Monthly Archives: March 2021

జగన్‌ను విశాఖలో అడ్డుకోలేదా..?

టిడిపి వెంటిలేటర్‌ దశలో ఉందని, పర్మిషన్లు లేకుండా ఎయిర్‌పోర్టులో కూర్చుని డ్రామాలాడితే విలువ ఉండదని మంత్రి బత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు విమర్శించారు. నాడు జగన్‌ కూడా ప్రత్యేకహోదా కోసం వైజాగ్‌కు వెళ్లినపుడు ఇలాగే చేశారని గుర్తు చేశారు. మున్సిపల్‌ ఎన్నికలపై సోమవారం స్థానిక కెటిఆర్‌ ఫంక్షన్‌ హాల్లో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల కమిషనర్‌కు అన్ని విధాలుగా సహకరిస్తున్నామని, అన్ని శాఖలు ఆయన పరిధిలోనే నడుస్తున్నాయని వివరించారు. వాలంటీర్లపై తీసుకున్న నిర్ణయం ప్రజలకు ఇబ్బంది ...

Read More »

తల్లి కాబోతున్న హీరోయిన్‌ రిచా

హీరోయిన్‌ రిచా గంగోపాధ్యారు తల్లి కాబోతున్నారు. బేబీ బంప్‌తో ఆదివారం ఉదయం ట్విటర్‌ వేదికగా చిత్రాన్ని షేర్‌ చేసుకున్నారు. జూన్‌లో తమ కుటుంబంలోకి ఓ చిన్నారి రానుంది అంటూ ట్వీట్‌ చేశారు. అలాగే తామెంతో సంతోషంగా ఉన్నామని తెలిపారు. తమ చిన్నారి కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని వెల్లడించారు. లీడర్‌ చిత్రం ద్వారా ఆమె తెలుగు తెరకు పరిచయమయ్యారు. మిర్చి చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆమె అక్కడ బిజినెస్‌ స్కూల్లో జోను ప్రేమించారు. అనంతరం వివాహం చేసుకుకున్నారు.

Read More »

నేటినుండి రెండో దశ టీకా

మార్చి ఒకటవ తేది నుండి దేశ వ్యాప్తంగా రెండవ దశ కరోనా టీకా కార్యక్రమం ప్రారంభం అవుతోంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో 90 లక్షల మందికి టీకా వేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేసింది. 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ టీకా పొందే అవకాశం లభించనుంది. వీరితో పాటు 45 ఏళ్ల దాటిన దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకూ టీకా వేసేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి.అయితే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు సంబంధిత వైద్యుని వద్ద నుంచీ దృవీకరణ ...

Read More »

విద్యార్థులతో ఆడిపాడిన రాహుల్‌గాంధీ

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రచార వేగాన్ని పెంచారు. మూడు రోజుల పాటు తమిళనాడు పర్యటనలో భాగంగా.. ర్యాలీలు, సభలతో సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో రాహుల్‌గాంధీ సరదాగా స్టెప్పులేశారు. తమిళనాడులోని ములగుమూదుబ్న్‌ సెయింట్‌ జోసెఫ్స్‌ మెట్రిక్యులేషన్‌ విద్యార్థులతో కలిసి ఆడిపాడారు. పుష్‌-అప్స్‌, ‘ఐకిడో’ తో అక్కడి విద్యార్థులతో హుషారుగా గడిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే నాగర్‌కోయిల్‌ వెళ్లేటప్పుడు ఆచంగులం గ్రామ రహదారి వద్ద ఆగి, తాటి ...

Read More »