Monthly Archives: July 2021

మహిళలు పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేదు..జగన్

ఏదైనా సమస్యతో ఫిర్యాదులివ్వాలన్నా.. కేసులు పెట్టాలన్నా మహిళలు పోలీసుస్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేదని గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఫిర్యాదులు చేయొచ్చునని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. దిశ యాప్‌లోని అన్ని ఫీచర్లపై మహిళా పోలీసులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి రెండు వారాలకు ఒకసారి జిల్లా కలెక్టర్, ఎస్పీ సమావేశం కావాలని, ప్రజా సమస్యలతో పాటు మహిళా భద్రతపైనా సమీక్షించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక పంపించాల్సి ఉంటుందని సూచించారు.

Read More »

15 ఏళ్ల వివాహ బంధానికి అమీర్‌ఖాన్‌, కిరణ్‌రావు గుడ్‌బై

 బాలీవుడ్‌ మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌, ఫిల్మ్‌ మేకర్‌ కిరణ్‌ రావు విడాకులు తీసుకున్నారు. 15 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు శనివారం ప్రకటించారు.‘కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం.భార్య, భర్తలుగా విడిపోయినప్పటికీ పిల్లలకు తల్లిదండ్రులుగా కలిసే ఉంటాం’అని ప్రకటించారు. కాగా, 2005లో వీరి వివాహం జరిగింది. ఈ జంటకు ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే తామిద్దరం విడిపోయినా కూడా తమ సంతానమైన ఆజాద్‌ను కలిసే పెంచుతామని అన్నారు.

Read More »

4 లక్షలు దాటిన కరోనా మరణాలు

దేశంలో కరోనా మరణాలు నాలుగు లక్షలు దాటాయి. నిన్న దేశవ్యాప్తంగా 853 మంది చనిపోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4 లక్షల 312కు పెరిగింది. ఇక నిన్న  దేశవ్యాప్తంగా 46 వేల 617 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు. నిన్నటితో పోల్చితే 4.4 శాతం కేసులు తగ్గాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3 కోట్ల 4 లక్షల 58 వేల 251కి పెరిగింది. ఇక ఇప్పటివరకూ 2 కోట్ల 95 లక్షల 48 వేల 302 మంది కరోనా ...

Read More »

కత్తి మహేష్ చికిత్సకు జగన్ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం

సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్‌ గత నెల 26న నెల్లూరు జిల్లా కొడవలూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం మొదట నెల్లూరు ఆస్పత్రికి, ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం చెన్నైలో అపోలో ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం మహేశ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో మహేశ్‌ చికిత్స నిమిత్తం ఎపి ప్రభుత్వం ఆర్థికసాయం ...

Read More »

ఢిల్లీలో మండుతున్న ఎండలు

 దేశ రాజధాని ఢిల్లీతో పాటు గుర్గావ్‌లో హీట్‌ వేవ్స్‌ కారణంగా ఎండలు దంచికొట్టాయి. బుధవారం ఢిల్లీలో గరిష్ఠంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ శాఖ పాలమ్‌ అబ్జర్వేటరీ తెలిపింది. గుర్గావ్‌లో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రెండు నగరాల్లో ఉష్ణోగ్రత సాధారణం కంటే ఏడు డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా ఉందని పేర్కొంది. జూలై 7వ తేదీ వరకు రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని, అప్పటి వరకు ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా ...

Read More »

నటి కవిత భర్త కన్నుమూత

సీనియర్‌ నటి కవిత భర్త దశరథ రాజు బుధవారం ఉదయం కన్నుమూశారు. మూడు వారాల క్రితం ఆయనకు కరోనా సోకిన విషయం తెలిసిందే! ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. రెండు వారాల క్రితం కవిత కుమారుడు సాయి స్వరూప్‌ కరోనాతో మరణించారు. దశరథ రాజు మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు కవితను పరామర్శించారు. దక్షిణాది భాషల్లో 350కు పైగా చిత్రాల్లో నటించారు కవిత.

Read More »