Monthly Archives: July 2021

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

ప్రముఖ సినీ నటి జయంతి (79) కన్నుమూశారు. రెండేళ్లుగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న జయంతి.. బెంగళూరులోని తన ఇంట్లో మృతి చెందారు. తెలుగు, కన్నడ, తమిళ భాషలతోపాటు మలయాళ, హిందీ చిత్ర సీమల్లోనూ జయంతి సత్తా చాటారు. మొత్తంగా ఆమె 500కు పైగా మూవీల్లో నటించారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, రాజ్‌కుమార్, రజనీకాంత్ లాంటి దిగ్గజ నటులతో ఆమె నటించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీలో జయంతి మంచి పేరు దక్కించుకున్నారు. నటనకు దేవత అంటూ అభిమాన శారదగా జయంతిని కన్నడ ఫ్యాన్స్ పిలుస్తుంటారు. జయంతి ఏడు మార్లు కర్నాటక ...

Read More »

మోడీ ‘బాధితుల’ జాబితాలో చేరిన యడియూరప్ప

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప రాజీనామాతో.. మోడీ సర్కార్‌పై కాంగ్రెస్‌ విమర్శనాస్త్రాలు సంధించింది. మోడీ మరో బాధితుడు యడియూరప్ప అంటూ వ్యాఖ్యానించింది. రాజీనామా చేయాలంటూ మోడీ ఒత్తిడి తీసుకువచ్చిన బిజెపి సీనియర్‌ నేతల జాబితాలో యడియూరప్ప మరో బాధితుడుగా చేరాడని కాంగ్రెస్‌ పేర్కొంది. ముఖ్యమంత్రులు, బిజెపి ఎమ్మెల్యేలుగా కొనసాగాలంటే కేంద్రంలోని నిరంకుశ పాలకుల అనుమతి ఉండాల్సిందేనని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రణదీప్‌ సుర్జేవాలా పేర్కొన్నారు. అక్రమంగా, ఫిరాయింపు ద్వారా కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం అధికారం చేపట్టిందని.. ఇది చట్టవిరుద్ధమని అన్నారు. కాంగ్రెస్‌ -జనతా దళ్‌ (సెక్యులర్‌) ...

Read More »

గోదావరికి పోటెత్తిన వరద

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో భారీగా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వరద ఉధృతితో గురువారం రాత్రి 11 గంటలకు గోదావరి నీటిమట్టం 17.03 అడుగులు ఉండగా, శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు 18.90 అడుగులకు చేరింది. అది పెరుగుతూ రాత్రి 11 గంటలకు 33.10 అడుగులకు చేరింది. ఇదిలా ఉండగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి కూడా వరద నీరు ఉపనదుల ద్వారా గోదావరికి చేరడంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి మరింత పెరిగింది. అంతేకాకుండా ...

Read More »

నా భర్త అమాయకుడు- శిల్పాశెట్టి

పోర్న్‌ రాకెట్‌ కేసులో పట్టుబడ్డ రాజ్‌ కుంద్రా భార్య, బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టిని ముంబయి పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది. కుంద్రా వ్యాపారాలతో శిల్పాకు ఏమైనా సంబంధాలున్నాయా? అనే విషయంపై పోలీసులు పలు ప్రశ్నలు సంధించారు. మొబైల్‌ యాప్‌ ‘హాట్‌షాట్స్‌’లో ఎటువంటి అంశాలుంటాయో తన భర్తకు తెలియదని,తన భర్త అమయాకుడని శిల్పా చెప్పినట్లు ముంబయి పోలీసులు చెప్పారు. లండన్‌లో ఉండే కుంద్రా బావ ప్రదీప్‌ బక్షికి చెందినదే ఈ హాట్‌షాట్స్‌ యాప్‌ అని తెలిపారు. అందులో ఎటువంటి కంటెంట్‌ వస్తుందో తన భర్తకు తెలియదన్నారు. అశ్లీల ...

Read More »

ఏపీలో ఆగస్టు 16 నుంచి స్కూల్స్‌ ఓపెన్‌

ఏపీలో ఆగష్టు 16 నుంచి స్కూల్స్‌ పున: ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ నెమ్మదించడంతో స్కూల్స్‌ను మళ్లీ తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ విధివిధానాలను త్వరలో విద్యాశాఖ వెల్లడించనుంది. శుక్రవారం ఉదయం విద్యాశాఖకు సంబంధించి నాడు-నేడు సమీక్షను సిఎం జగన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగష్టు 16 నుంచి పాఠశాలలను పున: ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. అదేరోజున విద్యార్థులకు విద్యా కానుక కిట్టులను విద్యాశాఖ అందించనుంది. రాష్ట్రంలో థర్డ్‌వేవ్‌ ప్రభావం ఎలా ఉంటుందనే విషయమై ఇంతవరకు స్పష్టత లేదు. ఎక్కడయితే కోవిడ్‌ ...

Read More »

విదేశాల్లో ప్రభాస్ క్రేజ్ మామూలుగా లేదుగా..!

విదేశీ మీడియాలో మన నటుల గురించి వార్తలు రావడం చాలా అరుదు. హాలీవుడ్‌ సినిమా హీరోలను మాత్రమే తమ మీడియాలో కవర్‌ చేసే ఇటలీ మీడియా సంస్థ ఇటీవల ప్రభాస్‌ గురించి ఓ వార్తా కథనం రాసింది. ప్రభాస్‌ ‘రాధే శ్యామ్‌’ సినిమా షూటింగ్‌ ముగించుకుని ఇటలీ నుంచి ఇండియాకు తిరిగి వెళ్లి పోయాడు అంటూ ఇటాలియన్‌ వెబ్‌ పోర్టల్‌ కథనం రాసింది. దాంతో ప్రస్తుతం ఆ వార్తను ప్రభాస్‌ అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు.

Read More »

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జగన్‌

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వర్షాల పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు.వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావారణ కేంద్రం హెచ్చరించింది. రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని పేర్కొంది. కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయని తెలిపింది. తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Read More »

‘ఆహా’లో నయనతార ‘నీడ’

తమిళంలో విడుదలైన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘నిజల్‌’ మూవీకి తెలుగానువాదం ‘నీడ’. ఈ సినిమా జులై 23న ఆహాలో స్ట్రీమింగ్‌ కాబోతోంది. నయనతార, కుంచాకో బోబన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, అప్పు ఎన్‌.భట్టతిరై ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తాజాగా చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ విడుదలైంది. నితిన్‌ అనే చిన్నారి సాయంతో జాన్‌ అనే న్యాయమూర్తి ఒక హత్య కేసును ఎలా చేధించాడు? అనేది ఈ సినిమా కథాంశం.

Read More »

మూడో దశలో పిల్లపై తీవ్ర ప్రభావం

కోవిడ్‌ మొదటి దశ కంటే రెండో దశలో పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపింది. ఇక మూడో దశలో.. మరింత ఎక్కువగా ప్రభావం చూపనుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడో దశలో పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపనుందని లేడీ హార్డింగ్‌ మెడికల్‌ కాలేజీ పీడియాట్రిక్స్‌ విభాగం డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. మహమ్మారి వల్ల.. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాల్లోని పిల్లలపై దాదాపు సంవత్సరం నుంచే ఆ ప్రభావం పడిందని, థర్డ్‌వేవ్‌ వస్తే… ఈ పిల్లలపై మళ్లీ వైరస్‌ ప్రభావం చూపనుందన్న ఊహాగానాలు ...

Read More »

‘రాజా విక్రమార్క’ పోస్టర్‌ విడుదల

Rx100 సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో కార్తికేయ. ”హిప్పీ, గుణ 369, 90 ML, చావు కబురు చల్లగా” లాంటి సినిమాలతో అలరించిన ఈ హీరో ఇప్పుడు చిరంజీవి టైటిల్‌తో మరోసారి థియేటర్స్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ‘రాజావిక్రమార్క’ పేరుతో కార్తికేయ హీరోగా శ్రీ సరిపల్లి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా తాజాగా బక్రీద్ కానుకగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు. తాజాగా ...

Read More »