Monthly Archives: July 2021

పెగాసెస్ పై దద్దరిల్లిన పార్లమెంట్‌

 పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల రెండోరోజూ పెగాసెస్‌ వ్యవహారం సెగ తగిలింది. ఫోన్ల హ్యాకింగ్‌పై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే.. ప్రతిపక్షాలు ‘పెగాసస్‌’ అంశంపై చర్చ జరపాలంటూ పట్టుబట్టాయి. పలువురు ఎంపిలు నినాదాలు చేశారు. సభను కొనసాగించేందుకు సహకరించాలని స్పీకర్‌ ఓం బిర్లా కోరారు. ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో నాలుగు నిమిషాలకే సభ వాయిదా పడింది. లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.రాజ్యసభకు ఇదే సెగ తాకింది. ఆందోళనల ...

Read More »

నారప్ప మూవీ రివ్యూ

 వెంకటేష్‌ ఇప్పటివరకూ నటించని పాత్ర.. తాను ఛాలెంజ్‌గా తీసుకొని చేసిన సినిమా నారప్ప. ఈ చిత్రం తమిళ ‘అసురన్‌’ మూవీ రీమేక్‌. ఈ చిత్రానికి నిర్మాతలుగా ఎస్‌.థాను, సురేష్‌బాబు వ్యవహరించగా.. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ మూవీ థియేటర్లలో విడుదల కాకుండా ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో మంగళవారం (జూలై 20)న విడుదలైంది. మరి జాతీయ అవార్డును వరించిన అసురన్‌లా.. నారప్ప ఉందా లేదా అనేది తెలుసుకుందాం…కథఅనంతపురం జిల్లా రామసాగరం గ్రామానికి చెందిన నారప్ప (వెంకటేశ్‌) తనకున్న మూడెకరాల ...

Read More »

రాజ్యసభలో వైసీపీ ఎంపీల ఆందోళన

పోలవరం ప్రాజెక్ట్‌పై రాజ్యసభలో వైసిపి ఎంపిలు ఆందోళన చేపట్టారు. ప్రాజెక్ట్‌ సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని నినాదాలు చేశారు ఎంపి. విజరుసాయి రెడ్డి వెల్‌లోకి దూసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్ట్‌ సవరించిన అంచనాలపై కేంద్రం ఆమోదం తెలపాలని వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. అలాగే వచ్చే ఏడాది కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధలు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు.

Read More »

ఓటీటీలో విడుద‌ల‌వుతున్న నార‌ప్ప

టాలీవుడ్‌ ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్‌ నటించిన తాజా చిత్రం ‘నారప్ప’. ఈ మూవీ తమిళ హీరో ధనుష్‌ నుటించిన అసురన్‌ చిత్రానికి రీమేక్‌గా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే కరోనా పరిస్థితుల రీత్యా.. ఈ చిత్రం థియేటర్లలో కాకుండా ఓటీటీ బాట పట్టింది. మంగళవారం ఈ మూవీ అమెజాన్‌ప్రైమ్‌ వీడియోలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర సహ నిర్మాత, వెంకటేష్‌ సోదరుడు దగ్గుబాటి సురేష్‌బాబు మాట్లాడుతూ.. ‘తమిళంలో అసురన్‌ చిత్రం చూసిన వెంటనే నాకు బాగా ...

Read More »

బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి

కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ కీలక పదవిని కట్టబెట్టారు. ఈ రోజు నామినేటెడ్ పదవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ గా బైరెడ్డి సిద్ధార్థ్ ను జగన్ నియమించారు. 2019 ఎన్నికల్లో నందికొట్కూరు ఎమ్మెల్యే టికెట్ దక్కకపోయినప్పటికీ వైసీపీ గెలుపు కోసం బైరెడ్డి కృషి చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఆర్థర్ కు, బైరెడ్డికి అభిప్రాయ భేదాలు ముదిరాయి. ప్రతి ఎన్నికల సమయంలో తమ అనుచరుల టికెట్ల ...

Read More »

‘ఛత్రపతి’ రీమేక్‌కి క్లాప్‌

యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్నచిత్రం శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. రాజమౌళి తెరకెక్కించిన ‘చత్రపతి‘ చిత్రానికి ఇది రీమేక్. పెన్ మ‌రుధ‌ర్ సినీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, పెన్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ధ‌వ‌ల్ జ‌యంతిలాల్ గ‌డ‌, అక్ష‌య్ జయంతిలాల్ గ‌డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి రాజ‌మౌళి, సుకుమార్‌, విజ‌యేంద్ర ప్ర‌సాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, దర్శకుడు వీవీ వినాయక్, బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత జయంతిలాల్ కార్య‌క్ర‌మంలో భాగ‌మ‌య్యారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి రాజ‌మౌళి క్లాప్ కొట్ట‌గా, ...

Read More »

మోడి వీడియో కాన్ఫరెన్స్‌లో సిఎం జగన్‌

దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. కోవిడ్‌ పరిస్థితి, వ్యాక్సినేషన్‌ అంశాలపై ప్రధాని సమీక్ష చేపట్టారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. కరోనా థర్డ్‌ వేవ్‌ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ”కోవిడ్‌ నివారణలో రాష్ట్రానికి అందిస్తున్న సహాయానికి కృతజ్ఞతలు. రాష్ట్ర విభజన వల్ల వైద్యపరంగా మౌలిక సదుపాయాల సమస్యను ఎదుర్కొన్నాం. అత్యాధునిక వైద్య సదుపాయాలు రాష్ట్రంలో లేవు. రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలు ఏపీలో ...

Read More »

‘చిన్నారి పెళ్లికూతురు’ బామ్మ సురేఖ సిఖ్రి కన్నుమూత

బాలికా వధు (చిన్నారి పెళ్లికూతరు) ఫేమ్‌ లెజెండరీ నటి సురేఖ సిఖ్రి (75) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా సిఖ్రి మరణించిందని ఆమె మేనేజర్‌ మీడియాకు వివరించారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిఖ్రి.. శుక్రవారం తుదిశ్వాస విడిచింది. ‘కిస్సా కుర్సి కా’ చిత్రంతో తెరంగేట్రం చేసిన సురేఖ సిఖ్రి తమాస్ (1988), మమ్మో (1995) బధాయ్ హో (2018) చిత్రాలకు గానూ ఉత్తమ నటిగా మూడు నేషనల్‌ అవార్డులు సంపాదించుకుంది.

Read More »

ఇండియాలో భారీగా పెరిగిన కరోనా కేసులు

ఇండియాలో క‌రోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 41,806 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,09,87,880 కి చేరింది. ఇందులో 3,01,43,850 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 4,32,041 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 581 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 4,11,989 ...

Read More »

వెంకీ ‘నారప్ప’ ట్రైలర్‌ విడుదల

విక్టరీ వెంకటేష్‌, సెన్సిబుల్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ అడ్డాల కాంబినేషన్‌లో రూపొందిన తాజా మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘నారప్ప’. డి.సురేష్‌బాబు, కలైపులి యస్‌ థాను సంయుక్తంగా నిర్మించిన ‘నారప్ప’ చిత్రం ఈ నెల 20 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ రోజు (జూలై 14)న ‘నారప్ప’ ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్‌. ‘నీదైన దాని కోసం పోరాటం చెయ్యి.. సరైన సమయంలో..’ అంటూ ‘నారప్ప’ ట్రైలర్‌ను షేర్‌ చేశారు విక్టరీ వెంకటేష్‌. ”నారప్ప’ ట్రైలర్‌ కసిగా ఉంది” అని ట్వీట్‌ చేశారు రానా. ...

Read More »