Monthly Archives: April 2022

ప్రతి విద్యార్థీ దిశా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి: హోమంత్రి

‘దిశ’ పోలీస్‌ స్టేషన్‌ను హోం మంత్రి తానేటి వనిత శనివారం సందర్శించారు. సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. మహిళల రక్షణ కోసమే ‘దిశ ‘యాప్‌, దిశ చట్టాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చారని హోంమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి 24 లక్షల మందికి పైగా దిశ యాప్‌ ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారన్నారు. చదువుకొనే ప్రతి విద్యార్థిని దిశా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.మహిళలపై దాడులను సీఎం జగన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరన్నారు. ఇటీవల మహిళలపై దాడులు చేయడం టిడిపి నేతలకు అలవాటుగా మారిందన్నారు. ...

Read More »

హీరో గోపీచంద్‌కు స్వల్ప ప్రమాదం

గోపిచంద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. డైరెక్టర్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో గోపీచంద్‌ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ మైసూర్‌లో జరుగుతోంది. షూటింగ్‌ సమయంలో కాలు కొద్దిగా స్లిప్‌ అవ్వడంతో గోపిచింద్‌ పడిపోయారు. అయితే ఆయనకు స్వల్పగాయాలే అయ్యాయని, అభిమానులు, స్నేహితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్రయూనిట్‌ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది.

Read More »

బి.టెక్‌ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష

గుంటూరులో బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్యకేసులో ఫాస్ట్రక్‌ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడు శిశికృష్ణకు ఉరి శిక్ష విధిస్తూ… జడ్జిమెంట్‌ ఇచ్చింది. గతేడాది గుంటూరు పరమాయికుంటకు చెందిన రమ్యను… శిశికృష్ణ కత్తితో పొడిచి హత్య చేశాడు. తనను ప్రేమించడం లేదని… ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిందన్న కోపంతో గతేడాది ఆగస్టు 15న నడిరోడ్డుపైన అందరూ చూస్తుండగా రమ్యను కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. ఈ కేసుపై దాదాపు 5 నెలలు విచారించిన ప్రత్యేక న్యాయం స్థానం… నిందితుడికి ఉరిశిక్ష వేస్తూ తీర్పునిచ్చింది.

Read More »

సమంతకు సర్‌ప్రైజ్‌ ట్రీట్‌ ఇచ్చిన విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఓ సినిమా రాబోతున్న సంగతి విదితమే. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ కాశ్మీర్‌లో జరగుతుంది. కాగా, ఈనెల 28న సమంత పుట్టిన రోజును పురస్కరించుకొని విజయ్ దేవరకొండ ఆమెకు సర్‌ప్రైజింగ్‌గా విషెస్‌ తెలియజేశారు. దీంతో ఆమె సైతం షాకింగ్‌, ఆనందానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.

Read More »

హైకోర్టులో ఆరుగురు ఐఏఎస్‌లకు ఊరట

 హైకోర్టులో ఆరుగురు ఐఏఎస్‌లకు ఊరట లభించింది. ఐఏఎస్‌లకు విధించిన సేవా శిక్షను 8 వారాల పాటు హైకోర్టు సస్పెండ్‌ చేసింది. కోర్టు ధిక్కరణ కింద 8 మంది ఐఏఎస్‌లకు హైకోర్టు సింగిల్‌ జడ్జి సేవాశిక్ష వేసింది. ఈ శిక్షను డివిజనల్‌ బెంచ్‌లో గతవారం ఇద్దరు ఐఏఎస్‌లు సవాల్‌ చేశారు. సేవాశిక్షను 8 వారాలపాటు చీఫ్‌ జస్టిస్‌ ధర్మాసనం సస్పెండ్‌ చేసింది. సేవాశిక్షను ధర్మాసనంలో మరో ఆరుగురు ఐఏఎస్‌లు సవాల్‌ చేశారు. జస్టిస్‌ అసదుద్దిన్‌ అమానుల్లా నేతఅత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆరుగురు ఐఏఎస్‌ల సేవాశిక్షను ...

Read More »

ఏపీలో ‘ఆచార్య’ టికెట్‌ ధర అదనంగా రూ.50 పెంపు

ఈ ఏడాది నూతన సంవత్సరం రోజున (జనవరి-1)న గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జరిగిన ఓ సభలో ఏపీ సిఎం వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘పేదవాడికి అందుబాటులో వినోదాన్ని అందించాలన్న ఉద్దేశంతో సినిమా టికెట్‌ ధరల్ని నిర్ణయిస్తే.. దాని మీద కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒకసారి ఆలోచించండి. ఇలాంటివాళ్లు పేదల గురించి ఆలోచించేవాళ్లేనా? వారి గురించి పట్టించుకునేవాళ్లేనా? పేదవారికి వీళ్లు శత్రువులు కాదా?’ అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సిఎం జగన్‌.. కేవలం మూడు నెలల్లోనే సినిమా టికెట్‌ ధరల్ని భారీగా పెంచేశారు. మార్చి ...

Read More »

జగన్‌ అధ్యక్షతన కీలక సమావేశం

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మరికాసేపట్లో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం మంత్రులు, పార్టీ అధ్యక్షుల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి 26 జిల్లాల అధ్యక్షులు, రీజనల్‌ కో ఆర్డినేటర్లు, మంత్రులు హాజరవనున్నారు. ఈ సమావేశంలో పార్టీ, ప్రభుత్వం సమన్వయంపై సీఎం జగన్‌ దిశా నిర్దేశం చేయనున్నారు.

Read More »

తమిళంలో కూడా సర్కారు వారి పాట

మహేష్‌బాబు, కీర్తిసురేష్‌ జంటగా నటిస్తోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రం బ్యాంకింగ్‌ రంగంలో జరుగుతున్న ఆర్థిక కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య మన తెలుగు సినిమాలన్నీ ఏకకాలంలో.. వివిధ భాషల్లోనూ విడుదలవుతున్నాయి. ‘సర్కారు వారి పాట’ చిత్రం కూడా.. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం ఆయా భాషలకు సంబంధించి డబ్బింగ్‌ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంటున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ మూవీ తమిళ వెర్షన్‌ అప్‌డేట్స్‌ కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. ...

Read More »

కాంగ్రెస్‌కు నా అవసరం కన్నా… : ప్రశాంత్‌ కిశోర్‌

 పార్టీలో చేరాలంటూ కాంగ్రెస్‌ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించిన ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తను తీసుకున్న నిర్ణయం పట్ల స్పందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు ఓ సూచన చేశారు. ‘ సాధికారిత కమిటీలో భాగంగా పార్టీలో చేరాలని, 2024 పార్లమెంట్‌ ఎన్నికల బాధ్యతలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించాను. నా అభిప్రాయం ప్రకారం.. కాంగ్రెస్‌లో లోతుగా పాతుకుపోయిన నిర్మాణపరమైన సమస్యలను పరిష్కరించడానికి నా అవసరం కన్నా.. పార్టీకి నాయకత్వం, సమిష్టి సంకల్పం అవసరం’ అని సూచించారు.

Read More »

‘కళావతి’కి 15 కోట్ల వీక్షణలు

మహేష్‌ బాబు హీరోగా డైరెక్టర్‌ పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. ‘కళావతి’ పాటకు భారీ స్పందన లభిస్తోంది. తాజాగా ఈ పాట 15 కోట్ల వీక్షణలతో వ్యూస్‌తో దూసుకుపోతోంది. ‘కళావతి’ పాటపై సోషల్‌ మీడియాలో భారీ రీల్స్‌ వస్తున్నాయి. ఈ చిత్రం వచ్చే నెల 12న ...

Read More »