Monthly Archives: November 2021

డిసెంబరులో సూర్య యాక్షన్‌ థ్రిల్లర్‌

పాండిరాజ్‌ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ‘ఎదర్కుమ్‌ తునిందవన్‌’ సినిమా షూటింగ్‌ పూర్తి అయినట్టు మేకర్స్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై ఈ సినిమాను కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తుండగా.. సత్యరాజ్‌ మరో ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. డి.ఇమాన్‌ సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాను డిసెంబర్‌ 23న విడుదల చేయబోతున్నారు. సూర్య.. ఇటీవల ‘జైభీమ్‌’ చిత్రంతో ఓటీటీలో సాలిడ్‌ హిట్‌ సొంతం చేసుకున్నారు. భాషతో సంబంధం లేకుండా.. ప్రతి ...

Read More »

ఒక్కరోజులో 13 శాతం పెరిగిన కేసులు.. భారీగా పెరిగిన మరణాలు

దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 11,466 కొత్త కేసులు నమోదయ్యాయి. కేసుల్లో ఒక్కరోజులో 13 శాతం మేర  పెరుగుదల కనిపించింది. మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 24 గంటల్లో 460 మంది కరోనాతో మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 4,61,849కిచేరింది. మరోవైపు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.43 కోట్లకు చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,39,683కి చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య ఇంత తక్కువగా నమోదవడం 264 రోజుల ...

Read More »

‘ఎస్పీ’ పద్మవిభూషణ్‌ అవార్డును స్వీకరించిన తనయుడు

 సినిమా రంగంలో విశేష సేవలందించిన వారికి పద్మ అవార్డులు మంగళవారం కూడా రాజ్‌ భవన్‌ లో ప్రదానం చేశారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మరణానంతరం పద్మవిభూషణ్‌ అవార్డు వరించిన విషయం విదితమే. ఎస్పీ తరుపున ఆయన కుమారుడు చరణ్‌ మంగళవారం ఈ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించారు. వీరితో పాటు గాయని చిత్ర కూడా పద్మభూషణ్‌ అందుకున్నారు. ఏక్తా కపూర్‌, కరణ్‌ జోహార్‌, అద్నాన్‌ సమీ, కంగనా రనౌత్‌ సోమవారమే పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు.

Read More »

ప్రపంచ దేశాల్లో మరోసారి విజృంభిస్తోన్న కరోనా

 పలు దేశాల్లో కరోనా మరోసారి విజృంభిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. రష్యాలో సోమవారం 39,400 పాజిటివ్‌ కేసులు, 1,190 మరణాలు నమోదయ్యాయి. వైరస్‌ కొనసాగుతున్నప్పటికీ.. తొమ్మిది రోజుల లాక్‌డౌన్‌ అనంతరం ఉద్యోగులు సోమవారం యథావిధిగా విధులకు హాజరయ్యారు. అక్టోబరు చివరివారం నుండి రష్యాలో ప్రతి రోజూ 1,100 మంది కరోనాతో మరణిస్తున్నారు. జర్మనీలోనూ గతంలో ఎప్పుడూ లేనంతగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వారంరోజులుగా ప్రతి లక్షమందిలో 201 మంది వైరస్‌ బారిన పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,513 ...

Read More »

‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’గా నిహారిక వెబ్‌ సిరీస్‌

ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్‌కి సంబంధించిన ట్రైలర్‌ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా విడుదలైంది. నిహారిక కొనిదెల నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ని మహేష్ ఉప్పాల డైరెక్ట్ చేస్తున్నాడు. సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ జంటగా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో సీనియర్ హీరో నరేష్, సీనియర్ నటి తులసి, గెటప్ శ్రీను తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.  ఒక గమ్యం, లక్ష్యం లేకుండా లేజీగా బతికేస్తున్న ఓ యువకుడిపై అనుకోకుండా మొత్తం కుటుంబభారంతో పాటు తండ్రి చేసిన అప్పు ...

Read More »

నవంబర్‌ 29 నుండి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు

నవంబర్ చివరి వారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు శీతాకాల సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సారి సమావేశాల్లో పలు బిల్లులను ఆమోదించనున్నారు. ఆర్థిక రంగానికి చెందిన రెండు కీలకమైన బిల్లులను ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారు. పెన్ష‌న్ ఫండ్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (PFRDA) చ‌ట్టం-2013 స‌వ‌ర‌ణ బిల్లు, దీంతో పాటు బ్యాంకింగ్ రెగ్యులేష‌న్ చ‌ట్టం-1949 స‌వ‌ర‌ణ బిల్లు ను ఈ సమావేశాల్లో ఆమోదింపజేసుకోనున్నారు. అటు ...

Read More »

పెళ్లి పీటలెక్కనున్న కత్రినాకైఫ్‌

బాలీవుడ్‌ ప్రేమికులు కత్రినాకైఫ్‌, నటుడు విక్కీకౌశల్‌ త్వరలో పెళ్లి పీటలెకక్కనున్నారు. వీరి పెళ్లి డిసెంబర్‌ 7,8,9 తేదీల్లో జరగనున్నట్లు తెలుస్తోంది. వీరి వివాహానికి రాజస్థాన్‌లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ వేడుక కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీపావళి పండుగరోజున వీరి పెళ్లి తంతు కంటే ముందు జరిగే రోకా వేడుక జరిగిందని ఆంగ్ల పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రోకా వేడుక కత్రినాకు ఆప్తుడైన దర్శకుడు కబీర్‌ఖాన్‌ నివాసంలో జరిగిందట. ఈ వేడుకలో కత్రినా తల్లి సుజానే టర్కోయెట్‌, సోదరి ఇసాబెల్‌ పాల్గొన్నారు. అలాగే ...

Read More »

దేశంలో 10 వేలకు తగ్గిన కరోనా కేసులు

దేశంలో తాజాగా కరోనా కేసులు 10 వేలకు తగ్గాయి. రికవరీ రేటు కూడా 98.23 శాతానికి చేరింది. క్రియాశీల కేసులు కూడా గణనీయంగా తగ్గాయి. శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం… దేశంలో కోవిడ్‌ కేసులు ముందురోజు కంటే 14 శాతం మేర తగ్గి..10 వేలకు పడిపోయాయి. శుక్రవారం 8 లక్షలకు పైగా కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా, 10,929 కొత్త కేసులు వెలుగుచూశాయి. 392 మరణాలు నమోదయ్యాయి. తగ్గిన రికవరీ రేటు.. క్రియాశీల రేటు..దేశవ్యాప్తంగా కోవిడ్‌ రికవరీ రేటు, క్రియాశీల ...

Read More »

ఫిబ్రవరిలో శర్వానంద్‌ ‘ఒకే ఒక జీవితం’

యంగ్ హీరో శర్వానంద్ కెరీర్‌‏లో 30వ సినిమాగా రూపొందుతోన్న మైల్ స్టోన్ మూవీ ఒకే ఒక జీవితం. ఈ చిత్రంతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ డ్రామా, సైఫై సినిమాకు తరుణ్ భాస్కర్‌ మాటలను అందించారు.దీపావళి సందర్బంగా ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. ఇక ఈ సందర్భంగా విడుదల ...

Read More »

హీరో రాజశేఖర్ ఇంట తీవ్ర విషాదం

సినీ నటుడు రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్(93) అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూసారు. శుక్రవారం ఉదయం వరదరాజన్ భౌతికకాయాన్ని చెన్నైకు తరలిస్తారని సమాచారం. వరదరాజన్‌ గోపాల్‌ చెన్పై డీసీపీగా రిటైర్‌ అయ్యారు. ఆయనకు అయిదగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలరు. హీరో రాజశేఖర్‌ వరదరాజన్‌ గోపాల్‌కు రెండో సంతానం.

Read More »