగడ్డ తీరును తప్పుపడుతూ.. ప్రభుత్వం త్వరలోనే గవర్నర్‌ను కలవాలని నిర్ణయించింది. అదేవిధంగా ప్రజాప్రతినిధుల విషయంలో కూడా ఎస్‌ఈసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేసే అంశంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఎస్‌ఈసి పరిధిని ఫిక్స్‌ చేసేందుకు కోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం చూస్తోంది. పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో టీడీపి మ్యానిఫెస్టోను రిలీజ్‌ చేయడంపై… టీడీపీ మ్యానిఫెస్టో పై ఎస్‌ఈసి మాట్లాడకపోవడంపై ...

Read More »

వేసవిలో రానున్న చిరంజీవి ‘ఆచార్య’

అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆచార్య టీజర్‌ వచ్చేసింది. మెగాస్టార్‌ చిరంజీవి కథనాయుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఈచిత్రం తెరకెక్కుతోంది. కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు. రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రబృందం ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం విడుదల చేసింది.ముఖ్యంగా ఈ టీజర్‌ వాయిస్‌ అంతా రామ్‌చరణే వినిపించారు. ‘ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమావనం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే.. ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు’ అనే డైలాగులతో టీజర్‌ ప్రారంభమైంది. అలాగే ‘పాఠాలు చెప్పే అలవాటు ...

Read More »

ఏడాదిలో కరోనా విజృంభణ ..దేశాలపై ప్రభావం

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమై నేటికి ఏడాదైంది. గతేడాది జనవరి 30న మొదటి కరోనా కేసు నమోదైంది. ఇప్పటివరకు 1.5 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో దేశవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో పాటు మిలియన్ల కుటుంబాలు తమ జీవనోపాధిని కోల్పోయారు. ఇప్పటికీ.. రోజుకి 12వేల నుండి 14 వేల వరకు కేసులు నమోదవుతున్నప్పటికీ.. కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ప్రభుత్వ లెక్కలు పేర్కొంటున్నాయి. అయితే ఇప్పటికీ కరోనా మహమ్మారి ప్రభావం తగ్గలేదని, కేసుల తీవ్రత ఇంకా పెరుగుతూనే ఉందని.. ...

Read More »

నిధుల మళ్లింపులతో బడ్జెట్

నిధుల మళ్లిరపు అధికారులకు తలనొప్పులు సృష్టిస్తోరది. దీరతో 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధిరచిన సవరణ బడ్జెట్‌ను సిద్ధం చేసేరదుకు అధికారులు తలలు పట్టుకురటున్నారు. వచ్చిన ఆదాయం, చేసిన ఖర్చు వంటి అరశాలపై ఏటా సవరణ బడ్జెట్‌ను తయారుచేసి శాసనసభకు సమర్పిరచడం ఆనవాయితీగా వస్తోరది. గత కొన్నేళ్లుగా బడ్జెట్‌ ప్రతిపాదనలకు, వాస్తవ ఆదాయ వ్యయాలకు మధ్య పొరతన లేకుండా పోతోరది. అరదుకే సవరణ బడ్జెట్‌ రూపకల్పన ఇబ్బరదికరంగా మారుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. కేటాయిరచిన నిధులకు, విడుదల చేసిన నిధులకు మధ్య పొరతన లేకపోవడంతో సవరణ బడ్జెట్‌ ...

Read More »

విరాట పర్వం పోస్టర్‌విడుదల

రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో  నటిస్తన్న చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకుడు. నక్సలిజం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ  సినిమా విడుదల తేదీని గురువారం చిత్ర బృందం సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 30న థియేటర్లలో విడుదల చేస్తున్నామని సాయి పల్లవి పోస్టర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే రానా పాత్ర రవన్న పేరుతో ఓ వీడియోను గతంలో చిత్ర బ‌ృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి ..వెన్నెల అనే పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో ...

Read More »

గ్రామాల్లోనే అత్యుత్తమ వైద్యసేవలు

 ప్రజలకు గ్రామాల్లోనే అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సిఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లోని వ్యవస్థలను, వారి ఆలోచనలను పరిగణలోకి తీసుకుని మార్గదర్శకాలు తయారు చేయాలన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పూళ్ల, కొమరవోలు గ్రామాల్లో ఆకస్మికంగా అస్వస్థతకు గురైన ప్రజలకు ధైర్యాన్నివ్వాలన్నారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన వైద్యారోగ్యశాఖలో నాడు-నేడుపై సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ రూ.16,270 కోట్లతో నాడు-నేడు కింద వైఎస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్స్‌, అర్బన్‌ క్లినిక్స్‌, పిహెచ్‌సిలు, ఏరియా ఆస్పత్రులు, ప్రస్తుతం ఉన్న వైద్య కళాశాలల్లో ...

Read More »

చిరంజీవి మాకే మద్దతిస్తారు..అధికారం మాదే: సోము వీర్రాజు..!!

జనసేనకు చిరంజీవికి అండగా ఉంటారంటూ ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కొత్త చర్చకు తెర తీసాయి. అది ముగియక ముందే ఇప్పుడు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు మరో సారి ఏపీ రాజకీయాల్లో చిరంజీవి ప్రస్తావన తీసుకొచ్చారు. 2024లో బీజేపీ, జనసేన కూటమికి నటుడు చిరంజీవి మద్దతిస్తారని ప్రకటించారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. తమకు ఇంకా ఎవరెవరు మద్దతిస్తారో ...

Read More »

ఫిబ్రవరి 1 నుంచి అంగన్‌వాడీ కేంద్రాల ప్రారంభం

కరోనా పరిస్ధితుల నేపధ్యంలో విరామం ప్రకటించిన అంగన్‌వాడీ కేంద్రాలను ఫిబ్రవరి 1 నుండి తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల అంగన్‌వాడీ కేంద్రాలను ప్రారంభించవచ్చని నిర్దేశించగా.. సుప్రీం కోర్టు సైతం రిట్‌ పిటిషన్‌ (సివిల్‌) నెం.1039/2020లో ఇదే విషయంపై స్పష్టత ఇచ్చిందని వివరించారు. గర్భిణీ, బాలింతలు, 6-72 నెలల వయస్సు పిల్లలకు గతేడాది మార్చి 23 నుండి ...

Read More »

దేశంలో కొత్తగా 11,666 కరోనా కేసులు

 దేశంలో గడిచిన 24 గంటల్లో 11,666 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. కరోనా నుంచి కోలుకొని 14,301 మంది డిశ్చార్జి అయినట్లు వెల్లడించింది. వైరస్‌ ప్రభావంతో 123 మంది మరణించినట్లు పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,07,01,193కు పెరిగింది. ఇప్పటి వరకు 1,03,73,606 మంది కోలుకోగా.. 1,53,847 మంది మతి చెందారని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. 

Read More »

రైతులపై నోరుపారేసుకున్న కంగనా

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులపై బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ నోరుపారేసుకున్నారు. వారిని ఉగ్రవాదులతో పోల్చుతూ ట్వీట్‌ చేశారు. ఈ ఘటనలను పట్టించుకోకూడదని తాను ప్రయత్నించినా మౌనం దాల్చలేకపోయానని పేర్కొన్నారు. ఢిల్లీ హింసపై బిజెపి యువమోర్చా ప్రధాన కార్యదర్శి సౌరబ్‌ చౌదరి ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఫోటోలను షేర్‌ చేసిన కంగనా.. తన తల సిగ్గుతో వేలాడుతోందని అన్నారు. దేశ సమగ్రతను కాపాడలేకపోయామని, ఈ ఘటనలపై తీవ్రంగా కలత చెందానని, ఇవాళ తాను ...

Read More »