Monthly Archives: June 2021

నాని నిర్మాణంలో ‘మీట్‌ క్యూట్‌’

వాల్‌ పోస్టర్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై హీరో నాని నిర్మించిన అ, హిట్‌ వంటి సినిమాలు సూపర్‌ హిట్‌ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా నాని నిర్మాణంలో మీట్‌ క్యూట్‌ అనే సినిమా రూపొందుతుంది. ఈ విషయాన్ని నాని ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘నేడు కొత్త ప్రయాణం మొదలైంది. ఇది నాకెంతో ప్రత్యేకం..’ అంటూ మీట్‌ క్యూట్‌కు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేశాడు. ఈ సినిమాలో సత్యరాజ్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

Read More »

అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌ లో చిన్నారులకు ప్రత్యేక సదుపాయాలు

రాష్ట్రములో కరోనా థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందోస్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నది.చిన్నారులకు మెరుగైన వైద్యం కోసం పీడియాట్రిక్‌ అంశాల్లో వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళగిరి ఏపిఐఐసి భవనం 6ఫ్లోర్‌ లోని కాన్ఫరెన్స్‌ హల్‌ లో మంగళవారం కోవిడ్‌ నివారణ గ్రూప్‌ అఫ్‌ మిమిస్టర్స్‌ సమావేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, కమిటీ కన్వీనర్‌ ఆళ్ల నాని అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ...

Read More »

సమంతకు అన్ని కోట్ల రెమ్యునిరేషనా..!

సమంత వెబ్‌సిరీస్‌లోనూ రాణిస్తోంది. తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ‘ది ఫ్యామిలీ మేన్‌ -2’ వెబ్‌ సిరీస్‌లో ఆమె నటించిన రాజీ పాత్రకు అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఆమె రాజీ పాత్రలో నటించినందుకు గాను, అమెజాన్‌ డిజిటల్‌ సంస్థ సమంతకు నాలుగు కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ ఇచ్చిందని టాక్‌ వినిపిస్తోంది. కాగా.. ఇప్పుడు తాజాగా ఆమె మరో వెబ్‌ సిరీస్‌లో నటించడానికి సిద్ధమౌతున్నట్లు సమాచారం. ఈ వెబ్‌సిరీస్‌ను మరో డిజిటల్‌ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ నిర్మించబోతుందని తెలుస్తోంది. అందులో భాగంగా సదరు డిజిటల్‌ సంస్థ సమంతకు ...

Read More »

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీకి సిద్ధం

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆప్‌ సిద్ధమేనని ఆమ్‌ఆద్మీపార్టీ (ఆప్‌) కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తెలిపారు. సోమవారం అహ్మదాబాద్‌లోని నవ్రంగ్‌పురలో ఆప్‌ పార్టీ కార్యాలయాన్ని కేజ్రీవాల్‌ ప్రారంభించారు. కేజ్రీవాల్‌ సమక్షంలో ప్రముఖ పాత్రికేయుడు ఇసుదన్‌ గాద్వి ‘ఆప్‌’లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..వచ్చే ఏడాది జరగనున్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాల్లోనూ అప్‌ అభ్యర్థులు పోటీ చేస్తారని, అందుకు ఆప్‌ సిద్ధంగా ఉందని అన్నారు. కాగా, కేజ్రీవాల్‌ అహ్మదాబాద్‌ రావడం ఈ ...

Read More »

మెగాస్టార్ మీద కేంద్రమంత్రి ప్రసంశల వర్షం

మెగాస్టార్‌ చిరంజీవిపై కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ప్రశంసలు కురిపించారు. మానవ జీవితాన్ని కాపాడడమే మానవత్వానికి గొప్ప సేవ అని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో చిరంజీవి, ఆయన బందం చాలా విలువైన ప్రాణాలను రక్షించి ఎంతోమందికి సహాయ పడ్డారని సికింద్రాబాద్‌ ఎంపీ కిషన్‌ రెడ్డి కొనియాడుతూ ట్వీట్‌ చేశారు. ఆయన ట్వీట్‌కు స్పందించిన చిరంజీవి ”మీ దయగల మాటలకు ధన్యవాదాలు. నేను చేయగలిగిన చిన్న సహాయం మాత్రమే చేస్తున్నా” అంటూ రిప్లై ఇచ్చారు. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో ఎంతోమంది రోగులు ...

Read More »

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అనాథ పిల్లలకు స్మార్ట్‌ ఫోన్లు

కరోనా బారినపడి తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ ఫోన్లు తీసుకున్న అనంతరం.. అనాథ పిల్లలు ఏదైనా సాయం కోసం అధికారులను సంప్రదించవచ్చు. ఒక్క హైదరాబాద్‌ జిల్లాలోనే కోవిడ్‌ బారినపడి తల్లిదండ్రులు మరణించడంతో 85 మంది పిల్లలు అనాథలయ్యారు. దీంతో పాటు తల్లిదండ్రుల్లో ఒకరు మరణించిన అనాథలు సైతం ఉన్నారని అధికారులు తెలిపారు. మొత్తం 138 మంది అనాథ పిల్లలున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.    అనాథ పిల్లల భద్రత దృష్ట్యా వారి సమస్యలను అధికారులు ...

Read More »

‘ఖిలాడి’ రీమేక్‌ చేయబోతున్న సల్మాన్‌

చాలాకాలంగా దక్షిణాది రీమేక్‌లతో బ్లాక్‌ బస్టర్లు హిట్లు కొడుతున్నారు బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌. తాజాగా రవితేజ నటిస్తున్న ‘ఖిలాడి’ చిత్ర రీమేక్‌ హక్కులను ఆయన కొనుగోలు చేశారు. హిందీ వెర్షన్‌ కి కూడా రమేష్‌ వర్మనే డైరెక్ట్‌ చేయాలని ఆఫర్‌ చేశారని తెలుస్తోంది. ‘ఖిలాడీ’ టీజర్‌ నచ్చి, మేకర్స్‌్‌ ద్వారా కథ కూడా బావుందని తెలిసి హక్కులు కొనుగోలు చేశారని సమాచారం. ఇదివరకే రవితేజ నటించిన ‘కిక్‌’తో సల్మాన్‌ పెద్ద హిట్టు కొట్టాడు. ఇప్పుడు ‘ఖిలాడీ’ వర్కవుటవుతుందో లేదో చూద్దాం.

Read More »

రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు విస్తరించ నున్నాయని, ఉత్తర బంగాళాఖాతంలో అంతటికీ వ్యాపించి వర్షాలకు అనువైన పరిస్థితులు ఏర్పడనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలకు అవకాశాలున్నాయని పేర్కొన్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల శుక్రవారం వర్షాలు పడ్డాయి. తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం రూరల్‌, రాజమహేంద్ర వరం, రాజవొమ్మంగి, ...

Read More »

కేంద్ర ఉక్కుశాఖ మంత్రితో ముగిసిన సీఎం జగన్ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ రెండు రోజుల పర్యటనలో భాగంగా.. కేంద్ర ఉక్కు శాఖామంత్రితో భేటీ అయ్యారు. సుమారు గంటపాటు భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ నిలిపివేయాలని ఉక్కు శాఖామంత్రి ధరేంద్ర ప్రధాన్‌ను సిఎం జగన్‌ కోరారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సూచించిన ప్రత్యామ్నాయాలను సిఎం మరోసారి ఆయనకు వివరించారు. అలాగే కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటును వేగవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ధరేంద్ర ప్రధాన్‌ కూడా.. ఏపీలో కచ్చితంగా ...

Read More »

కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో జగన్ భేటీ

కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. రాష్ట్ర సివిల్ సప్లైకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని పీయూష్ గోయల్‌ను కోరారు.  2020-21 రబీ సీజన్‌కు ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్న సీఎం జగన్‌.. సకాలంలో రైతులకు పేమెంట్లు అందేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రబీ ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతుందని, బకాయిలు విడుదల అత్యంత అవసరమని స్పష్టం చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా బియ్యం సబ్సిడీ బకాయిలు చెల్లించాలని, కేంద్రం నుంచి రావాల్సిన ...

Read More »