Monthly Archives: May 2022

20న ఒటిటిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’

రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్‌టిఆర్‌ మల్లీస్టారర్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఒటిటి ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కావడానికి సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది చిత్రబృందం. ఈనెల 20 నుంచి ప్రముఖ ఒటిటి ప్లాట్‌ఫాం జీ5లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Read More »

రోడ్ల ప్రగతికి ఏడాది గడువు : జగన్‌

రాష్ట్రంలో రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పని చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. విపక్షాల విమర్శలను చాలెంజ్‌గా తీసుకుని, గుంతలు లేకుండా రోడ్లను అభివృద్ధి చేయాలన్నారు. రోడ్ల అభివృద్ధి ప్రగతిపై అధికారులకు ఏడాది గడువును నిర్దేశించారు. ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్‌శాఖల రోడ్లపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సిఎం బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఏర్పాటు చేసిన రోడ్ల ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో 7,804 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బి రోడ్ల అభివృద్ధికి రూ.2,500 కోట్లను, పంచాయతీరాజ్‌ (పిఆర్‌) ...

Read More »

వెబ్‌సిరీస్‌తో సోనాలి బింద్రే రీ ఎంట్రీ

సోనాలి బింద్రే జీ5 ఓటీటీలో రాబోతున్న ‘ది బ్రోకెన్‌ న్యూస్‌’ అనే వెబ్‌ సిరీస్‌ ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు. వినరు వైకుల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రచయిత మైక్‌ బార్ట్‌లెట్‌ కథను అందించారు. మీడియా ఛానళ్ల ఛాంబర్స్‌లో జరిగే సన్నివేశాలు ఆధారంగా సిరీస్‌ ఉండబోతుందని దర్శకుడు తెలిపారు. వార్తల కోసం జర్నలిస్టులు ఎదుర్కొనే సవాళ్లు, ఒత్తిళ్లుఇందులో చూపించనున్నారు. ఈ చిత్రంలో శ్రియా పిల్గావ్కర్‌, జైదీప్‌ అహ్లావత్‌, ఇంద్రనీల్‌ సేన్‌గుప్తా, తరుక్‌ రైనా, ఆకాష్‌ ఖురానా, కిరణ్‌ కుమార్‌ నటిస్తున్నారు.

Read More »

పరిశ్రమలకు 70 శాతం విద్యుత్‌ సరఫరా : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పరిశ్రమలకు వారంలో అన్ని రోజులపాటు విద్యుత్‌ సరఫరా చేసేందుకు, 70 శాతం మేర విద్యుత్‌ వినియోగానికి అవకాశం కల్పించినట్లు విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సచివాలయంలో మంత్రి బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం రోజుకు 235 మిలియన్‌ యూనిట్ల నుంచి 186 మిలియన్‌ యూనిట్లకు తగ్గిన నేపథ్యంలో పరిశ్రమలకు సరఫరాను పెంపొందించే విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

Read More »

సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన మహేష్

ఒక పక్క హీరోగా నటిస్తూనే మరోపక్క నిర్మాణ రంగంలో కూడా విజయాలను అందుకుంటున్న మహేష్‌ బాబు ‘జిఎంబి’ ఎంటర్టైన్మెంట్‌ పేరుతో పలు సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా ఎఎస్‌ మూవీస్‌, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా సంస్థతో కలిసి ‘మేజర్‌’ సినిమాను నిర్మించిన విషయం విదితమే. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌లో పాల్గన్న ఆయన విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా తన తండ్రి కృష్ట బయోపిక్‌పై స్పందించారు. ‘మీ అభిమానులకు కృష్ణ గారి బయోపిక్‌ ఎప్పుడు అందిస్తారు?’ అని విలేకరి అడుగగా ‘కృష్ణ గారి ...

Read More »

ఎపి, ఒడిస్సాలపై అసాని ప్రభావం

ఎపి, ఒడిస్సాలపై అసాని తుఫాను తీవ్ర ప్రభావం చూపనుంది. తుఫాను ఎపిలోని తూర్పుతీరంలో కేంద్రీకృతమైందని, గంటకు 105 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండి) తెలిపింది. తుఫాను క్రమంగా బలహీన పడుతోందని, మంగళవారం రాత్రి నుండి ఎపిలోని ఉత్తర కోస్తాతో పాటు ఒడిస్సాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది. ఇప్పటికే ఎపిలోని విశాఖ పట్నం పోర్ట్‌ను మూసివేశారు. వాతావరణ అననుకూల పరిస్థితుల కారణంగా 23 విమానాలను రద్దు చేసినట్లు విశాఖ పట్నం అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్‌ ...

Read More »

తల్లి కాబోతున్న హీరోయిన్‌ నమిత.

హీరోయిన్‌ నమిత తల్లికాబోతుంది. ఈరోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె బేబీ బంప్‌ ఫొటోను సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్‌ చేసింది. అలాగే తన మాతృత్వపు అనుభూతల గురించి పోస్ట్‌లో తెలిపింది. ‘మాతృత్వం.. నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. నా ముఖంలో చిరునవ్వు వచ్చింది. నేను మారాను, నాలోనూ మార్పు మొదలైంది. ఎన్నోరోజులుగా మాతృత్వ అనుభూతి కోసం ఎదురుచూశా. ఇప్పుడు నా చిన్నారి కిక్స్‌ కొత్త అనుభూతినిస్తున్నాయి. ఈ ఫీలింగ్‌ ఎప్పుడూ లేని కొత్త ఫీలింగ్‌’ అంటూ నమిత పోస్ట్‌లో రాసుకొచ్చింది.

Read More »

దక్షిణాఫ్రికాలో విజృంభిస్తున్న ఒమిక్రాన్‌

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి నెమ్మదించినా.. కొన్ని దేశాల్లో వైరస్‌ ఉధృతి అధికంగా ఉంది. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్ల వ్యాప్తితో రికార్డు  స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కరోనా పాజిటివిటీ రేటు 30శాతం దాటింది. ఐదు నెలల అనంతరం ఈ స్థాయిలో పాజిటివిటీ రేటు నమోదు కావడంతో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉపరకాల ప్రభావంతో దక్షిణాఫ్రికాలో గతకొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. శనివారం ఒక్కరోజే 8,524 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 31.1శాతం ఉన్నట్లు అక్కడి జాతీయ అంటువ్యాధుల ...

Read More »

మొదటిసారి కొడుకు ఫొటో షేర్‌ చేసిన కాజల్‌

 కాజల్‌ అగర్వాల్‌ ఇటీవల ఓ పడంటి మగబిడ్డకు జన్మనచ్చిని సంగతి తెలిసిందే. ఆమె ఇప్పటి వరకూ తన కుమారుడి ఫొటోలను ఎక్కడా బయట పెట్టలేదు. అయితే.. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని తన కుమారుడితో కలిసి ఉన్న పలు ఫొటోలను తాజాగా షేర్‌ చేశారు. ఈ ఫొటోల్లో ఆ చిన్నారి ముఖం కన్పించకుండా జాగ్రత్తపడ్డారు. నీల్‌ అంటే తనకెంత ఇష్టమో తెలియజేస్తూ ఆమె పెట్టిన ఓ పోస్ట్‌ సమంత, రాశీఖన్నా, హన్సిక.. ఇలా పలువురు సెలబ్రిటీల్నీ ఆకర్షించింది.

Read More »

సామాన్యులకి షాక్‌.. మళ్లీ పెరిగిన గ్యాస్‌ ధర

గ్యాస్‌ వినియోగదారులకు చమురు సంస్థలు మరో షాక్‌నిచ్చాయి. గ్యాస్‌ ధర మరోసారి పెరిగింది. ఈ నెల 1 న కమర్షియల్‌ సిలిండర్‌ ధరలు పెంచిన ప్రభుత్వం.. తాజాగా గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌పై ధరను పెంచింది. 14 కేజీల సిలిండర్‌ పై రూ.50 వడ్డించింది. ఈ మేరకు దేశీయ ఇంధన సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1052 కు చేరింది. దీనికి డెలివరీ బార్సు తీసుకునే రూ.30 కలిపితే రూ.1082 అవుతుంది. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని ...

Read More »