Monthly Archives: November 2021

టైసన్‌ను కలిసిన ‘లైగర్‌’

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’. సాలా క్రాస్ బ్రీడ్ ట్యాగ్ లైన్ తో బాక్సింగ్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను బాలీవుడ్ లో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో రమ్యకృష్ణ నటిస్తుండగా.. ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా హైప్ రావడానికి ఇందులో ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ను ...

Read More »

తుఫాన్ వల్ల నష్టపోయిన రైతుల ఖాతాలోకి నష్ట పరిహారం

తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సహకారం అందించనుంది ఏపీ ప్రభుత్వం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన గులాబ్‌ సైక్లోన్‌ చాలా భీభస్తమ్ సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ సైక్లోన్‌ వల్ల 34,586 మంది రైతులు పంట నష్టపోయారు. అయితే ఆ రైతుల ఖాతాల్లోకి 22 కోట్ల రూపాయల పంట నష్ట పరిహారం అందించనుంది జగన్ సర్కార్. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. ఈ క్రాప్‌ ఆధారంగా నమోదైన రైతులకు పంట నష్టపరిహారం పంపిణీ ...

Read More »

వెంకటేష్ ‘దృశ్యం 2’ ట్రైలర్

‘విక్టరీ’ వెంకటేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ”దృశ్యం 2”. ఇది మలయాళంలో మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం 2’ చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్. సూపర్ హిట్ ‘దృశ్యం’ సినిమాకు సీక్వెల్. మలయాళ డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ థ్రిల్లర్ చిత్రానికి దర్శకత్వం వహించారు. మాతృక బాటలో థియేట్రికల్ స్కిప్ చేసి ఓటీటీలో విడుదల అవుతోంది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 25 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

Read More »

రాజధాని కేసులపై విచారణ… హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు

అమరావతి రాజధాని కేసులపై హైకోర్టులో విచారణ ప్రారంభం అయింది. రాజధాని కేసుల నుంచి న్యాయమూర్తులు సత్యనారాయణ మూర్తి, సోమయాజులను తప్పించాలని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే పిటిషన్ వేశారు. రాజధానిలో ఆ ఇద్దరు న్యాయమూర్తులకు భూములున్నాయని.. వారిని ధర్మాసనం తప్పించాలని కోరారు దుష్యంత్ దవే. గతంలో ఇవే పిటిషన్లపై విచారణ చేపడుతోన్నప్పుడు ఎందుకు అభ్యంతరం తెలపలేదని హైకోర్టు ప్రశ్నించింది.

Read More »

ఎస్పీ చరణ్‌ సారథ్యంలో పాడుతా తీయగా

తెలుగు సినీ సంగీత ప్రియుల అభిమానాన్ని పొందిన పాడుతా తీయగా 19వ సీజన్ త్వరలో ప్రారంభం కానుందని ఈటీవీ పేర్కొంది. 25 ఏళ్లక్రితం ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఎందరో యువ గాయకులను సమాజానికి పరిచయం చేసిందని తెలిపారు. 18 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకొని, త్వరలో ప్రారంభంకానున్న 19వ సీజన్ పాడుతా తీయగా కోసం ఈటీవీ భారీ కసరత్తు చేస్తున్నట్లు పేర్కొంది. కరోనా దృష్ట్యా ఆన్‌లైన్‌ ఆడిషన్స్ నిర్వహించింది. 4 వేలమంది గాయనీగాయకుల స్వరాలను నిర్ణేతల పరీక్షించి వారిలో ...

Read More »

కేరళలో ‘నోరో’ వైరస్‌ కలవరం

ఇప్పటికే కరోనా వైరస్ వెన్నులో వణుకు పుట్టిస్తుంటే తాజాగా కేరళలో మరో వైరస్‌ కేసు నమోదు కావడం ఆ రాష్ట్రాన్ని కలవరం పెడుతోంది. తాజాగా వాయనాడ్‌ జిల్లాలో నోరో వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ తెలిపారు. వివరాల ప్రకారం.. వాయనాడ్ జిల్లాలోని వైత్తిరి సమీపంలోని పూకోడ్‌లోని వెటర్నరీ కళాశాలలో 13 మంది విద్యార్థులకు అరుదైన నోరోవైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. జంతువుల ద్వారా సంక్రమించే నోరో వైరస్, కలుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తుందని చెప్పారు. వ్యాధి నియంత్రణకు ...

Read More »

రాజీవ్‌ కోటి సినిమా నుంచి ఫస్ట్‌ లుక్‌

కోటి తనయుడు రాజీవ్‌ సాలూరి హీరోగా, వర్ష విశ్వనాథ్‌ హీరోయిన్‌గా.. కిట్టు నల్లూరి దర్శకత్వంలో గాజుల వీరేష్‌ (బళ్లారి) నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెంబర్‌ 1 చిత్రం ’11:11′ ప్రారంభమైంది. ఈ చిత్ర టైటిల్‌ ఫస్ట్‌ లుక్‌ను గురువారం చిరంజీవి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ కార్యక్రమానికి రావడానికి ప్రధాన కారణం కోటిగారు. నా సినిమా అనేసరికి ప్రత్యేకించి ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని సంగీతం అందించారు. నా విజయానికి, నా ఎదుగుదలకి సింహభాగం రాజ్‌ – కోటిలదే అని చెప్పాలి. ఇద్దరూ నా ...

Read More »

18 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల 18వ తేదీ ఉదయం పది గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నరు నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ భేటీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు గాను 16వ తేదీన ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. శాసనమండలి చైర్మన్‌, శాసనసభ స్పీకరు నేతృత్వంలో జరిగే ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పలు శాఖల స్పెషల్‌ సిఎస్‌లు, కార్యదర్శులు హాజరు కావాలని కోరుతూ శాసనసభ సచివాలయ కార్యదర్శి లేఖ రాశారు. ఇదే సమయంలో 17వ తేదీన మంత్రివర్గం కూడా ...

Read More »

‘భోళా శంకర్’ షూటింగ్ షురూ

టాలీవుడ్ హీరో చిరంజీవి న‌టిస్తోన్న తాజా చిత్రాల్లో ఒక‌టి భోళా శంక‌ర్ . వేదాళ‌మ్ రీమేక్‌గా వ‌స్తున్న ఈ మూవీని మెహ‌ర్ ర‌మేశ్ డైరెక్ట్ చేస్తున్నాడు. కోలీవుడ్ భామ కీర్తిసురేశ్ ఈ చిత్రంలో చిరంజీవి సోద‌రిగా క‌నిపించ‌నుంది. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. భోళాశంక‌ర్ టీం నుంచి ఆస‌క్తిక‌ర వార్త తెర‌పైకి వ‌చ్చింది. న‌వంబ‌ర్ 6న సినిమాను లాంఛ్ చేసేందుకు గ్రాండ్‌గా ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయి. న‌వంబ‌ర్ 15 నుంచి భోళా శంక‌ర్ షూటింగ్ షురూ కానుంది. తొలి షెడ్యూల్‌లో చిరంజీవి, కీర్తిసురేశ్‌పై వ‌చ్చే ...

Read More »

నామినేషన్ల తిరస్కరణపై ఎపి హైకోర్టు ఆగ్రహం

ప్రభుత్వ ఉద్యోగులన్న విషయాన్ని రిటర్నింగ్‌ అధికారులు (ఆర్‌ఒ) మరిచిపోయారంటూ ఎపి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. తగిన కారణాలు లేకుండా మున్సిపల్‌ ఎన్నికల్లో పలువురి నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారులు తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఏడో డివిజన్‌లో టిడిపి తరఫున బరిలో దిగిన జి.మహేంద్రబాబు నామినేషన్‌ను ఆర్‌ఒ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే కడప జిల్లా రాజంపేట మున్సిపాలిటీలో 17వ వార్డుకు బరిలో ఉన్న షేక్‌ జాఫర్‌ అలీ తన నామినేషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు ...

Read More »