వీసా కుంభకోణం కేసులో సిబిఐ విచారణను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపి కార్తి చిదంబరం శుక్రవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. పార్లమెంటరీ ప్రత్యేక హక్కుని సిబిఐ అధికారులు స్పష్టంగా ఉల్లంఘించారని పేర్కొన్నారు. తన కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలు ఒకదాని తర్వాత మరొకటి తప్పుడు కేసులు బనాయిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ సమస్య పార్లమెంట్ సభ్యునిగా తన హక్కులు, అధికారాలకు సంబంధించినదని, ఈ అత్యవసరమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి బాధపడుతున్నానని లేఖలో పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా ...
Read More »Monthly Archives: May 2022
డ్రగ్స్ కేసులో షారూఖ్‌ఖాన్ కుమారుడికి క్లీన్ చిట్
డ్రగ్స్ కేసులో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) శుక్రవారం క్లీన్ చిట్ ఇచ్చింది. ఆర్యన్‌ఖాన్, ఇతరుల వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని, అలాగే వారు డ్రగ్స్ తీసుకున్నట్లు సరైన ఆధారాలు లేవంటూ ఎన్‌సిబి చార్జిషీట్‌లో పేర్కొంది. మరో 14 మందిపై చార్జిషీట్ నమోదు చేసింది. షారూఖ్ ఖాన్, ఆర్యన్ ఖాన్ ఇద్దరికి ఉపశమనం లభించిందంటూ న్యాయవాది ముఖుల్ రోహత్గి పేర్కొన్నారు. ”ఆర్యన్, అతడి తండ్రి షారుక్‌కు గొప్ప ఉపశమనం లభించినట్లయింది. నిజం ఇప్పటికైనా బయటపడింది. ఆర్యన్ వద్ద ఎలాంటి ...
Read More »జనసేన అధినేత పవన్‌పై కొడాలి నాని ఫైర్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గుడివాడ మండలం లింగవరంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కొడాలి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎవరో రాసిన స్క్రిప్టులు చదువుతూ, రాజ్యాంగంపై అవగాహన లేని సన్నాసులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే జరుగుతుందని విరుచుకుపడ్డారు. ఏ అవగాహనతో పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని అని నిలదీశారు. అంబేద్కర్‌ను వ్యతిరేకించే వాళ్లకు దేశ బహిష్కరణ విధించి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించి ...
Read More »ఎఫ్ – 3 కోసం రామ్‌చరణ్ పోస్ట్‌పోన్ !
రామ్‌చరణ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీతో సక్సెస్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత విడుదలైన ‘ఆచార్య’ మూవీ కూడా హిట్ కొడుతుందని ఆశిస్తే.. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. దీంతో రామ్‌చరణ్ భారీ ఫ్లాప్‌ను అందుకున్నాడు. దీంతో మెగా ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. అందుకే మెగాఫ్యాన్స్ ప్రస్తుతం రామ్‌చరణ్ నటిస్తున్న చిత్ర అప్‌డేట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి బయటకి వచ్చింది. ఇప్పటికే డైరెక్టర్ శంకర్ ఈ సినిమా ఫస్ట్‌లుక్ రెడీ చేశారని.. కొన్ని కారణాల ...
Read More »వివాదాల్లో ‘శేఖర్’
రాజశేఖర్ హీరోగా నటించిన ‘శేఖర’్ చిత్రం వివాదాలతో నడుస్తోంది. మే 20న విడుదలైన ఈ చిత్ర ప్రదర్శన ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వేసిన కేసు కారణంగా మే 22న అన్ని థియేటర్లలో ఆపేశారు. వంకాయల పాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా నిర్మాత సుధాకర్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ‘నా సినిమాను ఆపేసి అన్యాయం చేశారు. డిజిటల్ ప్రొవైడర్స్‌కు నేను డబ్బు కట్టి ఒప్పందం చేసుకున్నాను. లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. శేఖర్ ...
Read More »ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ రాజీనామా
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపారు. మాజీ గవర్నర్ నజీబ్ జంగ్ అనంతరం 2016 డిసెంబర్ 31న లెఫ్టినెంట్ గవర్నర్‌గా బైజల్ బాధ్యతలు స్వీకరించారు. సుమారు ఐదున్నరేళ్లుగా ఆ పదవిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో వివాదంతో బైజల్ పలుసార్లు వార్తల్లో నిలిచారు.
Read More »రెహమాన్ కొత్త చిత్రం
ఎ.ఆర్. రెహమాన్ ఇటీవల ’99 సాంగ్స్ అనే పాన్ ఇండియా మూవీని నిర్మించి, విడుదల చేశారు. తాజాగా వర్చువల్ రియాలిటీ మూవీ అయిన ‘లే మాస్క్’ కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ప్రస్తుతం జరుగుతున్న కాన్స్ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. 75 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రాన్ని అక్కడి వ్యూవర్స్ కోసం 36 నిమిషాలకు కుదించారు. రెహమాన్ భార్య సైరా ఇచ్చిన ఐడియాలో ఈ చిత్రం రూపుద్దికుంది. అంతర్జాతీయ నటీనటులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ, అత్యుత్తమ సాంకేతిక ...
Read More »మెగా పవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలులోని ఓర్వకల్లు మండలం గుమ్మితం తాండాలో పవర్ ప్రాజెక్ట్ త్రీడీ మోడల్ నమూనాను మంగళవారం ప్రారంభించారు. ఒకే యూనిట్ నుంచి సోలార్, విండ్, హైడల్ పవర్లను ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఈ ప్రాజెక్ట్ ద్వారా 5,230 మెగావాట్ల ఉత్పత్తి చేస్తారు.
Read More »‘సర్కారు వారి పాట’ విజయోత్సవ వేడుకల్లో హీరో మహేష్‌బాబు
సర్కారు వారి పాట సినిమాను విజయవంతం చేసిన అభిమానుల రుణం తీర్చుకోలేనిదని సినీ హీరో మహేష్‌బాబు అన్నారు. ఈ సినిమా విజయోత్సవ వేడుకలు కర్నూలులోని ఎస్టిబిసి కళాశాల మైదానంలో సోమవారం జరిగాయి. ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ ఒక్కడు సినిమా సమయంలో షూటింగ్ కోసం కర్నూలుకు వచ్చానన్నారు. అభిమానులు ఇచ్చిన విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. కరోనా వల్ల ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డామని తెలిపారు. అభిమానులు ఎప్పుడూ తన గుండెల్లో ఉంటారని, ఇంకా మంచి సినిమాలు తీస్తూనే ఉంటానని పేర్కొన్నారు. అభిమానుల ...
Read More »రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన జగన్
వైఎస్సార్ రైతు భరోసా కింద 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హత పొందిన 50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం ప్రభుత్వం అందించింది.ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం కంప్యూటర్లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు.
Read More »