Monthly Archives: June 2021

ఆయేషా సుల్తానాకు బెయిల్‌

లక్షద్వీప్‌కు చెందిన నటి, మోడల్‌, దర్శకురాలు ఆయేషా సుల్తానాకు కేరళ హైకోర్టు యాంటిసిపేటరి బెయిల్‌ మంజూరు చేసింది. లక్షద్వీప్‌ పోలీసులు రాజద్రోహం కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయగా.. ముందస్తు బెయిల్‌ కోరుతూ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు జస్టిస్‌ అశోక్‌ మీనన్‌ బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ పటేల్‌పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్రశాంతంగా ఉండే దీవిలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం, కరోనా కేసుల్ని అరికట్టడంలో విఫలమైనందుకు ప్రఫుల్‌ని కేంద్రం ప్రయోగించిన ...

Read More »

ఇందిరాగాంధీ పాత్రలో కంగన రనౌత్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ మరో పవర్ ఫుల్ పాత్రను పోషించబోతోంది. ఇప్పటికే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత బయోపిక్ ‘తలైవి’లో ఆమె నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళ వర్షన్ కు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే కంగన మరో కీలక ప్రకటన చేసింది. మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ పాత్రను పోషించబోతున్నట్టు ఆమె తెలిపింది.

Read More »

దేశంలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ తొలి మరణం నమోదు

 కరోనా మహమ్మారి రోజురోజుకు రూపం మార్చుకుంటూ మరింత శక్తివంతంగా తయారవతుంది. తాజాగా డెల్టా వేరియంట్‌ వ్యాప్తి ప్రారంభమయ్యింది. ఇది మిగతా వాటికన్న చాలా రేట్లు ప్రమాదకరం అని అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసి హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం నమోదయ్యింది. మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలో డెల్టా ప్లస్ వేరియంట్‌ సోకి బుధవారం ఒక మహిళ మృతి చేందారు.  మృతురాలి నుంచి తీసుకున్న నమూనాల జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ఆధారంగా సదరు మహిళ కరోనా వైరస్‌ డెల్టా ప్లస్‌ వేరియంట్‌ వల్లనే మృతి చెందినట్లు వైద్యులు ...

Read More »

జులై 31లోగా 12వ తరగతి ఫలితాలు వెల్లడించాల్సిందే : సుప్రీంకోర్టు

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల బోర్డులు ఇంటర్నల్‌ మార్కుల అసెస్‌మెంట్‌ను పూర్తి చేసి, జులై 31లోగా 12వ తరగతి ఫలితాలు వెల్లడించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. పది రోజుల్లోగా బోర్డులను మూల్యాంకన విధానాన్ని రూపొందించి కోర్టుకు తెలియజేయాలని సూచించింది. 12వ తరగతి పరీక్షలకు సంబంధించిన దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టు నేడు విచారణ జరిపింది. అయితే, బోర్డులన్నింటికీ ఏకరూప మూల్యాంకన విధానం ఉండేలా ఆదేశాల ఇవ్వాలన్న పిటిషనర్ల అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రతి బోర్డు స్వయంప్రతిపత్తి కలిగి ఉందని, అందువల్ల బోర్టులు తమ సొంత ...

Read More »

దసరా కానుకగా రెజీనా-నివేదా సాకిని-ఢాకిని

రెజీనా కసాండ్రా, నివేదా థామస్‌ కాంబినేషన్‌లో మహిళా ప్రాధాన్య చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సాకిని-ఢాకిని టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. కొరియన్‌లో యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’కు రీమేక్‌గా తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం కొరియన్‌ యాక్షన్‌ డైరెక్టర్‌ పర్యవేక్షణలో రెజీనా, నివేదా ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సురేశ్‌ బాబు, సునీత తాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సిద్ధం చేస్తున్నారు.

Read More »

పరీక్షలపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని పాటిస్తాం: అదిమూలపు సురేష్

రాష్ట్రంలో జరిగే పరీక్షలపై సుప్రీంకోర్టు ఏ నిర్ణయం ప్రకటించినా పాటిస్తామని మంత్రి అదిమూలపు సురేష్ తెలిపారు. సుప్రీంకోర్టులో ఏపీ, కేరళ రాష్ట్రానికి సంబంధించి పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై వాదనలు జరిగాయని మంత్రి సురేష్ పేర్కొన్నారు. రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందనడం సరికాదని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏమిటని సుప్రీంకోర్టు అడిగిందని సురేష్‌ పేర్కొన్నారు. పరీక్షలు ఎలా నిర్వహిస్తామన్నది స్పష్టంగా తెలియజేశామని మంత్రి  సురేష్‌ వివరించారు. గదికి 15 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థికి, ...

Read More »

పరీక్షలపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!

స్టేట్‌ బోర్డు పరీక్షల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో అఫిడవిట్‌ ఎందుకు దాఖలు చేయలేదని నిలదీసింది. పరీక్షలకు నిర్వహణకు సంబంధించి స్పష్టమైన వైఖరి తెలియజేస్తూ బుధవారం అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం కరోనా సమయంలో భౌతికంగా పరీక్షలు నిర్వహిస్తే.. దీని వలన ఒక్క విద్యార్థి మరణించినా, అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా జస్టిస్‌ ఎఎం.ఖాన్‌విల్కర్‌, దినేష్‌ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం స్పష్టం ...

Read More »

‘ఆచార్య‌’లో శ్రీ‌.శ్రీ?

చిరంజీవి – కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `ఆచార్య‌`. రామ్ చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇందులో న‌క్స‌ల్ నేప‌థ్యం కూడా ఉంది. చిరు, చ‌ర‌ణ్ `అన్న‌లు`గా క‌నిపించ‌బోతున్నారు. అందుకు సంబంధించిన స్టిల్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. `ఆచార్య‌`లో ఓ భావోద్వేగ గీతం ఉంద‌ని తెలుస్తోంది. అభ్యుద‌య భావాల‌తో సాగే ఆ గీతంలో శ్రీ‌శ్రీ రాసిన పంక్తులు వినిపిస్తాయ‌ని స‌మాచారం. అయితే అది పాట‌గా వాడుకున్నారా? డైలాగుల‌తో స‌రిపెడ‌తారా? అనేది తెలియాల్సివుంది. శ్రీ‌శ్రీ రాసిన `నేను సైతం ప్ర‌పంచాగ్నికి స‌మిథ‌నొక్క‌టి ఆహుతిచ్చాను` ...

Read More »

9 ప్రైవేటు ఆసుపత్రుల యజమానులపై క్రిమినల్‌ కేసులు

కోవిడ్‌ చికిత్సలో అవకతవకలకు పాల్పడిన 9 ప్రైవేటు ఆసుపత్రుల యజమానులపై ఎపి సర్కార్‌ క్రిమినల్‌ కేసులను నమోదు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి 15 ఆసుపత్రులను తనిఖీ చేసిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తాజాగా 9 ప్రైవేటు ఆసుపత్రులు అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించింది.  విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ… అవకతవకలకు పాల్పడిన తొమ్మిది ఆసుపత్రులకు సంబంధించిన యాజమాన్యాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశామన్నారు. కోవిడ్‌ చికిత్సలో అవకతవకలకు పాల్పడుతున్న ఆసుపత్రులపై ఏర్పాటు చేసిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ...

Read More »

రాష్ట్రీయం మండలి రద్దుపై వెనక్కి తగ్గేది లేదు

శాసనసమండలిని రద్దు చేయాలన్న తమ ప్రభుత్వ నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మండలి రద్దు తీర్మానం అనేది ఎత్తుగడలో భాగంగా తమ ప్రభుత్వం చేయలేదన్నారు. మండలి వ్యవస్థ ఉండకూడదనేదే తమ ఉద్దేశ్యమమన్నారు. ప్రతిపక్షం శాసనమండలిని నవ్వలాటగా మార్చిందని, తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందని విమర్శించారు. గవర్నర్‌ కోటాలో మండలికి ఎంపికయిన అభ్యర్ధుల ప్రమాణస్వీకారం సందర్భంగా సజ్జల ఈ వ్యాఖ్యలు చేశారు.

Read More »