Monthly Archives: February 2021

ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో 35శాతం ప్రభుత్వ కోటా

ప్రైవేటు యూనివర్శిటీల్లో ఇకపై 35 శాతం సీట్లను ప్రభుత్వ కోటా కింద భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. ఉన్నత విద్యపై క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ మేరకు ఎపి ప్రైవేట్‌ యూనివర్సిటీ యాక్ట్‌ా2006కు సవరణలు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ సవరణలతో కూడిన బిల్లును త్వరలోనే శాసనసభలో ప్రవేశపెడతామని అన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో నియామకాలు పారదర్శకంగా జరగాలని, సిఫార్సులకు చోటు ఉండకూడదని చెప్పారు. తొలిసారిగా ప్రైవేట్‌ యూనివర్సిటీలు ఏర్పాటు చేసేవారికి ...

Read More »

సంస్కరణల బాట వీడం.. నిర్మలా సీతారామన్‌

సంస్కరణల బాట వీడేది లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. రాజ్యసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆమె శుక్రవారం సమాధానమిచ్చారు. స్వయం సమృద్ధ భారత్‌ సాధనకు 2021-22 కేంద్ర బడ్జెట్‌ దోహదపడుతుందని అన్నారు. అభివఅద్ధి, సంస్కరణల పట్ల కేంద్రానికి, మోడీకిగల నిబద్ధత తాజా బడ్జెట్‌లో కనిపిస్తుందని అన్నారు. సత్వర స్వల్ప కాలిక పరిష్కారాలను కల్పించడంతోపాటు మధ్యకాలిక, దీర్ఘకాలిక సుస్థిర అభివృద్ధి వైపు ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత దేశాన్ని తీర్చిదిద్దడం కోసం ...

Read More »

శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రామ్‌ చరణ్‌ చేయబోయే చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. రామ్‌చరణ్‌ హీరోగా భారీ బడ్జెట్‌ చిత్రాలతో ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ నిర్మాతలుగా ప్యాన్‌ ఇండియా చిత్రం రూపొందనుందని అధికారికంగా ప్రకటించారు.

Read More »

భగ్గుమంటున్న పెట్రో ధరలు..!

 దేశంలో చమురు ధరలు రోజు రోజుకూ పైకి ఎగబాకుతున్నాయి. గత 44 రోజుల్లో చమురు ధరలు 17 సార్లు ఎగబాకాయి. ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలు కొండెక్కుతుంటే.. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదలతో చమురు సంస్థలు ఇక్కడా ధరలను పెంచుతున్నాయి. దీంతో సామాన్యునిపై మరింత భారం పడ్డట్టయింది. చమురు ధరలు వరుసగా అయిదో రోజూ పెరగడంతో ఈ నెలలో ఏడోసారి ధరలు పెరిగినట్టయింది. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం లీటరు పెట్రోలు ధర 30 పైసలు పెరిగి రు.88.44 కు చేరింది. లీటర్‌ ...

Read More »

పెరగనున్న విమానయాన ధరలు

దేశీయ విమానయానం చార్జీలు 30 శాతం వరకు పెరగనున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో విమాన చార్జీల కనిష్ట, గరిష్ట పరిమితులతో పాటు సీటింగ్‌ సామర్థ్యంపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విధించిన పరిమితులు మార్చి 31తో ముగియనున్నాయి. దీంతో దేశీయ రూట్లలో విమానయానం ప్రియం కానుంది. దేశంలో కరోనాకు ముందున్న పరిస్థితి క్రమంగా తిరిగి నెలకొంటున్న క్రమంలో విమానయాన చార్జీల శ్రేణిపై విధించిన పరిమితులను తొలగించే అవకాశం ఉందని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి పేర్కొన్న మరుసటి రోజే విమాన ...

Read More »

త్వరలో LIC విలువ లెక్కింపు ప్రక్రియ

ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి) విలువ లెక్కింపు ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుందని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముకెష్‌ గుప్తా వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎల్‌ఐసిలో వాటాలను విక్రయించడానికి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (దీపమ్‌) ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపిఒ) చేపడుతోన్న విషయం తెలిసిందే. ఐపిఒ లావాదేవీల కోసం ఇప్పటికే అడ్వైజర్ల నియామకం పూర్తి అయ్యిందని, త్వరలోనే విలువ లెక్కింపు మొదలు కానుందని గుప్తా తెలిపారు. ఎల్‌ఐసిలోని వాటాలను ...

Read More »

వెండితెరపై హీరోగా దిల్‌రాజు వారసుడు

దిల్‌ రాజు వారసుడు కూడా త్వరలోనే ఇండిస్టీలోకి అడుగుపెట్టబోతున్నారు. దిల్‌ రాజు ఇప్పుడు తనకెంతో ఇష్టమయిన కొడుకును వెండితెరకు పరిచయం చేయనున్నారు. సొంత కొడుకు కాదు. అతని సోదరుడు అయిన శిరీష్‌ కుమారుడు ఆశిష్‌. దిల్‌ రాజు ఒక్కసారి సినిమా కథను ఒకే చేస్తే ఆ ప్రాజెక్ట్‌ పూర్తయ్యే వరకు కూడా ప్రొడక్షన్‌ పనులన్నింటిని సోదరుడు శిరీష్‌ చూసుకుంటూ ఉంటారు. శిరీష్‌ కుమారుడు మొదటి సినిమాను మీడియం బడ్జెట్‌ తోనే ప్లాన్‌ చేస్తున్నారు. హుషారు సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న దర్శకుడు శ్రీ హర్ష ...

Read More »

ఏప్రిల్‌ 10న వైఎస్‌ షర్మిలా కొత్త పార్టీ ప్రకటన

కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్న వైఎస్‌ షర్మిలా అంతకుతగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల అభిమానులతో ఆత్మీయ సమావేశాలు ప్రారంభించారు. హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న జిల్లాల సమావేశాలను హైదరాబాద్‌లోనే నిర్వహించనున్నారు. దూరంగా ఉన్న జిల్లాలకు మాత్రమే షర్మిలా స్వయంగా వెళ్లి ఆత్మయ సమావేశాలు నిర్వహించనున్నారు. మొదటిగా ఆమె ఖమ్మం జిల్లాకు వెళ్లనున్నారు. ఈ జిల్లా ఆత్మీయ సమావేశాలను ఏప్రిల్‌ 10వ తారఖులోపు ముగించుకొని ఆ రోజున చేవేళ్లలో బహిరంగ సభ పెట్టి పార్టీ పేరు, జెండాను ఆమె ప్రకటించనున్నారు. ఏప్రిల్‌ 10వ ...

Read More »

రాముడిగా మహేష్‌ బాబు ‌.. రావణుడిగా హృతిక్‌..?

టాలీవుడ్‌ సినీ ఇండిస్టీలో ఇతిహాసాల పర్వం మొదలైంది. ప్రభాస్‌ హీరోగా ‘ఆదిపురుష్‌’ పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతుండగా..సమంత ప్రధాన పాత్రధారిగా శాకుంతలం రూపుదిద్దుకుంటుంది. ఇప్పుడు ఇదే కోవకు చెందిన చిత్రంలో స్టార్‌ హీరో నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు రాముడిగా..మరో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ రావణుడిగా… దీపికా పదుకొనే సీతగా ఇతిహాస చిత్రం పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సుమారు 1500 కోట్ల బడ్జెట్‌తో.. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఎప్పటినుంచో రాజమౌళి మహాభారతాన్ని సినిమాగా తెరకెక్కించాలని… దానికి కథ ...

Read More »

తొలి విడత పంచాయతీ పోరులో వైసిపికే అత్యధిక స్థానాలు

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ తొలివిడత ఫలితాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 3249 స్థానాల్లో ఎన్నికలను నిర్వహించగా.. అత్యధిక స్థానాల్లో వైసిపి విజయకేతనాన్ని ఎగురవేసింది. మొత్తం 3249 పంచాయతీల్లో.. వైసిపి 2347 పంచాయతీలను దక్కించుకోగా, టిడిపి 564 స్థానాలను కైవసం చేసుకుంది. బిజెపి, జనసేన లు 46 స్థానాలను చేజిక్కించుకున్నాయి. ఇతరులు 292 స్థానాలలో గెలుపొందారు.

Read More »