Monthly Archives: September 2021

నటుడు ఉత్తేజ్ ఇంట తీవ్ర విషాదం

 నటుడు ఉత్తేజ్‌ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి పద్మావతి కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్‌, ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. ఉత్తేజ్‌ను పరామర్శిస్తున్నారు. ఉత్తేజ్‌ చేసే సేవా కార్యక్రమాల్లో పద్మావతి భాగస్వామి అయ్యేవారు. ఉత్తేజ్‌ కు చెందిన మయూఖ టాకీస్‌ ఫిల్మ్‌ యాక్టింగ్‌ స్కూల్‌ నిర్వహణలో ఆమె ...

Read More »

కేంద్ర విదేశాంగ మంత్రికి జగన్ లేఖ

బహ్రెయిన్ లో చిక్కుకున్న ఏపీ కార్మికులను స్వదేశానికి తీసుకురావాలని సీఎం జగన్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు విదేశాంగ మంత్రి జైశంకర్ కు లేఖ రాశారు. బహ్రెయిన్ లో ఏపీకి చెందిన అత్యధిక మంది పని చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే అక్కడి కంపెనీలు వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, త్వరగా కంపెనీలు వారిని స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని జగన్ కోరారు.

Read More »

సాయిధరమ్‌తేజ్‌ శస్త్రచికిత్స విజయవంతం

మెగాస్టార్‌ మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ గత శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో తేజ్‌కు కంటి, ఛాతీ భాగంలో గాయాలతోపాటు.. కాలర్‌ బోన్‌ కూడా విరిగింది. ఆయనకు అపోలో ఆసుపత్రిలో వైద్యులు మెరుగైన చికిత్సనందిస్తున్నారు. ఆదివారం తేజ్‌కు కాలర్‌బోన్‌ శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్టు వైద్యులు తెలిపారు. అలాగే సాయితేజ్‌ ఆరోగ్యాన్ని డాక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించారు.

Read More »

బైక్ ఆక్సిడెంట్ లో సాయిధరమ్‌ తేజ్‌

బైక్‌ రైడింగ్‌ చేస్తూ మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు, సినీనటుడు సాయిధరమ్‌ తేజ్‌ శుక్రవారం రాత్రి గాయపడ్డారు. ప్రమాదంలో ఆయన కుడికంటిపై భాగంతో పాటు ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ రాయదుర్గం పరిధి ఐకియా స్టోర్‌ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తీగల వంతెన వైపు నుంచి ఐకియా వైపు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. బైక్‌తో ఆయన కింద పడిపోవడాన్ని గమనించిన స్థానికులు 108 వాహనానికి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రథమ చికిత్స అనంతరం అపస్మారక స్థితిలో ఉన్న ...

Read More »

గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ రాజీనామా!

గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌కు ఇచ్చారు. కాగా, వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ అనూహ్య పరిణామం వెనుక గల కారణాలు తెలియరాలేదు. విజయ్‌ రూపానీ 2016 నుంచి గుజరాత్‌ సిఎంగా ఉన్నారు. ఆయన పదవీ కాలం మరో ఏడాది పాటు ఉంది. అయితే, బిజెపి అధిష్టానం ఆదేశాలతోనే ఆయన సిఎం పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. కొత్త నాయకత్వం ...

Read More »

వంద బిలియన్‌ డాలర్ల జాబితాకి చేరువలో ముఖేష్‌ అంబానీ

ప్రపంచ ధనవంతుల జాబితాలో ప్రస్తుతం 12 స్థానంలో ఉన్న రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ మరో అరుదైన ఫీట్‌ను సాధించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌ ప్రకారం..ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో 10వ స్థానంలో ఉన్న వారెన్ బఫెట్ తరువాత స్థానంలో నిలిచారు.     శుక్రవారం ఒక్కరోజే ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో రియలన్స్‌ షేర్‌ వ్యాల్యూ 4 శాతం పెరిగి..అంబానీ సంపాదనకు మరో 3.7 బిలియన్ల డాలర్లు చేరినట్లైంది. దీంతో 92.9 బిలియన్‌ డాలర్లతో వరల్డ్‌ వైడ్‌ బిలియనీర్‌ జాబితాలో 11వ స్థానంలో ప్రముఖ కాస్మోటిక్స్‌ సంస్థ లోరియల్‌ వారసురాలు ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయరన్‌ను ...

Read More »

హీరోయిన్‌గా ప్రముఖ దర్శకుడు శంకర్‌ కుమార్తె రంగ ప్రవేశం

ప్రముఖ దర్శకులు శంకర్‌ చిన్న కుమార్తె అదితీ శంకర్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు. కార్తీ హీరోగా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విరుమన్‌’. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై హీరో సూర్య, జ్యోతిక నిర్మిస్తున్న ఈ చిత్రంలో అదితీ శంకర్‌ హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ‘‘అదితీ శంకర్‌కు స్వాగతం. ప్రతి ఒక్కరి హృదయాలను నువ్వు(అదితీ) గెలుచుకుంటావు’’ అన్నారు సూర్య. ‘‘అదితీని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్న సూర్య, కార్తీ, జ్యోతికలకు ధన్యవాదాలు. ఫుల్‌ ప్రిపరేషన్‌తో వస్తున్న అదితీని ఆదరిస్తారనే ఆశిస్తున్నాను’’ అన్నారు శంకర్‌. ‘‘అవకాశం ...

Read More »

ఏపీ లో ఆరుగురు ఐఎఎస్‌ల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో ఆరుగురు ఐఎఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎఎంఆర్‌డిఎ కమిషనర్‌గా కె.విజయ, సీసీఎల్‌ఎ అప్పిల్స్‌ కమిషనర్‌గా డాక్టర్‌ పి.లక్ష్మీనరసింహం, ఎఎంఆర్‌డిఎ అడిషనల్‌ కమిషనర్‌గా పి.ప్రశాంతి, గుంటూరు జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అభివఅద్ధి జేసీగా జి.రాజకుమారి, కడప ఆర్‌డిఒ గా పి.ధర్మచంద్రారెడ్డి, ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ సెక్రటరీగా పఅథ్వీ తేజ్‌ బదిలీ అయ్యారు. ఎపి పవర్‌ కార్పొరేషన్‌ ఎండి గా పఅథ్వీతేజ్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలను అప్పగించింది. 

Read More »

రామ్‌చరణ్‌, యశ్‌తో శంకర్‌ మల్టీస్టారర్‌!

శంకర్‌ సినిమాలు భారీగా ఉంటాయి. భారీ గ్రాఫిక్స్, భారీ సెట్టింగ్స్‌ ఆయన స్పెషాలిటీ. ప్రస్తుతం ‘ఇండియన్‌’ సీక్వెల్‌ ‘ఇండియన్‌ 2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారాయన. ఈ సినిమా తర్వాత శంకర్‌ ఓ భారీ మల్టీస్టారర్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు సూపర్‌స్టార్‌ రామ్‌చరణ్, కన్నడ స్టార్‌ హీరో యశ్‌ను హీరోలుగా పెట్టి ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం కోలీవుడ్‌ సర్కిల్స్‌లో ఇదే హాట్‌ టాపిక్‌.

Read More »

యూపీని వణికిస్తున్న వింత జ్వరం

 ఉత్తరప్రదేశ్‌ డెంగ్యూ వణికిస్తోంది. ఉత్తర యుపిలోని ఫిరోజ్‌బాద్‌ జిల్లాలో గడిచిన 10 రోజుల్లో సుమారు 50 మంది డెంగ్యూతో చనిపోగా.. అందులో 40 మంది చిన్నారులు ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది. డెంగ్యూకు తీవ్ర రూపమైన ‘ డెంగ్యూ హేమరేజిక్‌ ఫీవర్‌’ కారణంగా ఈ మరణాలు సంభవించాయని యోగి సర్కార్‌ చెబుతోంది. మరికొన్ని ఉత్తర యుపి జిల్లాలైన మధుర, ఆగ్రాల్లో కూడా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. వైరల్‌ ఫీవర్లతో, డీ హైడ్రేషన్‌కు గురైన చిన్నారులతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. కాగా, ఈ హేమరేజిక్‌ ఫీవర్‌ చాలా ...

Read More »