Monthly Archives: January 2021

త్వరలో పవన్‌, రానా చిత్రం షూటింగ్‌

పవన్‌కళ్యాణ్‌, రానాలు హీరోలుగా చిత్రం పట్టాలెక్కుతోంది. మలయాళ చిత్రం ‘అయ్యప్పన్‌ కోషియమ్‌’ రీమేక్‌ చిత్రంలో వీరు నటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియోను సంగీత దర్శకుడు తమన్‌ విడుదల చేశారు. సినిమాకు పనిచేస్తున్న సాంకేతిక నిపుణుల పేర్లను వెల్లడించారు. త్వరలోనే షూటింగ్‌ కూడా ప్రారంభం కానుంది. పవన్‌ భార్యగా సాయిపల్లవి, రానా భార్యగా ఐశ్వర్య రాజేష్‌ నటిస్తున్నట్లు సమచారం.

Read More »

కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ ఖర్చంతా కేంద్రానిదే : మోడీ

దేశ వ్యాప్తంగా కోవిడ్‌ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. శనివారం ఉదయం 10 గంటల 30 నిముషాలకు వర్చువల్‌ విధానంలో ప్రధాని మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రారంభం సందర్భంగా.. ప్రధాని మోడీి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచమంతా కోవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తోందని, వ్యాక్సిన్‌ రూపకల్పనకు శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడ్డారని అన్నారు. శాస్త్రవేత్తల కృషికి ఫలితంగా రెండు కోవిడ్‌ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయని, మరిన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. దేశీయ వ్యాక్సిన్‌ ద్వారా భారత్‌ తన సత్తాను ...

Read More »

అమ్మ ఒడి కింద లాప్‌టాప్‌ : జగన్‌

వచ్చే ఏడాది నుంచి అమ్మ ఒడి పథకంలో నగదు వద్దనుకుంటే వారికి ల్యాప్‌ టాప్‌ అందిస్తామని ఎపి సిఎం జగన్‌ ప్రకటించారు. సోమవారం నెల్లూరులో అమ్మఒడి రెండో విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని సిఎం జగన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తల్లుల ఖాతాలోకి నగదును జమచేశారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నుంచి అమ్మ ఒడి పథకంలో ఎవరైనా నగదు వద్దనుకుంటే వారికి ల్యాప్‌ టాప్‌ అందిస్తామని వెల్లడించారు. ఈ ప్రత్యామ్నాయం వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. ...

Read More »

‘ఆచార్య’ సినిమా ఎప్పుడు విడదల అవ్వబోతుందో తెలుసా

చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు సోషల్‌ మీడియాలో విడుదల తేదీ ఇదేనంటూ.. వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. సమాచారం మేరకు బహుశా మే 9న ‘ఆచార్య’ను విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. అసలింతకీ అదేరోజున ఎందుకు విడుదల చేయాలి.. ఏమైనా ప్రత్యేక సందర్భాలు, రోజులు ఉన్నాయా అన్న ప్రశ్న తలెత్తకమానదు. గతంలో మే 9వ తేదీన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’, ‘గ్యాంగ్‌ లీడర్‌’ సినిమాలు విడుదలై ఎంతటి భారీ విజయాన్ని సొంతం ...

Read More »

అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

భూమా అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌ను సికింద్రాబాద్‌ కోర్టు తిరస్కరించింది. బోయినపల్లి అపహరణ కేసులో మరింత లోతుగా అఖిలప్రియను విచారించేందుకు 7 రోజులు కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరగా.. మూడు రోజులు మాత్రమే కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. నేటి నుంచి 13 వ తేదీ వరకూ అఖిలప్రియను కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారించనున్నారు. అఖిలప్రియ మెడికల్‌ రిపోర్టును చంచల్‌గూడ జైలు అధికారులు కోర్టుకు సమర్పించారు. ఈ నివేదికను పరిశీలించిన కోర్టు ఆమెకు బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించింది. ప్రస్తుతం అఖిలప్రియ రిమాండ్‌ ఖైదీగా ...

Read More »

జగనన్న అమ్మఒడి రెండో విడత కార్యక్రమం ప్రారంభం

అమ్మ ఒడి రెండో విడత సాయంను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నెల్లూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల 48,865 మంది తల్లులు లబ్దిపొందుతారని, వారి ఖాతాల్లో రూ.6,673 కోట్లు జమ చేసినట్లు సీఎం తెలిపారు. పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికీ రూ.15 వేలు ఆర్థిక సాయం చేస్తామని, ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు ఇది వర్తిస్తుందని సీఎం జగన్ అన్నారు.

Read More »

ఎపిలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

ఎపిలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయ్యింది. గత కొంత కాలంగా ఉత్కంఠ రేపుతున్న ఎపి స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్టకేలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. నాలుగు దశలుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 23న తొలి దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలవుతుంది. 27న రెండో దశ పంచాయతీ ఎన్నికలకు, 31న మూడో దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడనుంది. వచ్చే నెల 4న నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ రానుంది. ఈ మేరకు ...

Read More »

సింగర్ సునీత మెహందీ పంక్షన్‌

ప్రముఖ సింగర్‌ సునీత రెండో వివాహం చేసుకోనున్నారు. మ్యాంగో మీడియా అధినేత రామ్‌ వీరపనేని అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహం శనివారం జరగనుంది. కాగా, శుక్రవారం సునీత ఇంట్లో మెహందీ పంక్షన్‌ నిర్వహించారు. ఈ పంక్షన్‌లో పసుపు చీరలో సునీత చూడ ముచ్చటగా ఉన్నారు. సుమ, రేణు దేశారు, ఆమె కుమార్తె ఆద్య వంటి సన్నిహితులు ఈ వేడుకల్లో పాల్గన్నారు. దీనికి సంబంధిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతన్నాయి.

Read More »

ఎపి లో ఈనెల 18 నుంచి ఇంటర్‌ క్లాసులు

ఎపి లో ఈ నెల 18 నుంచి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ తరగతులు ప్రారంభంకానున్నాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఏడాదికి ఆఫ్‌లైన్‌లోనే మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నామని.. కానీ, వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని తెలిపారు. త్వరలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేస్తామన్నారు.2020-2021 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్‌ పరీక్షలు వచ్చే ఏప్రిల్‌, మే లో జరిగే అవకాశముందని.. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ త్వరలో విడుదల చేస్తామని మంత్రి సురేష్‌ వెల్లడించారు. ...

Read More »

శాశ్వతంగా ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతా నిలిపివేత..!

ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ పై ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ వేటు వేసింది. ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతాను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. అధ్యక్షునిగా ఆయన పదవీ కాలం ముగిసే వరకు తమ సంస్థకు చెందిన ఆయన సోషల్‌ మీడియా ఖాతాలను నిలిపివేస్తున్నట్లు ఫేస్‌బుక్‌ ప్రకటించిన…కొన్ని గంటలకు ట్విట్టర్‌ ఈ అనూహ్య ప్రకటన చేసింది. ట్రంప్‌ ఇటీవల చేసిన ట్వీట్లు..వాటి చుట్టూ ఉన్న సందర్భాలను నిశితంగా సమీక్షించిన తర్వాత..హింసను ప్రేరేపించే ప్రమాదం ఉన్నందున ఈ ఖాతాను శాశ్వతంగా నిలిపివేస్తున్నామని ట్వీట్‌ చేసింది. క్యాపిటల్‌ ...

Read More »