Monthly Archives: February 2021

వెంకటేష్’నారప్ప’ పూర్తి

వెంకటేష్‌ కథానాయకుడిగా దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నారప్ప’ సినిమా చిత్రీకరణ పూర్తి అయినట్లు సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. సురేష్‌బాబు, కలైపులి ఎస్‌.థాను సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియమణి కథానాయికగా నటిస్తోంది. తమిళ ‘అసురన్‌’ సినిమాకు రీమేక్‌గా తెలుగులో వస్తున్న ఈ సినిమా మే 14న థియేటర్‌లో విడుదల కానుంది.

Read More »

విశాఖ మానసిక వైద్యశాలకు మదనపల్లె నిందితులు

మూఢభక్తితో కన్నకూతుళ్లను చంపుకొన్న చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన దంపతులు పురుషోత్తం, పద్మజలను బుధవారం ఉదయం పోలీసులు విశాఖ మానసిక చికిత్సాలయానికి తరలించారు. నిందితుల మానసికస్థితి బాగోలేనందున ఇటీవల తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు వారికి మానసిక సమస్యలున్నాయని నిర్ధారించారు. వీరి వైద్యానికి జైల్లో సరైన సదుపాయాలు లేనందున విశాఖ కస్టోడియన్‌ కేర్‌కు తరలించాలని కూడా సూచించారు. దీంతో బుధవారం వీరిని విశాఖకు తరలించారు.

Read More »

శ్రీకాకుళం సబ్‌జైలుకు అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం సబ్‌జైల్‌కి అచ్చెన్నాయుడును తరలించారు. అచ్చెన్నాయుడికి 14రోజులపాటు కోటబమ్మాళి కోర్టు రిమాండ్‌ విధించింది. టెక్కలి జిల్లా ఆసుపత్రిలో అచ్చెన్నాయుడుకు వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం ఐపీసీ సెక్షన్‌ 147,148, 324, 307,384, 506, 341,120(b),109, 188, రెడ్‌ విత్‌ 149, ఐపీసీ 123(1), ఆర్‌పీఏ 1951 కింద కేసులు నమోదు చేశారు. హత్యాయత్నం, బెదిరింపులకు పాల్పడటం వంటి పలు సెక్షన్లపై అచ్చెన్నాయుడును అరెస్ట్‌ చేసి శ్రీకాకుళం జిల్లా జైలుకు తరలించారు.

Read More »

బడ్జెట్‌లో క్రీడారంగానికి నిరాశే!

పార్లమెంట్‌లో కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో క్రీడలకు భారీగా నిధులకు కోత పెట్టారు. కోవిడ్‌- 19 నేపథ్యంలో 2021 – 22కి రూ.2596.14కోట్లు మాత్రమే క్రీడారంగానికి కేటాయించారు. ఇది గత ఏడాది బడ్జెట్‌తో పోల్చిచూస్తే సుమారు రూ.230.78 కోట్లు తక్కువ. గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో క్రీడలకు 2826.92 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇది అంతకుముందు ఏడాది కేటాయించిన రూ.1800.15 కోట్లతో పోలిస్తే భారీగా పెంపుదల కనిపించింది. 2019ా20 బడ్జెట్‌తో పోల్చిచూస్తే ఆ వ్యత్యాసం రూ.795.99 ...

Read More »

మహిళా దర్శకురాలితో మహేశ్‌ బాబు‌ సినిమా ?

అశేష ప్రేక్షకాదరణ పొంది.. ఆస్కార్‌ బరిలో పోటీపడుతోన్న ‘ఆకాశం నీ హద్దురా’ (శూరరై పోట్రు) సినిమాను రూపొందించిన సుధా కొంగర మహిళా దర్శకురాలితో సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు పనిచేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది సూర్య హీరోగా రూపొందిన చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’ (శూరరై పోట్రు). ఈ సినిమాకు సుధా కొంగర దర్శకురాలు. ఓటీటీ లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులే కాదు, విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ప్రస్తుతం మన దేశం తరపున ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా ఆస్కార్‌ బరిలో పోటీ ...

Read More »

నేటి నుండి నామినేషన్ల పరిశీలన..

 ఎపి లో పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్లు ముగిశాయి. నేడు నామినేషన్‌ పత్రాలను అధికారులు పరిశీలించనున్నారు. ఫిబ్రవరి 4 నామినేషన్ల ఉపసంహరణ కు తుది గడువు. ఫిబ్రవరి 9 న తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ తొలిదశలో 3,249 పంచాయతీలు, 32,504 వార్డులకు ఎన్నికలను నిర్వహించనున్నారు. ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను అధికారులు వెల్లడించనున్నారు.

Read More »

రాష్ట్రాల ఎన్నికలు లక్ష్యంగా బడ్జెట్‌ ప్రకటనలు

 కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ .. ఈ ఏడాది జరగునున్న వివిధ రాష్ట్రాల్లోని ఎన్నికల నేపథ్యంలో తీసుకువస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల ఎన్నికలు లక్ష్యంగా ఆ రాష్ట్రాల్లో మౌళిక సదుపాయల ప్రాజెక్ట్‌కు అధికంగా నిధులు కేటాయించారు.– భారత్‌ మాల కింద 13 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి,– అసోంలో రూ. 19 వేల కోట్లతో హైవేల అభివృద్ధి,– కేరళలో 1100 కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి,– కేరళకు రూ. 65 వేల ...

Read More »

త్వరలో తుక్కు విధానం.. బడ్జెట్

కాలం చెల్లిన వాహనాలను తుక్కు కిందకు మార్చే పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. నేడు పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ను ప్రవేశపెడుతోన్న నేపథ్యంలో.. వాహనాలు పర్యావరణ హితంగా ఉండాలన్న ఉద్దేశంతో వాటి నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి తమ ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకురాబోతుందని కేంద్ర మంత్రి వెల్లడించారు.

Read More »

పన్ను చెల్లింపు దారులకు కేంద్రం మొండి చేయి..

పన్ను చెల్లింపు దారులకు కేంద్రం మొండి చేయి చూపించింది. శ్లాబుల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. కేవలం 75 ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్లకు ఊరట కలిగించింది. పించను, వడ్డీ ఆధాయం ఆధారంగా ఐటి మినహాయింపునిచ్చింది. ట్యాక్స్‌ ఆడిట్‌ నుండి ఎన్‌ఐఆర్‌లకు కూడా మినహాయింపు నిచ్చింది. చిన్న ట్యాక్స్‌ పేయర్ల వివాదానికి పరిష్కారానకి ప్యానెల్‌ను ఏర్పాటు చేయనుంది. రూ. 50 లక్షల లోపు ఆదాయం, రూ. 10 లక్షలల లోపు వివాదాలు ఉన్న వారు నేరుగా కమిటీ ద్వారా అప్పీల్‌ చేసుకోవచ్చు.

Read More »