Monthly Archives: January 2022

‘కొండా’ ట్రైలర్‌ విడుదల

సెన్సేషన్ డైరెక్టర్ ఆర్జీవీ ఇటీవల రాజకీయాల్లోని చాలా మంది బయోపిక్స్ ని ఒక్కొక్కటిగా తెరకెక్కిస్తున్నారు. ఆర్జీవీ ఇటీవల తెలంగాణ నాయకుడు కొండా మురళి బయోపిక్ ని అనౌన్స్ చేశాడు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ సినిమా ఆసక్తిగా మారింది. గతంలో ఆర్జీవీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ”నేను మాఫియా, ఫ్యాక్షనిజం, రౌడీయిజంపై సినిమాలు తీసాను కానీ తెలంగాణ నక్సలైట్, మావోయిస్టుల గురించి తీయలేదు. ఇప్పుడు కొండా మురళి బయోపిక్ తో అది కూడా పూర్తవుతుంది” అని తెలిపారు. కొండా మురళి, కొండా సురేఖల ...

Read More »

వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ను ప్రారంభించిన జగన్

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,92,674 మంది అక్కచెల్లెమ్మలు ఈ పథకం ద్వారా లబ్ది పొందనున్నారు. ఇందుకు 589 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ పథకం కోసం విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ..  దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యాక్రమానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. రాజ్యాంగ స్పూర్తిని అనుసరిస్తూ అడుగులు వేస్తున్నామని తెలిపారు.

Read More »

చిరంజీవికి జోడీగా త్రిష?

చిరంజీవి యంగ్‌ హీరోల కంటే స్పీడుగా.. వరుస సినిమాల్లో నటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ, మెగాస్టార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ‘గాడ్‌ ఫాదర్‌, ‘భోళాశంకర్‌’ చిత్రాలు చిరంజీవి చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటూ చిరు బిజీ బిజీగా ఉంటున్నారు. ఇక బాబీ దర్శకత్వంలో మరో చిత్రంలోనూ మెగాస్టార్‌ నటిస్తున్నారు. అలాగే వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలోనూ చిరంజీవి నటిస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వంలో ...

Read More »

‘కేజ్రీవాల్‌తో డిన్నర్‌’ .. ఢిల్లీ సిఎం సరికొత్త ప్రచారం

ఆప్‌ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ డిజిటల్‌ ప్రచారానికి తెరతీశారు. ‘ కేజ్రీవాల్‌కి ఒక అవకాశం’ పేరిట డిజిటల్‌ ప్రచార కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, ఆప్‌ ప్రభుత్వ పనితీరు గురించి సోషల్‌మీడియాలో ప్రచారం చేయాలని ఢిల్లీ ప్రజలను కోరారు. నెట్‌లో వైరల్‌గా మారిన వీడియోల నుండి ఎంపిక చేసిన 50 మందిని .. అసెంబ్లీ ఎన్నికల అనంతరం డిన్నర్‌కి ఆహ్వానిస్తామని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి గురించిన వీడియోలను, దాని ద్వారా మీరు పొందిన ప్రయోజనాల గురించి ట్విటర్‌, ...

Read More »

మరో నటుడికి కరోనా

మలయాళ నటుడు జయరామ్‌కి కరోనా సోకింది. ఇటీవల మమ్ముట్టి, దుల్కర్‌ సల్మాన్‌, సురేష్‌ గోపీలు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. నిన్న (శనివారం) తనకి కరోనా పాజిటివ్‌ గా నిర్దారణ అయినట్టు సోషల్‌ మీడియాలో ప్రకటించారు. తనకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయిందని, వైరస్‌ ఇంకా మనతోనే ఉందని, మనకు గుర్తు చేస్తోందని అన్నారు. తనతో కాంటాక్ట్‌ లో ఉన్నవారు ఐసోలేట్‌ అవ్వాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు. లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నట్లు ట్వీట్‌చేశారు. తాను ట్రీట్‌ మెంట్‌ మొదలు పెట్టానని, ...

Read More »

శ్రీవారి సేవలో నాగార్జున దంపతులు

అక్కినేని నాగార్జున తిరుమల తిరుమతి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం తన భార్య అక్కినేని అమలతో కలిసి తిరుమల చేరుకున్నారు. విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో నాగార్జున దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వీరికి వేద ఆశీర్వచనం అందించారు. ఆ తర్వాత వీరిని ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Read More »

విశాఖలో పొగమంచు.. పలు విమానాలు రద్దు

విశాఖను దట్టమైన పొగమంచు ఆవరించింది. పొగమంచులో ప్రయాణీకులు తీవ్ర అవస్థలుపడుతున్నారు. ఈ నేపథ్యంలో… పలు విమానాలను దారి మళ్లించినట్లు, మరికొన్ని విమానాలను అధికారులు రద్దు చేసినట్లు విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ శ్రీనివాస్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఉదయం 9 గంటల తర్వాత విమాన రాకపోకలు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు.

Read More »

అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో మోడీకి తొలిస్థానం

మోడీ ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన దేశాధినేతల్లో తొలి స్థానంలో నిలిచారు. 13 మంది దేశాధినేతలపై అమెరికాకు చెందిన మార్నింగ్‌ కన్సల్ట్‌ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, భారత్‌, ఇటలీ, జపాన్‌, మెక్సికో, దక్షిణకొరియా, స్పెయిన్‌, బ్రిటన్‌, అమెరికా దేశాధినేతలపై ఈ సర్వే చేపట్టింది. అందులో మోడీని 71 శాతం మంది ప్రజలు ఆమోదించారు. ఇక ఈ జాబితాలో 43 శాతం రేటింగ్‌తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆరో స్థానంలో నిలిచారు. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్‌ ...

Read More »

పెదనాన్నకు ప్రేమతో.. ప్రభాస్‌

కృష్ణరరాజు పుట్టినరోజు సందర్భంగా చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో హీరో ప్రభాస్‌ తన పెదనాన్నకు సోషల్‌ మీడియా ద్వారా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ”పెదనాన్న ది రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు గారికి బర్త్‌ డే విషెస్‌ తెలియజేస్తున్నాను. మీ వివేకం, గైడెన్స్‌ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ పోస్ట్‌ చేశారు. ప్రభాస్‌ పెదనాన్నతో కలిసి బిల్లా, రెబల్‌ చిత్రాల్లో నటించారు. త్వరలో ‘రాధేశ్యామ్‌’ సినిమాలోనూ ఇద్దరూ సందడి చేయబోతున్నారు.

Read More »

స్కూల్స్‌కు సెలవులు ఇచ్చే ఆలోచన లేదు : ఆదిమూలం సురేశ్‌

 కోవిడ్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలోనూ.. తమ ప్రభుత్వం విద్యార్థులకు ఉన్నత విద్యనందించాలని లక్ష్యంగా పెట్టుకున్నదనీ.. పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదనీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్‌ స్పష్టం చేశారు. గురువారం గుంటూరు వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌తో కలిసి, మంత్రి సురేష్‌ ఈరోజు ఆన్‌లైన్‌ విద్యాభ్యాసం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. భవిష్యత్తులో ఉన్నతవిద్యనభ్యసించే విద్యార్థులకు ఆన్‌లైన్‌ విధానం తప్పనిసరి. రానున్న కాలంలో ఆన్‌లైన్‌కోర్సులకు మరింత డిమాండ్‌ ...

Read More »