Monthly Archives: November 2021

తెలుగు వ్యక్తికి ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం

ఆస్ట్రేలియాలో తెలుగు వ్యక్తి చెన్నుపాటి జగదీశ్‌కు అత్యంత అరుదైన గౌరవం లభించింది. ప్రపంచంలోని అత్యుత్తమ సైన్స్ అకాడమీల్లో ఒకటైన ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ తదుపరి అధ్యక్షుడిగా ఆయన నియమితులయ్యారు. ఈ పదవికి ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. జగదీశ్  ప్రస్తుతం ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ (ఏఎన్‌యూ)లో భౌతికశాస్త్ర పరిశోధకుడిగా ఉన్నారు. నానో టెక్నాలజీలో నిపుణుడైన ఆయన మే 2022లో ఆస్ట్రేలియా అకాడమీ ఆఫ్ సైన్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు.

Read More »

టాలీవుడ్‌ హీరోలు, సెలబ్రిటీలకు రూ.200 కోట్లకు టోకరా.. వ్యాపారవేత్త శిల్ప అరెస్ట్‌..

అధిక వడ్డి ఇప్పిస్తానంటూ వందల కోట్ల రూపాయలు మోసం చేసిన వ్యాపారవేత్త శిల్పా చౌదరి వ్యవహరం బట్టబయలైంది. సినీ సెలబెట్రీలతో పాటు నగరానికి చెందిన ప్రముఖునలు శిల్పా రూ. 100 నుంచి రూ. 200 కోట్లు మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన నార్సింగ్‌ పోలీసులు శిల్ప, ఆమె భర్తను శనివారం ఉదయం అరెస్టు చేశారు. శిల్ప బాధితుల్లో టాలీవుడ్‌కు చెందిన ముగ్గురు హీరోలు ఉండటం గమనార్హం. పేజ్‌ 3 పార్టీలతో సెలబ్రెటీలను ఆకర్షిస్తూ శిల్పా మోసపూరితంగా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. దీంతో తాము ...

Read More »

శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా జకియాఖానమ్‌

 శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ పదవి తొలిసారి మైనారిటీ మహిళకు దక్కింది. కడప జిల్లా రాయచోటికి చెందిన వైసిపి ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌ డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమెను స్వయంగా కూర్చీ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జకియా మాట్లాడుతూ మహిళల సంక్షేమ కోసం అనే పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్‌ మహిళా పక్షపాతి అని నిరూపించుకున్నారని ఆమె కొనియాడారు. దేశానికే మన రాష్ట్రం ...

Read More »

ఇంటర్నేషనల్‌ మూవీలో సామ్‌

సమంత అభిమానులకు గుడ్ న్యూస్… సామ్ ఓ ఇంటర్నేషనల్ మూవీకి సైన్ చేసింది. అన్ని అడ్డంకులు, సరిహద్దులను చెరిపేసేందుకు మరో ప్లాన్ వేసింది. సౌత్ లో పాపులర్ అయిన సామ్ అందరికీ షాకిస్తూ బాలీవుడ్ బడా హీరోయిన్లకు సైతం దొరకని అవకాశాన్ని పట్టేసింది. తాజాగా సమంతా తన తొలి అంతర్జాతీయ ప్రాజెక్ట్‌పై సంతకం చేసింది. ఆ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గతంలో ‘డోంటన్ అబ్బే’ చిత్రానికి దర్శకత్వం ...

Read More »

అసెంబ్లీ సమావేశాలు మరో రెండు రోజులు పొడిగింపు

 ఆరో రోజు ఎపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలను మరో రెండు రోజులు ఈనెల 30 వరకు పొడిగించారు. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారీటీ సంక్షేమంపై చర్చ జరగనుంది. ఆరోగ్యం, విద్య, రోడ్లపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. మరో మూడు బిల్లులను, ప్రభ్వుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో ఆమోదించిన 9 బిల్లులను మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

Read More »

జగన్ కు చిరంజీవి విజ్ఞప్తి

సినిమా టికెట్ల అంశంలో పునరాలోచించాలని మెగాస్టార్‌ చిరంజీవి ఎపి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్‌లైన్‌ టిక్కెటింగ్‌ బిల్‌ ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయమని అన్నారు. అయితే అదే సమయంలో థియేటర్ల మనుగడ, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువు కోసం టికెట్‌ ధరలను కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుందని అన్నారు. దేశమంతా జిఎస్‌టి పేరుతో ఒకే పన్నును విధిస్తున్నపుడు .. టికెట్‌ ధరలలో కూడా ...

Read More »

ఐదో రోజు అసెంబ్లీ స‌మావేశాలు

 అమరావతి: ఐదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు మరో 9 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాసనసభ ముందుకు ఏపీఎస్‌ఆర్టీసీ, కార్మికశాఖ వార్షిక ఆడిట్‌ రిపోర్టు తీసుకురానుంది. బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ సంక్షేమం, వైద్యంపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది. శాసనసభలో ఆమోదించిన 11 బిల్లులను నేడు మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. విద్యుత్‌ సంస్కరణలు, రాష్ట్రంలో రోడ్లు, రవాణా సౌకర్యాలపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది.

Read More »

F3లో వెంకీకి రేచీకటి.. వరుణ్‌కి నత్తి

టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ తర్వాత వరుసగా హిట్‌ కొట్టే డైరెక్టర్‌ ఎవరంటే అనిల్‌ రావిపూడిని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అనీల్‌.. ఎఫ్‌ 2 సీక్వెల్‌గా.. ఎఫ్‌ 3 మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకీకి రేచీకటి, వరుణ్‌తేజ్‌కి నత్తి ఉంటాయని ఆయనే స్వయంగా తెలిపారు. డబ్బుచుట్టూ తిరిగే కథతో.. హీరోలకున్న బలహీనతలతో తెరపై నవ్వులు పూయిస్తారని.. అందరికీ కచ్చితంగా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి అనీల్‌ రావిపూడి అనుకున్నట్లుగా.. ఎఫ్‌ 3లో వెంకీ రేచీకటి, వరుణ్‌ నత్తి ఏ రేంజ్‌లో ...

Read More »

ఏపీ అసెంబ్లీలో కులగణన తీర్మానం

కులగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఈ తీర్మానాన్ని రాష్ట్ర మంత్రి వేణుగోపాల్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌ మాట్లాడుతూ 1931 తరువాత కులపరమైన జనాభా గణన జరగలేదని తెలిపారు. దేశంలో వెనకబాటుతనం తెలుసుకోవాలంటే లెక్కలు అవసరమని సీఎం స్పష్టం చేశారు. కులగనణపై కేంద్రానికి అనేక ప్రతిపాదనలు పంపామని గుర్తుచేశారు. కులగణన డిమాండ్‌కు తాము మద్దతు తెలుపుతున్నామని ఆయన చెప్పారు. దేశంలో బీసీల జనాభా 52 శాతంగా ఉన్నారని పేర్కొన్నారు. బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ ...

Read More »

రేపు కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక

 కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్లకు సంబంధించిన ఎన్నికలను రేపు(బుధవారం) నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. టిడిపి దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. విచారణ సందర్బంగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ హైకోర్టుకు రావాలని ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు అధికారులు విచారణకు హాజరయ్యారు. కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ , రిటర్నింగ్‌ అధికారి, విజయవాడ ఇన్ఛార్జి సిపి కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. వివరణ అనంతరం రేపు ...

Read More »