Monthly Archives: February 2021

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ

ఎపిలో ఉపాధ్యాయ, తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. నేడు నామినేషన్లను పరిశీలించి తుది జాబితాను ప్రకటించనున్నారు. ఎపిలో కృష్ణా-గుంటూరు, తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. కృష్ణా-గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 20 నామినేషన్లు దాఖలు కాగా.. తూర్పు-పశ్చిమగోదావరి ఎమ్మెల్సీ స్థానానికి 12 నామినేషన్లు వచ్చాయి. 2 స్థానాలకు గానూ మొత్తం 32 నామినేషన్లు దాఖలైనట్లు ఎస్‌ఇసి ప్రకటించింది. కాగా, ఎపిలో ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు ...

Read More »

అలరించనున్న ‘సూపర్‌ డీలక్స్‌’

సమంత, విజయ్‌ సేతుపతి, రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘సూపర్‌ డీలక్స్‌’. త్యాగరాజన్‌ కుమార్‌ రాజా దర్శకుడు. ఈ చిత్రాన్ని సిద్ధ్దేశ్వర వైష్ణవి ఫిలింస్‌ పతాకంపై పి.మధుబాబు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ ‘క్రైమ్‌ కామెడీ కథాంశంతో రూపొందిన చిత్రమిది. జీవితం, నైతిక విలువలు, లింగభేదాలతో పాటు సమాజంలో నెలకొన్న పలు సమస్యల్ని చర్చిస్తూ దర్శకుడు రూపొందించారు

Read More »

ఆటోడ్రైవర్‌ కు రూ. 24 లక్షల విరాళాలు పంపిన నెటిజన్లు

తన మనవరాలి చదువు కోసం ఇంటిని అమ్మిన ముంబయి ఆటో డ్రైవర్‌ కథను చదివిన పలువురు నెటిజన్లు ఆయనకు విరాళాలు పంపారు. ఈ విధంగా వచ్చిన విరాళాలు ఏకంగా రూ. 24 లక్షలకి చేరాయి. హృదయవిదారకమైన దేశ్‌రాజ్‌ కథను ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’ అనే పోర్టల్‌లో సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. అనంతరం దేశ్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ఇద్దరు కుమారులు మరణించడంతో కుటుంబపోషణను తన భుజాలపై వేసుకున్నానని అన్నారు. ఇద్దరు కోడళ్లతో పాటు వారి నలుగురు సంతానాన్ని పోషించాల్సిన బాధ్యత తనదేనని అన్నారు. ...

Read More »

హిందూపురంలో బాలకృష్ణకు ఎదురుదెబ్బ

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సొంత నియోజకవర్గం హిందూపురంలో ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గంలో ఉన్న 38 సర్పంచ్‌ స్థానాలకు గానూ 30 స్థానాల్లో వైసిపి బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. పెనుకొండ టిడిపి మాజీ ఎమ్మెల్యే బికె.పార్థసారధికి కూడా షాక్‌ తగిలింది. ఆయన సొంత పంచాయతీ రొద్దంలో సర్పంచ్‌ అభ్యర్థి, మరువపల్లిలో వార్డు అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. పెనుకొండలోని 80 స్థానాల్లో 71 చోట్ల వైసిపి మద్దతుదారులు గెలుపొందారు. హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప సొంత పంచాయతీ వెంకటరమణపల్లిలో టిడిపి బలపర్చిన ...

Read More »

మహిళ రైతులతో అపోలో ఒప్పందం

డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీతో కలిసి పని చేస్తోన్న 5,000 మంది మహిళా రైతులతో అపోలో హాస్పిటల్స్‌ ఒప్పందం చేసుకుంది. వీరి నుంచి సేకరించిన తృణ ధాన్యాలను అపోలో క్యాంటీన్లలో ఉపయోగించనున్నారు. ఇప్పటికే 4వేల కిలోల తృణ ధాన్యాలు కొనుగోలు చేయగా తాజాగా సంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళా రైతులకు మద్దతుగా ప్రతీ నెల మరో వెయ్యి కిలోల ధాన్యాలను సేకరించనున్నట్లు వెల్లడించింది. ఆరోగ్యకరమైన జీవనానికి స్థానికంగా లభించే వాటినే తినడం, పండించడం చేయాలని అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ సిఎస్‌ఆర్‌ వైస్‌ ఛైర్మన్‌ ఉపాసన కొణిదెల ...

Read More »

కరోనా నుండి కోలుకున్న సూర్య

సూర్య తనకు కరోనా సోకినట్టు కొద్ది రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా సూర్య సోదరుడు కార్తి తన అన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడని చెప్పేసరికి ఫ్యాన్స్‌ కాస్త కూల్‌ అయ్యారు. నిర్మాత రాజశేఖర్‌ పాండియన్‌ సూర్యకు కరోనా నెగెటివ్‌ వచ్చిందని, ఆయన పూర్తిగా కోలుకున్నారని, అభిమానులు ఆందోళన పడొద్దుని చెప్పారు.

Read More »

కేరళలో మరోసారి ఎల్‌డిఎఫ్‌ కే పట్టం

కేరళలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే… మరోసారి సిపిఎం నేతృత్వంలోని వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డిఎఫ్‌)కే అక్కడి ప్రజలు పట్టం కట్టనున్నారని ఓ సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలుండగా.. ఎల్‌డిఎఫ్‌ 72-78 స్థానాలను కైవసం చేసుకోగలదని ఏషియానెట్‌ న్యూస్‌- సి ఫోర్స్‌ సర్వే పేర్కొంది. ఇక కాంగ్రెస్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (యుడిఎఫ్‌) 59-65 స్థానాల్లో గెలుపొందుతుందని తేలింది. బిజెపి నేతృత్వంలోని నేషనల్‌ డెమొక్రటిక్‌ అలియన్స్‌ (ఎన్‌డిఎ) 3-7 స్థానాలతో సరిపెట్టుకుంటుందని సర్వే చెబుతుంది. కాగా, ఉత్తర, దక్షిణ కేరళలో ...

Read More »

జాతీయం ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతివ్వాలి : మోడీ

భారత్‌ను స్వావలంబన దిశగా తీసుకువెళ్లేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణకు మద్దతు ఇవ్వాలని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడి అధ్యక్షతన నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశం శనివారం వర్చువల్‌ విధానంలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం నుండి దేశాన్ని ముందుకు నడిపేందుకు పటిష్టమైన  విధానాలు రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రైవేట్‌ ...

Read More »

చమురు ధరల పెరుగుదలపై కేంద్రం, రాష్ట్రాలు భేటీ కావాలి : నిర్మలా సీతారామన్‌

దేశంలో రోజురోజుకూ ఇంధన ధరలు మండిపోతున్నాయి. వరుసగా 12వ రోజు కూడా పెట్రో, డీజిల్‌ ధరలు పెరిగాయి. పెరుగుతున్న చమురు ధరలపై కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వినియోగదారులకు అందుబాటు ధరల్లోకి తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భేటీ కావాల్సిన అవసరముందని మంత్రి అభిప్రాయపడ్డారు. ధరల తగ్గుదల పరిష్కారం దిశగా చర్చలు సాగాలని అన్నారు పెట్రోల్‌, డీజిల్‌ రిటైల్‌ అమ్మకపు ధరల్లో వరుసగా 60శాతం, 54 శాతం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు విధిస్తున్నాయి. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ ...

Read More »

ఆ ఐదు రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కరోనా

కరోనా తగ్గినట్లే తగ్గి..మరోసారి విజృంభిస్తోంది. మహారాష్ట్ర, పంజాబ్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, కేరళలో కరోనా కోరలు చాచుతోందని కేంద్రం ప్రకటించింది. నవంబర్‌-డిసెంబర్‌లో ప్రారంభమైన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ తర్వాత కోవిడ్‌ పుంజుకోవడం ఇదే తొలిసారి. అదేవిధంగా 1.07 కోట్ల మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు అందించినట్లు వెల్లడించింది. గత వారం నుండి మహారాష్ట్రలో రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. శనివారం దేశంలో అత్యధిక కేసులు నమోదైంది కూడా ఈ రాష్ట్రంలోనే. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 6,112 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. కోవిడ్‌ ...

Read More »