Monthly Archives: November 2021

నిరసనలపై ఉక్కుపాదం.. సిపిఎం నేతల అరెస్టులు

చెరకు బకాయి బిల్లులను చెల్లించాలని, ఎన్‌సిఎస్‌ కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తూ… రైతు సంఘాలు నేడు బంద్‌, నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో… విజయనగరంలోని సిపిఎం, రైతు, చెరకు రైతు సంఘం నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. మరికొందరిని గృహనిర్బంధం చేశారు.లచ్చయ్యపేట షుగర్‌ ఫ్యాక్టరీ రైతులకు బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ… విజయనగరం ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద శుక్రవారం రాస్తారోకో చేశారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ… అక్రమంగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలంటూ నినదించారు. ప్రభుత్వం బాధ్యత వహించి ...

Read More »

”ప్రపంచ నేతల్లారా పనికిరాని వాగ్దానాలు ఆపండి..” గర్జించిన 14 ఏళ్ల బాలిక వినీషా

” కేవలం పనికిరాని వాగ్దానాలతో సరిపుచ్చే ప్రపంచ నేతలను చూస్తుంటే మా యువతరానికి కోపం, ఆవేశం వస్తోంది”. గ్లాస్గోలో జరుగుతున్న కాప్‌ 26 సదస్సులో భారత్‌కి చెందిన 14 ఏళ్ల  వినీషా ఉమాశంకర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. మాటలతో కాలాన్ని వెళ్లబుచ్చడం మాని పర్యావరణాన్ని రక్షించేందుకు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ”ఎకో ఆస్కార్స్‌”గా పిలువబడే ఎర్త్‌షాట్ ప్రైజ్‌ ఫైనలిస్ట్‌లలో ఒకరైన వినీషా ఉమా శంకర్‌ని  ప్రిన్స్‌ విలియం సదస్సులో ’క్లీన్‌ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్‌‘ గురించి చర్చించే సమావేశంలో మాట్లాడేందుకు ఆహ్వానించారు. ” మర్యాదపూర్వకంగా ఒక ప్రశ్న ...

Read More »

‘పెద్దన్న’ కోసం ప్రచారం మొదలుపెట్టిన ముద్దుగుమ్మలు

సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అన్నాతే’. ఈ చిత్రాన్ని తెలుగులో పెద్దన్న పేరుతో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో రజినీ చెల్లెలుగా మహానటి కీర్తి సురేష్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం దీపావళి కానుకగా ఈ నెల 4 న విడుదల కానున్న సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్ల హడావిడి మొదలుపెట్టేసింది. ఇటీవల హాస్పిటల్ నుంచి రావడంతో రజినీ ప్రమోషన్స్ కి ...

Read More »

బద్వేలు ఉప ఎన్నికలో వైసిపి ఘన విజయం

 బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లో అధికార‌ వైసీపీ విజ‌య‌దుందుభి మోగించింది. వైసీపీ అభ్య‌ర్థి దాస‌రి సుధ భారీ మెజారిటీ సాధించారు. గ‌త‌ ఎన్నిక‌ల్లో దాస‌రి సుధ‌ భ‌ర్త వెంక‌ట సుబ్బ‌య్య 44,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కానీ ఈ ఎన్నిక‌ల్లో త‌న భ‌ర్త మెజారిటీ బీట్ చేశారు. 11 రౌండ్ల కౌంటింగ్ పూర్త‌య్యే స‌రికి 89,660 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఇంకా ఒక్క రౌండ్‌ మాత్ర‌మే మిగిలి ఉండ‌టంతో వైసీపీ గెలుపు లాంఛ‌న‌మైపోయింది.

Read More »

సమస్యలను పరిష్కరించవచ్చు :సోనూసూద్‌

కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సాయం అందిస్తున్నారు. ఈ క్రమంలో సాయం కోరుతూ ఎంతోమంది సోనూకి ఫోన్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఆయన ఓ ట్వీట్‌ పెట్టారు. ”సాయం కోరుతూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అర్ధరాత్రి ఫోన్లు రావడం పట్ల నాకెలాంటి ఇబ్బందిలేదు. కానీ, వాళ్లకు చేయూతనందించేవాళ్లు లేరా? అని బాధగా అనిపిస్తోంది. ఒకరిపై ఒకరు నిందలేసుకోవడం మానేసి… ఉద్యోగాలు కల్పించడం, పేదల ఆకలి తీర్చడం, ఉచిత విద్య అందించడం ద్వారా ఈ సమస్యలు పరిష్కరించవచ్చు” అని సోనూసూద్‌ పేర్కొన్నారు.

Read More »

నేటి నుండి రాజధాని రైతుల మహా పాదయాత్ర

రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక రైతులు తలపెట్టిన మహా పాదయాత్ర నేడు (సోమవారం) ప్రారంభం కానుంది. అమరావతి పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉదయం తొమ్మిది, పది గంటల మధ్మలో ప్రారంభం కానున్న ఈ యాత్రను విజయవంతం చేయడానికి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాజధాని నగరం అమరావతికి శంకుస్థాపన చేసిన ఉద్దండ్రాయునిపాలెం నుండి యాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుండి తిరుమల వెంకటేశ్వరస్వామి దేవస్థానం వరకు యాత్ర సాగనుంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా సాగే ఈ ...

Read More »

స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన కైకాల సత్యనారాయణ

టాలీవుడ్ సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ గ‌త రాత్రి ఆసుప‌త్రిలో చేరారు. నాలుగు రోజుల క్రితం ఆయన ఇంట్లో ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డారని ఆయ‌న కుటుంబ స‌భ్యులు చెప్పారు. నిన్న రాత్రి ఆయ‌న స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చేర్పించామ‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉంద‌ని, ఎవ‌రూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా, రెండేళ్ల నుంచి కైకాల స‌త్య నారాయ‌ణ సినిమాల్లో న‌టించ‌ట్లేదు.

Read More »