Monthly Archives: June 2021

తెలంగాణలో ఏపీ ప్రజలున్నారని ఆలోచిస్తున్నా..జగన్

 తెలంగాణ రాష్ట్ర మంత్రులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని, అందుకనే ఏదైనా మాట్లాడాలంటే ఆలోచిస్తున్నానని అన్నారు. మన వాళ్లను ఇబ్బంది పెడతారనే నేను ఎక్కువగా మాట్లాడట్లేదన్నారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే మాత్రం ఎలా ఊరుకోవాలి. నీటి విషయంలో ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాలంటూ మంత్రులకు సూచించారుర. విద్యుత్ విషయంలో మరోసారి కేఆర్ఎంబీకి లేఖ రాయాలని కోరారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ జలవివాదంపై ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాల ...

Read More »

రెండు పాటలు మినహా ఆర్‌ఆర్‌ఆర్‌ పూర్తి

టాలీవుడ్ లో మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్. మెగా నందమూరి హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కోసం అభిమానులే కాదు.. యావత్ సినీ ప్రపంచం ఎదురు చూస్తుంది. కరోనా నేపథ్యంలో షూటింగ్ వాయిదా పడుతూ వస్తున్న వేళ ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నా ఫ్యాన్స్ కు చిత్ర బృందం సరికొత్త అప్డేట్ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ మూవీ రెండు పాటలు మినహా షూటింగ్‌ మొత్తం పూర్తి అయ్యిందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ఇప్పటికే రెండు భాషల్లో డబ్బింగ్‌ ...

Read More »

ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్: జగన్

ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్‌ అని సిఎం జగన్‌ పేర్కొన్నారు. మంగళవారం విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడి గ్రామంలో నిర్వహించిన ‘దిశ’ మొబైల్‌ యాప్‌ అవగాహన సదస్సులో ఎపి సిఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ… దిశ యాప్‌పై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని, ప్రతి మహిళతో దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించాలని సూచించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఘటన తనను కలిచివేసిందని అన్నారు. యువతులు, మహిళల భద్రత కోసం దిశ యాప్‌ రూపొందించామని, ఇప్పటికే దిశ ...

Read More »

దిశా యాప్ డౌన్లోడ్ ఇలా..

ఏపీ ప్ర‌భుత్వం గ‌తెడాది ఫిబ్ర‌వ‌రిలో దిశాయాప్‌ను రూపోందించి విడుద‌ల చేసింది.  దీనికి సంబందించి చ‌ట్టాన్ని, దిశా పోలీస్ స్టేష‌న్ల‌ను కూడా తీసుకొచ్చింది.  దిశా యాప్‌పై విస్తృత‌మైన అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం సిద్ద‌మైంది.  ప్ర‌తి మ‌హిళ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తెలిపారు.  ఇక ఈ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి… ఎలా ఉప‌యోగించాలో చూద్దాం. దిశాయాప్ ఆండ్రాయిడ్ వెర్ష‌న్‌ను ప్లేస్టోర్ ద్వారా, ఐఓఎస్ వెర్ష‌న్‌ను యాప్ స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.  డౌన్‌లోడ్ చేసుకున్నాక మొబైల్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేయ‌గానే ...

Read More »

వెండితెరపై అపర చాణక్యుడి జీవితం

బహుభాషా కోవిదుడు, భారత మాజీ ప్రధాని పివి నరసింహరావు బయోపిక్‌ వెండితెరపైకి రాబోతోంది. ఈ బయోపిక్‌ను ‘ఎన్టీఆర్‌ ఫిల్మ్స్‌’ పతాకంపై రూపొందించనున్నారు. గతంలో ‘శ్రీశైలం’ చిత్రాన్ని నిర్మించిన తాడివాక రమేష్‌ నాయుడు ఈ బయోపిక్‌కి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ సీనియర్‌ దర్శకుడు ధవళ సత్యం ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారు. తెలుగు, హిందీ భాషలతోపాటు మరికొన్ని ముఖ్య భారతీయ భాషల్లో తెరకెక్కే ఈ చిత్రంలో జాతీయస్థాయిలో ప్రముఖ నటుడు పివి నరసింహరావు పాత్రను పోషించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌వర్క్‌ పూర్తయి, ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ...

Read More »

డెల్టాప్లస్‌ యమ డేంజర్‌.. 90 శాతం వేగంగా వ్యాప్తి

రాష్ట్రంలో సెకండ్‌వేవ్‌కు ప్రధాన కారణం కరోనా వైరస్‌లోని డెల్టా మ్యూటెంట్‌. అంతకముందు వ్యాప్తి చెందిన వైరస్‌ రకాలతో పోలిస్తే డెల్టా వేరియంట్‌కు 30-40 శాతం వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలున్నాయి. అందుకే కొద్ది రోజుల వ్యవధిలోనే వేలాది కేసులు నమోదయ్యాయి. అయితే డెల్టాకు మరో రూపాంతరంగా ప్రస్తుతం కలవరపెడుతున్న డెల్టాప్లస్‌ వేరియంట్‌ అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇది 90 శాతం వేగంగా వ్యాప్తి చెందే గుణాన్ని కలిగి ఉందంటున్నారు. అంటే సెకండ్‌ వేవ్‌తో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోందని ...

Read More »

మా ఎన్నికలు వాళ్ల‌తోనే అస‌లు ప్ర‌మాదం అంటున్న స‌భ్యులు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ( మా ) ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌ర పోరుకు తెర‌లేపింది. మా ఎన్నిక‌ల‌కు ఇంకా మూడు నెల‌ల స‌మ‌యం ఉండ‌గానే మాట‌ల యుద్ధాలు మొద‌ల‌య్యాయి. ఎన్నిక‌లు జ‌రిగేలోపు ఇంకా చాలానే యుద్ధాలు చూడాల్సి వ‌చ్చేలా ఉంది. ఈ సారి ఎలాంటి గొడ‌వ‌లు లేకుండా ప్రశాంతంగా ఎన్నిక‌లు జ‌రుపుకుందామ‌ని ప్ర‌కాశ్ రాజ్ మీడియా ముందుకు వ‌చ్చి కోరిన మ‌రుస‌టి రోజే ర‌చ్చ మొద‌లైంది. ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్న‌ట్లు మాట్లాడిన నాగ‌బాబు.. మా పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త మూడు ...

Read More »

ఆ చీకటి రోజులను ఎప్పటికీ మర్చిపోలేం : మోడీ

 దేశంలో ఎమర్జెన్సీ విధించి 46 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్‌పై విమర్శలు సంధిస్తూ ప్రధాని మోడీ శుక్రవారం వరస ట్వీట్లు చేశారు. ఆ చీకటి రోజులను ఎప్పటికీ మర్చిపోలేమని పేర్కొన్నారు. ‘ఆ అత్యయిక స్థితినాటి చీకటి రోజులను ఎప్పటికీ మరచిపోలేం. 1975 నుంచి 1977 మధ్య రాజ్యాంగ సంస్థలు క్రమంగా విచ్ఛిన్నం కావడం మనకు కనిపిస్తుంది. భారతదేశ ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేస్తూ, రాజ్యాంగంలో పొందుపరచిన విలువలకు అనుగుణంగా జీవిస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేద్దాం. మన ప్రజాస్వామ్య విలువలను కాంగ్రెస్‌ అణచివేసింది. ఆ ...

Read More »

నాగబాబు వ్యాఖ్యలకు నరేష్‌ కౌంటర్‌..!

మా అధ్యక్ష ఎన్నికలు రసాబాసా అవుతున్న నేపథ్యంలో… సీనియర్‌ నటుడు నాగబాబు నాలుగేళ్లుగా ‘మా’ మసకబారిపోయిందని ఓ మీడియా సమావేశంలో అన్నారు. నాగబాబు వ్యాఖ్యలపై మా అధ్యక్షుడు సీనియర్‌ నరేష్‌ స్పందిస్తూ… ‘నాగబాబు అలా అనడం తనని షాక్‌కు గురిచేసిందని’ అన్నారు. ఇక దీనిపై వివరణ ఇస్తూ.. నాగబాబు నాకు మంచి మిత్రుడు. గత నాలుగేళ్లుగా ‘మా’ అసోసియేషన్‌ చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ చిరంజీవి, నాగబాబులకి చెప్పే చేశామని ఆయన మీడియా సమావేశంలో నాగబాబుకి కౌంటర్‌ ఇచ్చారు. ఈ సమావేశంలో మా అసోసియేషన్‌ చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ ...

Read More »

రైలులో ప్రయాణించిన రాష్ట్రపతి దంపతులు

భారత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ తన భార్య సవితాదేవితో కలిసి యూపీ కాన్పూర్‌లోని స్వస్థలానికి రైలులో బయలుదేరారు. ఢిల్లీ సప్ధర్‌జంగ్‌ రైల్వేస్టేషన్‌లో ప్రత్యేక రైలు ఎక్కగా.. కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, రైల్వేబోర్డు చైర్మన్‌, సీఈఓ సునీశ్‌ శర్మ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయనకు జ్ఞాపికను అందజేశారు. రాంనాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మొదటిసారిగా స్వగ్రామానికి రైలులో వెళ్తున్నారు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఢిల్లీ నుంచి రైలులో బయలుదేరగా.. సాయంత్రానికి కాన్పూర్‌ చేరుకుంటుంది.

Read More »