Monthly Archives: October 2021

ఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం

ఏపీ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాతో గవర్నర్‌ బిశ్వభూషన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. అలాగే మంత్రులు బొత్స సత్యనారాయణ,  వెల్లంపల్లి శ్రీనివాస్,  పలువురు ఎమ్మెల్యేలు , హైకోర్టు న్యాయవాదులు హాజరయ్యారు.

Read More »

మా అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా ప్రకాష్ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించారు. డ్రామాలు, విమర్శలు, ఆరోపణల మధ్య మంచు విష్ణు ప్యానెల్ మెజారిటీ సాధించింది. ఈ రోజు మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పదవిని చేపట్టారు. నరేష్ నుంచి బాధ్యలను తీసుకున్న మంచు విష్ణు ఇకపై ‘మా’ అధ్యక్షుడుగా కొనసాగుతారు. పెండింగ్ పెన్షన్స్ ఫైల్ పైన మంచు విష్ణు అధ్యక్షుడిగా తొలి సంతకం చేశారు. వైస్ ప్రెసిడెంట్ గా మాదాల రవి, కార్యదర్శిగా రఘుబాబు, కోశాధికారిగా శివబాలాజీ బాధ్యతలు స్వీకరించారు.

Read More »

ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

రేపు ఇంద్రకీలాద్రికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రానున్న సందర్భంగా.. ఆలయం వద్ద చేస్తున్న ఏర్పాట్లను, భక్తులకు కల్పించిన సౌకర్యాలను అధికారులు సోమవారం పరిశీలించారు. జాయింట్‌ కలెక్టర్‌ (రెవిన్యూ) డాక్టర్‌ కె.మాధవిలత, జాయింట్‌ కలెక్టర్‌ (సంక్షేమం)కె.మోహన్‌ కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ జి.ఎస్‌.ఎస్‌.ప్రవీణ్‌ చంద్‌ లు పరిశీలించారు. క్యూలైన్ల ద్వారా దర్శనాన్ని మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ కె.మాధవిలత ఆదేశించారు. మెట్ల మార్గం నుంచి అంతరాలయం వరకు వున్న ఐదు క్యూలైన్లను నిశితంగా పరిశీలించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేని రీతిలో చర్యలు తీసుకోవాలని ...

Read More »

మా ఎన్నికల్లో విష్ణు ప్యానల్‌దే విజయం

తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్న మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. హౌరాహౌరీగా సాగిన ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందారు. మంచు కుటుంబానికే ‘మా’ పీఠం దక్కింది. విమర్శలు, వివాదాలు నడుమ సాగిన ఎన్నికల్లో మొదటి నుంచి ఆధిక్యంలో ఉన్న ఆయన ప్రకాశ్‌రాజ్‌పై విజయం సాధించారు. జాయింట్‌ సెక్రటరీగా మంచు విష్ణు ప్యానల్‌కు చెందిన గౌతమ్‌ రాజు విజయం సాధించగా, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి శ్రీకాంత్‌ అధిక ఓట్లతో గెలుపొందారు. వైస్‌ ...

Read More »

రేపే ‘మా’ ఎన్నికలు, కౌంటింగ్

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల ఫలితాలు రేపు రాత్రికే ప్రకటించే అవకాశముందని ఎన్నికల సహాయ అధికారి నారాయణరావు వెల్లడించారు. అక్టోబర్‌ 10న జరగబోయే మా ఎన్నికల పోలింగ్‌ కోసం.. జూబ్లిహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల ఏర్పాట్లపై అధికారి నారాయణరావు శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణులకు పోలింగ్‌ ప్రక్రియ గురించి ఆయన వివరించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ ...

Read More »

భారత​ కుబేరుల్లో అగ్రస్థానంలో అంబానీ

 రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ ఫోర్బ్స్‌ ఇండియా జాబితాలో అత్యంత ధనవంతుల్లో వరుసగా 14వ ఏడాది అగ్రస్థానంలో నిలిచారు. గతేడాది కాలంలో ముకేష్‌ సంపాదన 4 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.29వేల కోట్లు) పెరిగింది. మొత్తంగా 92.7 బిలియన్‌ డాలర్ల (రూ.6.95 లక్షల కోట్లు) నికర విలువ కలిగి ఉన్నారు. భారత్‌లో టాప్‌ 100 కుబేరుల జాబితాను గురువారం ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ఈ 100 మంది ధనవంతులైన భారతీయుల మొత్తం సంపద ఏడాది కాలంలో 775 బిలియన్‌ డాలర్లు పెరిగింది. ...

Read More »

రేవతి దర్శకత్వంలో కాజోల్ సినిమా

బాలీవుడ్‌ హీరోయిన్‌ కాజోల్‌ తన కొత్త సినిమా ప్రాజెక్టు వివరాలను అభిమానులకు వెల్లడించింది. నటి, దర్శకురాలు రేవతి దర్శకత్వంలో తన కొత్త సినిమా చేయబోతున్నట్లు ప్రకటించింది. ‘ది లాస్ట్‌ హుర్రే’ టైటిల్‌తో వస్తున్న సినిమా కథ తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగే ఓ తల్లి కథ కావడంతో నటించేందుకు తాను ఒకే చెప్పారు. చిత్రంలో సుజాత క్యారెక్టర్‌ గురించి విన్న వెంటనే తన మైండ్‌లోకి కాజోల్‌ వచ్చిందని, తనే ఈ పాత్రకు న్యాయం చేస్తుందని రేవతి అన్నారు. ఆ ...

Read More »

బద్వేలు ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్ధిగా పాణతాల సురేష్

కడప జిల్లాలోని బద్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థిగా పనతల సురేశ్‌ పేరును పార్టీ ఈరోజు అధికారికంగా ప్రకటించింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పనతల సురేశ్‌ ఇదే జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అకాల మరణంతో బద్వేల్‌ ఉప ఎన్నిక అనివార్యం కాగా, చనిపోయిన ఎమ్మెల్యే భార్యనే వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టింది. దీంతో ఇప్పటికే జనసేన, టీడీపీలు ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నాయి. కానీ, బీజేపీ పోటీ ...

Read More »

విడాకుల తర్వాత అమాంతం పెరిగిన సమంత పాపురాలిటీ

అక్టోబర్‌ 2న సోషల్‌ మీడియా వేదికగా.. నాగచైతన్య – సమంత అధికారికంగా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వారి విడాకుల విషయం టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ దాకా హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే సామ్‌ సోషల్‌మీడియాలో చేస్తున్న పోస్టులను చూస్తే మాత్రం వ్యక్తిగతంగా తాను ఎన్నో ఇబ్బందులని ఎదుర్కొనే… విడాకుల దిశగా ఆలోచనలు చేసిందని పలువురు సినీనటులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమంత బంగారం లాంటి భవిష్యత్తును కాలదన్నుకున్నదనుకొని విడాకులు తీసుకుంటుందని కొందరు.. ఆమె బంగారు పంజరం నుంచి తప్పించుకుని.. స్వేచ్ఛగా బతకాలని ...

Read More »

అమిత్‌షాను కలిసిన యుపి మంత్రి అజయ్ మిశ్రా

యుపి హోంశాఖ సహాయక మంత్రి  అజయ్  మిశ్రా బుధవారం హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. లఖింపూర్‌ ఖేర్‌ జిల్లాలో రైతులను కారుతో తొక్కించిన ఘటనలో రైతులు సహా ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది.  అజయ్  మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాపై హత్య కేసు నమోదైనప్పటికీ ఇప్పటివరకు యుపి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోలేదు. రైతులను తొక్కించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే తన కుమారుడు ఆ ప్రాంతంలో లేడంటూ  అజయ్ మిశ్రా బుకాయిస్తున్నారు.

Read More »