Monthly Archives: November 2021

జగన్ కు చిరంజీవి విజ్ఞప్తి

సినిమా టికెట్ల అంశంలో పునరాలోచించాలని మెగాస్టార్‌ చిరంజీవి ఎపి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్‌లైన్‌ టిక్కెటింగ్‌ బిల్‌ ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయమని అన్నారు. అయితే అదే సమయంలో థియేటర్ల మనుగడ, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువు కోసం టికెట్‌ ధరలను కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుందని అన్నారు. దేశమంతా జిఎస్‌టి పేరుతో ఒకే పన్నును విధిస్తున్నపుడు .. టికెట్‌ ధరలలో కూడా ...

Read More »

ఐదో రోజు అసెంబ్లీ స‌మావేశాలు

 అమరావతి: ఐదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు మరో 9 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాసనసభ ముందుకు ఏపీఎస్‌ఆర్టీసీ, కార్మికశాఖ వార్షిక ఆడిట్‌ రిపోర్టు తీసుకురానుంది. బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ సంక్షేమం, వైద్యంపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది. శాసనసభలో ఆమోదించిన 11 బిల్లులను నేడు మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. విద్యుత్‌ సంస్కరణలు, రాష్ట్రంలో రోడ్లు, రవాణా సౌకర్యాలపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది.

Read More »

F3లో వెంకీకి రేచీకటి.. వరుణ్‌కి నత్తి

టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ తర్వాత వరుసగా హిట్‌ కొట్టే డైరెక్టర్‌ ఎవరంటే అనిల్‌ రావిపూడిని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అనీల్‌.. ఎఫ్‌ 2 సీక్వెల్‌గా.. ఎఫ్‌ 3 మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకీకి రేచీకటి, వరుణ్‌తేజ్‌కి నత్తి ఉంటాయని ఆయనే స్వయంగా తెలిపారు. డబ్బుచుట్టూ తిరిగే కథతో.. హీరోలకున్న బలహీనతలతో తెరపై నవ్వులు పూయిస్తారని.. అందరికీ కచ్చితంగా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి అనీల్‌ రావిపూడి అనుకున్నట్లుగా.. ఎఫ్‌ 3లో వెంకీ రేచీకటి, వరుణ్‌ నత్తి ఏ రేంజ్‌లో ...

Read More »

ఏపీ అసెంబ్లీలో కులగణన తీర్మానం

కులగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఈ తీర్మానాన్ని రాష్ట్ర మంత్రి వేణుగోపాల్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌ మాట్లాడుతూ 1931 తరువాత కులపరమైన జనాభా గణన జరగలేదని తెలిపారు. దేశంలో వెనకబాటుతనం తెలుసుకోవాలంటే లెక్కలు అవసరమని సీఎం స్పష్టం చేశారు. కులగనణపై కేంద్రానికి అనేక ప్రతిపాదనలు పంపామని గుర్తుచేశారు. కులగణన డిమాండ్‌కు తాము మద్దతు తెలుపుతున్నామని ఆయన చెప్పారు. దేశంలో బీసీల జనాభా 52 శాతంగా ఉన్నారని పేర్కొన్నారు. బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ ...

Read More »

రేపు కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక

 కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్లకు సంబంధించిన ఎన్నికలను రేపు(బుధవారం) నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. టిడిపి దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. విచారణ సందర్బంగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ హైకోర్టుకు రావాలని ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు అధికారులు విచారణకు హాజరయ్యారు. కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ , రిటర్నింగ్‌ అధికారి, విజయవాడ ఇన్ఛార్జి సిపి కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. వివరణ అనంతరం రేపు ...

Read More »

సమంత మాదిరిగానే ప్రియాంకచోప్రా

: టాలీవుడ్‌ ప్రేమ జంట సమంత – నాగచైతన్యలు విడిపోతున్నట్లు ప్రకటించే ముందు సమంత తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో అక్కినేని పేరు మార్చింది. అలా సమంత ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పేరు మార్చిన తర్వాత.. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు విడిపోనున్నారనే వార్తలన్నీ పుకార్లని మొదట భావించినా.. తర్వాత తాము విడాకులు తీసుకోనున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు. అచ్చం సమంత- నాగచైతన్యలా తాజాగా మరో జంట కూడా సెన్సేషన్‌గా మారింది. ఆ జంట మరెవరో కాదు.. గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంకచోప్రా, పాప్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌. ప్రాంతాలు, భాషలు, ...

Read More »

మూడు రాజధానుల బిల్లు వెనక్కు : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్వొకేట్ జనరల్‌ స్వయంగా హైకోర్టుకు తెలిపారు. ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశంలోనూ మూడు రాజధానులపైనే చర్చ జరిగింది. అయితే, మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కు తగ్గిందా లేదా తన వ్యూహం మార్చిందా అన్నదే అంతుపట్టడం లేదు. మూడు రాజధానులపై టెక్నికల్‌గా సమస్యల్ని పరిష్కరించి మళ్లీ బిల్లులు పెడతారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగు చట్టాల్ని రద్దు చేస్తూ మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ...

Read More »

ఘనంగా హీరో కార్తీకేయ పెళ్లి

ఆర్‌ఎక్స్ 100 ఫేం హీరో కార్తీకేయ ఓ ఇంటివాడయ్యాడు. హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం 9:47 నిమిషాలకు హీరో కార్తీకేయ వివాహం ఘనంగా జరిగింది. కాలేజీ చదివే రోజుల్లో తాను ప్రేమించిన యువతి లోహితను పెద్దల సమక్షంలో కార్తీకేయ పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, నిర్మాత అల్లు అరవింద్  హాజరయ్యారు.  కాగా వరుడు కార్తికేయ క్రీమ్, బంగారు షేర్వాణీతో జతగా క్రీమ్ లోఫర్‌లు, మ్యాచింగ్ పగడి, బ్రూచ్, నెక్లెస్ ధరించి కన్పించాడు. పెళ్లికూతురు కూడా బంగారు రంగు దుస్తుల్లో, ...

Read More »

తుఫాన్‌ బాధితులను ఆదుకుంటాం : జగన్మోహన్‌ రెడ్డి

జవాద్‌ తుపాన్‌ వల్ల ధన, ప్రాణ నష్టం కలిగిన బాధితులకు వెంటనే నష్ట పరిహారమివ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. తుపాన్‌ కారణంగా రాజంపేట నియోజవర్గంలోని అన్నమయ్య ప్రాజెక్ట్‌,పించ ప్రాజెక్ట్‌కు జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధితులకు తగిన నష్ట పరిహారం ఇవ్వాలని రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంటకట మల్లికార్జునరెడ్డి సిఎం జగన్మోహన్‌రెడ్డికి వివరించారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి తక్షణమే నష్ట పరిహారంతో పాటు,పించ ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టు కు సంభందించిన నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ ...

Read More »

అసెంబ్లీలో ‘వారి’ ప్రస్తావనే తేలేదు.. : పేర్ని నాని

అసెంబ్లీలో ఎవరూ చంద్రబాబు కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి ప్రస్తావనే తేలేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. అసెంబ్లీలో వ్యవసాయం మీద చర్చ జరుగుతుంటే దానిపై మాట్లాడకుండా అనవసర మాటలతో రాద్దాంతం చేసింది చంద్రబాబేనని అంటూ నాని అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు సతీమణిని ఎవరైనా ఏమైనా అని ఉంటే ఆ ఫోన్‌ రికార్డును బయట పెట్టాలని పేర్ని నాని డిమాండ్‌ చేశారు. శాసనసభలో చంద్రబాబు తన అనుభవాన్ని రంగరించి మెలో డ్రామా సఅష్టించారన్నారు. రాజకీయాలను రాజకీయాలతోనే ఎదుర్కోవాలని సూచించారు. కుటుంబ మర్యాదను ...

Read More »