Monthly Archives: November 2021

నటుడు కైకాల సత్యనారాయణకు తీవ్ర అస్వస్థత… వెంటిలేటర్ పై చికిత్స

నట దిగ్గజం కైకాల సత్యనారాయణ మరోసారి ఆసుపత్రి పాలయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాదు అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.ఇటీవల తన ఇంట్లో జారిపడిన కైకాల సత్యనారాయణ కొన్నిరోజుల పాటు సికింద్రాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందారు. డిశ్చార్జి అయిన తర్వాత ఆయన తాజాగా తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. కాగా, సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై సినీ ప్రముఖులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు. సత్యనారాయణ ...

Read More »

నీకు జీవితకాల శిక్ష విధించుకున్నావు’ : ఎమ్మెల్యే రోజా

చంద్రబాబు విధి ఎవరినీ వదిలిపెట్టదు.. అందరి సరదా తీర్చేస్తుందని నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు డ్రామాపై ఆర్కే రోజా మాట్లాడుతూ.. 72 ఏళ్ల వయసులో ఎన్టీఆర్‌ను ఎంత ఏడ్పించావో గుర్తుందా బాబు?. 71 ఏళ్ల 7 నెలలకే నీకు ఏడ్చే పరిస్థితి వచ్చింది. అందుకే అంటారు మనం ఏం చేస్తే అది మనకు తిరిగొస్తుందని. మీ కుటుంబ సభ్యుల్ని అన్నారని తెగ బాధపడిపోతున్నావే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌ అసెంబ్లీలో నామీద పీతల సుజాతతో సీడీలు చూపించిన విషయం మర్చిపోయావా?. అంటే మాకు కుటుంబాలు కానీ, మర్యాదలు ...

Read More »

బాబు నిన్న చర్చించాడు.. నేడు అమలు చేశాడు: కొడాలి నాని

అసెంబ్లీ నుంచి చంద్రబాబు బాయికాట్‌  హైడ్రామాపై మంత్రి కొడాలి నాని స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘ఇదంతా ముందస్తుగా రచించుకున్న వ్యూహంలో భాగమే. ఇకపై అసెంబ్లీకి వెళ్లకుండా ఏం చేయాలనేది గురువారం సాయంత్రమే పార్టీ నేతలతో చర్చించుకొని దానిని యథాప్రకారంగా నేడు అమలు చేశారు. ఈ విషయంపై మాకు ముందస్తు సమాచారం ఉంది.  మంత్రి బొత్స సత్యనారాయణతో కూడా ఇప్పటిదాకా అదే విషయంపై మాట్లాడుతున్నా. చంద్రబాబు అసెంబ్లీ నుంచి వెళ్లిపోతున్నారు అని బొత్స సత్యనారాయణ నాతో చెప్తున్నారు. అంతలోనే చంద్రబాబు తన ప్లాన్‌ను పక్కాగా ...

Read More »

నా మనసు కలచివేస్తోంది : చిరు

అల్పపీడన ప్రభావం వల్ల.. తిరుపతి తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు వరదలతో.. అక్కడి స్థానికులు ఇబ్బందులు పడటం చూసి మెగాస్టార్‌ చిరంజీవి చలించిపోయారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ట్వీట్‌ చేశారు. ‘గతంలో ఎన్నడూ లేనంత వర్షాలు తిరుపతి, తిరుమలలో కురవడంతో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూస్తుంటే నా మనసు కలిచివేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, టిటిడిలు సమిష్టి కృషి చేసి వరద ముప్పు నుంచి వారిని కాపాడాలి. సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పాలి. దీనికి అన్ని రాజకీయ పక్షాలు, అభిమాన ...

Read More »

అమ్మ జన్మనిస్తే.. జగనన్న జీవితాన్నిచ్చారు: రోజా

మహిళలకు ప్రతి దశలోను ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రోజా అన్నారు. అసెంబ్లీ సమావేశంలో భాగంగా..  మహిళా సాధికారతపై ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. జగనన్న ప్రభుత్వం.. మహిళా పక్షపాతి ప్రభుత్వమని తెలిపారు. మహిళల కోసం ​ఇన్ని పథకాలు తెచ్చిన ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌ అని పేర్కొన్నారు. అదేవిధంగా.. మహిళల ఖాతాల్లోకి నగదు చేరేలా పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. 

Read More »

ఎవర్‌గ్రీన్‌ రిలీజ్‌గా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’

రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌) చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 10 వేలకి పైగా స్క్రీన్స్‌లో ప్రదర్శించనున్నారు మేకర్స్‌. యూఎస్‌ లో కూడా 2,500కి పైగా స్క్రీన్‌లలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే భారతీయ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్‌ ఎవర్‌ రిలీజ్‌గా ఈ మూవీ నిలుస్తుంది.డివివి దానయ్య భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్న ఈ పీరియాడిక్‌ డ్రామా చిత్రంలో రామ్‌ చరణ్‌ అల్లూరి ...

Read More »

ఈ నెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన 10 మంది మాజీ సభ్యులకు శాసనసభలో నివాళులర్పించారు. బద్వేలు ఎమ్మెల్యే సుధా ప్రమాణస్వీకారంతో అసెంబ్లీ మొదలైంది. ఈ ఒక్క రోజే సమావేశం నిర్వహించాలని భావించగా.. టిడిపి పొడిగించాలని కోరిన పిదప.. బిఎసి సమావేశంలో ఈ నెల 26 వరకు  సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో  ఈ నెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి.  అసెంబ్లీ ఆరు నెలల కాలంలో ఒకసారి నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నెల 20వ తేదీతో ఆరు నెలలు పూర్తికావస్తున్నందున.. గురువారం నుండి ...

Read More »

ప్రారంభమైన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ముందుగా అనుకున్నట్టు ఒకరోజు కాకుండా 9 రోజులపాటు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26 వ తేదీవరకూ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇవాళ ప్రారంభమైన తొలిరోజు సమావేశంలో ఇటీవల మృతి చెందిన ప్రజా ప్రతినిధులకు సంతాపం ప్రకటించారు. బద్వేలు ఉపఎన్నికలో విజయం సాధించిన ఎమ్మెల్యే డాక్టర్ సుధతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రమాణ స్వీకారం చేయించారు.

Read More »

కుప్పంలో బాబు ను మట్టికరిపించిన పెద్దిరెడ్డి

చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి..చంద్రబాబుకు ఓ సలహా ఇచ్చారు. చంద్ర‌బాబు పొలిటిక‌ల్ రిటైర్మెంట్ తీసుకుని, విశ్రాంతి తీసుకుంటే ఆయ‌న‌కే మంచిద‌ని పెద్దిరెడ్డి స‌ల‌హా ఇచ్చారు. ఎలాగూ చంద్ర‌బాబు నాయుడు హైద‌రాబాద్ లోనే ఉంటున్నార‌ని.. ఆయ‌న టీడీపీ బాధ్య‌త‌ల‌ను ఎన్టీఆర్ కుటుంబానికి అప్ప‌గించి త‌ప్పుకుంటే మంచిద‌ని అన్నారు. కుప్పం ప్ర‌జ‌లు చంద్ర‌బాబు నాయుడును పూర్తిగా తిర‌స్క‌రించార‌ని పెద్దిరెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు.

Read More »

ఏపీ మున్సిపల్ ఫలితాల్లో ఫ్యాన్ హవా

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ కారణాలతో నిలిచిపోయిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. నెల్లూరు కార్పొరేషన్‌ సహా 13 మున్సిపాలిటీల కౌంటింగ్‌ నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. ఇందులో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 9 మున్సిపాలిటీలను అధికార పార్టీ వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అధినేత ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీతో సహా ఆకివీడు, పెనుకొండ, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, గురజాల, బుచ్చిరెడ్డిపాలెం, దాచేపల్లిలో వైసీపీ విజయ ఢంకా మోగించింది. ప్రకాశం జిల్లా దర్శిలో మాత్రం టీడీపీ గెలుపొందింది. ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం జరిగిన మున్సిపల్ ఎన్నికలకు ఓట్ల ...

Read More »