Monthly Archives: December 2021

ఇంటర్నేషనల్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌కు భారీ నజరానా

ఇటీవల స్పెయిన్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన అంతర్జాతీయ షట్లర్‌, తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్‌కు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. తిరుపతిలో బ్యాడ్మింటన్‌ అకాడమీ ఏర్పాటుకు ఐదెకరాల భూమిని కేటాయించనున్నట్లు సిఎం వైఎస్‌ జగన్‌ వెల్లడించారు. అలాగే రజత పతకం సాధించినందుకు శ్రీకాంత్‌కు రూ.7 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించారు. ఈ నగదు బహుమతిని క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్వయంగా అందజేశారు. రాష్ట్రంలో ...

Read More »

అదిరిపోయిన ‘లైగర్‌’ గ్లింప్స్‌

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా మూవీగా ‘లైగర్‌’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజరు దేవరకొండ, అనన్యపాండే జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్స్‌కు విశేష స్పందన లభించింది. తాజాగా న్యూ ఇయర్‌ సందర్శంగా చియ్రూనిట్‌ డిసెంబర్‌ 31న శుక్రవారం చిత్ర ఫస్ట్‌ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌ చూస్తే.. హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సీన్స్‌తో పూరి మార్క్‌ స్పష్టంగా అర్థమౌతుంది. ఇక ముంబయి వీధుల్లో తిరిగే ఓ ఛారువాలా ఎంఎంఏ ...

Read More »

సోము వీర్రాజు విమర్శలకు తెదేపా కార్యాలయంలో స్క్రిప్ట్‌ : సజ్జల

బిజెపి నేతలపై ఎపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. వైసిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ.. టిడిపి అధినేత చంద్రబాబు అజెండానే బిజెపి నేతలు అనుసరిస్తారంటూ వ్యాఖ్యానించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాటలు.. ఆయనవేనని.. అయితే స్క్రిప్ట్‌ మాత్రం టిడిపి కార్యాలయంలో తయారవుతోందని ఆరోపించారు. టిడిపి, బిజెపిలకు సొంత ఎజెండా అంటూ ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ఇంత దిగజారుడుతనం ఎందుకో అర్థం కావడం లేదన్నారు. ‘ రాజధాని అమరావతి స్కాములమయని గతంలో విమర్శించిన బిజెపి నేతలు.. ఇప్పుడేమో అధికారం ...

Read More »

మంచు మనోజ్‌కు కరోనా పాజిటివ్‌

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌కు కోవిడ్‌ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. ‘నాకు క‌రోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవ‌ల న‌న్ను క‌లిసిన ప్రతి ఒక్కరు వెంట‌నే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరుతున్నా. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా. నా గురించి ఆందోళన అక్కర్లేదు. మీ అందరి ఆశీర్వాదాలతో ఆరోగ్యంగా

Read More »

టిపిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌

టిపిసిసి చీఫ్‌, కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి జూబ్లిహిల్స్‌లోని తన నివాసం నుంచి ఎర్రవల్లికి బయల్దేరుతుండగా సోమవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో పోలీసులు-కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో రేవంత్‌ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఉదయం నుంచే ఇంటి చుట్టూ పోలీసులు పహారా కాస్తూ.. ఇంటి నుంచి ఎటు వైపు నుంచి బయటికి వచ్చినా అడ్డుకుని అరెస్ట్‌ చేయాలని ముందస్తు వ్యూహంతో పోలీసులు ఉన్నారు. ఆయన బయటికి రాగానే అరెస్ట్‌ చేశారు. అయితే ఆయన్ను ఎక్కడికి ...

Read More »

అప్పుడే టాలీవుడ్‌ పెద్దలు స్పందించి వుంటే బాగుండేది : నాని

నాని హీరోగా నటించిన సినిమా ‘శ్యామ్‌ సింగ రాయ్’ ఈ నెల 24న విడుదలై.. హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ప్రీరిలీజ్‌ వేడుకల్లో నాని చేసిన వ్యాఖ్యలతో ఎపిలో కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నానికి ఇండిస్టీ పెద్దల నుండి అభిమానుల నుంచి భారీగా సపోర్ట్‌ లభించింది. తాజాగా మరోసారి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసి హాట్‌ టాపిక్‌ అయ్యారు. అసలు టాలీవుడ్‌కు ఈ సమస్య మొదలయింది ‘వకీల్‌ సాబ్‌’ చిత్రం నుంచే అంటూ మాట్లాడారు. అప్పుడే టాలీవుడ్‌ ...

Read More »

పులివెందులలో రూ.110కోట్లతో ”ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌”కి శంకుస్థాపన

కడప జిల్లా పులివెందులలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రీటైల్‌ లిమిటెడ్‌ కంపెనీకి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. పులివెందుల పారిశ్రామికవాడలో రూ.110 కోట్లతో ఈ కంపెనీ ఏర్పాటవుతోందన్నారు. ఈ కంపెనీ ఏర్పాటులో తొలిదశలో రెండువేలకు పైగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. కంపెనీ ఏర్పాటయ్యాక ఉద్యోగావకాశాలు మరిన్ని పెరుగుతాయన్నారు. పరిశ్రమలకు కావల్సిన వారికి నైపుణ్యాభివృధ్ధి కళాశాలలో శిక్షణ కల్పిస్తామన్నారు. ఫార్చూన్‌ 500 కంపెనీల్లో ఆదిత్య బిర్లా గ్రూపు కూడా ఉందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామిక వేత్తలకు సీఎం కృతజ్ఞతలు చెప్పారు.

Read More »

ప్రముఖ దర్శకుడు కెఎస్‌.సేతుమాధవన్‌ కన్నుమూత

చెన్నై : సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. దక్షిణ భారత ప్రముఖ డైరెక్టర్‌ కెఎస్‌.సేతు మాధవన్‌ కన్నుమూశారు. వయో సంబంధ సమస్యలతో బాధపడుతున్న సేతు మాధవన్‌ చెన్నైలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. సేతు మాధవన్‌ వయసు ప్రస్తుతం 90 సంవత్సరాలు. సేతు మాధవన్‌ మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

Read More »

ఎమ్మెల్యే మద్దాలి గిరి కుమారుడి వివాహానికి జగన్‌ హాజరు

 గుంటూరు వెస్ట్‌ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌ రావు కుమారుడి వివాహా వేడుకకు సిఎం వైఎస్‌ జగన్‌ హాజరైన్నారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరిగిన వేడుకలో వరుడు మద్దాలి కృష్ణ వినూత్, వధువు చలమచర్ల లక్ష్మీ సుదీపలను సిఎం జగన్ ఆశీర్వదించారు.

Read More »

ఎపిలో సినిమా టికెట్‌ రేట్లపై నాని అసహనం

సినిమా టికెట్‌ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నటుడు నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు అనే విషయాన్ని పక్కన పెడితే ప్రేక్షకుల్ని అవమానించేలా ఈ నిర్ణయం ఉందన్నారు. ఈమేరకు గురువారం శ్యామ్‌సింగరాయ్ చిత్ర బృందం కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న నాని ఈ వ్యాఖ్యలు చేశారు. ”ఎపి ప్రభుత్వం టికెట్‌ ధరలు తగ్గించింది. ఏదేమైనా ఆ నిర్ణయం సరైనది కాదు. టికెట్‌ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించింది. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల ...

Read More »