Monthly Archives: July 2022

దేశంలోనే అత్యంత పిరికి సన్నాసి చంద్రబాబు : కొడాలి నాని

దేశంలోనే అత్యంత పిరికి సన్నాసి చంద్రబాబు అంటూ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆయన గుడివాడ 12వ వార్డులో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు జీవితంలో ఏనాడైనా రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. కనీసం సర్పంచ్‌తో కూడా రాజీనామా చేయించలేని వ్యక్తి చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు.అవతలవారికి చెప్పే ముందు.. నీ దగ్గరున్న  23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలతో రాజీనామా చేయించాలని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రాజీనామాలను ఈక ముక్కతో ...

Read More »

సమంత ఇంటి సెంటిమెంట్‌తో నాగ చైతన్య ఇల్లు కొనేసింది!

నాగచైతన్య, సమంత విడిపోకముందు ఓ ఖరీదైన భవంతిని కొనుగోలు చేశారు. దాన్ని కొంత రీమోడల్‌ చేస్తుండగానే ఇద్దరిమధ్య స్పర్థలు వచ్చి విడిపోయారు. గచ్చిబౌలిలోని ఫైనాన్సియల్‌ జిల్లాకు దగ్గరలో ఉన్న మురళీమోహన్‌కు చెందిన ఖరీదైన విల్లాను వారు కొనుగోలు చేశారు. ఆ తర్వాత దానిని వేరేవారికి అమ్మేశారు. అది కూడా మురళీమోహన్‌ మధ్యవర్తిత్వంతో జరిగింది.ఈ విషయాన్ని ఇటీవలే ఓ ఇంటర్యూలో మురళీమోహన్‌ వెల్లడించారు. అయితే ట్విస్ట్‌ ఏమంటే, ఇప్పుడు ఆ ఇంటిని తిరిగి తమకు కావాలని సమంత తిరిగి మురళీమోహన్‌ దగ్గరకు వెళ్ళడం జరిగింది. దాంతో ...

Read More »

సోనియాపై విరుచుకుపడిన బిజెపి

రాష్ట్రపతి అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ గురువారం పార్లమెంటు దద్దరిల్లింది. ద్రౌపది ముర్ముని అగౌరవపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బిజెపి సభ్యులు నిరసనకు దిగారు. ‘రాష్ట్రపత్ని’ అంటూ ఆ పదవిని లోక్‌సభ ప్రతిపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి అవమాన పరిచారని, కాంగ్రెస్‌ క్షమాపణలు చెప్పాలని కేంద్రమంత్రి  స్మృతి ఇరానీ డిమాండ్‌ చేశారు. అత్యున్నత పదవిలో ఉన్న ఒక మహిళను అవమాన పరిచారంటూ మండిపడ్డారు. నిర్మలా సీతారామన్‌ సహా పలువురు బిజెపి మహిళా నేతలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ నాటకీయ పరిణామాలతో గురువారం ...

Read More »

‘రామారావు మాస్‌ నోటీస్‌’

రవితేజ నటించిన తాజా చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో శరత్‌ మండవ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 29న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం జోరుగా ప్రమోషన్లు నిర్వహిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘రామారావు మాస్‌ నోటీస్‌’ పేరుతో మరో ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్‌, రజిషా విజయన్‌ ...

Read More »

జగన్‌ను కలిసిన జాహ్నవి దంగేటి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి బుధవారం కలిశారు. నాసా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్‌గా జాహ్నవి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ నుంచి వరద బాధితులను పరామర్శించేందుకు బయలుదేరుతున్న ముఖ్యమంత్రిని కలిసి.. పైలెట్‌ ఆస్ట్రొనాట్‌ అవ్వాలన్న తన కోరికను వివరించి, ఇందుకు అవసరమైన శిక్షణకు అయ్యే ఖర్చుకు సాయం చేయాల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు.

Read More »

దిగొచ్చిన స్టార్‌ హీరోలు

టాలీవుడ్‌ బంద్‌ నిర్ణయంతో స్టార్‌ హీరోలు దిగొచ్చారు. నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతుండటంతో ఆగస్టు 1 నుంచి షూటింగులు నిలిపివేయాలని ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో  సెట్స్‌పై ఉన్న సినిమా షూటింగులన్నీ నిలిచిపోనున్నాయి.  ఈ నిర్ణయంపై  ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు స్టార్‌ హీరోలతో కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం. పలువురు హీరోలు తమ రెమ్యునరేషన్‌ తగ్గించుకునేందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. వీరిలో ఎన్‌టిఆర్‌; రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ ఉన్నారు. వీళ్లంతా వచ్చే సినిమాల నుంచి తమ రెమ్యునరేషన్‌ తగ్గించుకుంటామని దిల్‌ ...

Read More »

 జోరు వానలోనూ ఆగని అడుగు.. జనం కోసం జగనన్న

 ఉదయం కోనసీమ జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు సీఎం జగన్‌. దీనిలో భాగంగా జి.పెదపూడికి సీఎం జగన్‌ చేరుకునే సరికి భారీ వర్షం కురుస్తోంది. కానీ సీఎం జగన్‌ భారీ వర్షంలోనూ ముందుకు సాగారు. వరద బాధితులకు వద్దకు వెళ్లి వారి కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు.  కచ్చితంగా వరద బాధితులతో మాట్లాడాలనే తాపత్రయమే సీఎం జగన్‌లో కన్పిస్తోంది. తాను వారిని కలుస్తానని ముందుగా మాటిచ్చిన మేరకే వారి కష్టాలను స్వయంగా తెలుసుకుని భరోసా ఇస్తున్నారు. సాధారణంగా వాతావరణం అనుకూలంగా లేనప్పుడు సీఎం స్థాయి వ్యక్తి ...

Read More »

కోలివుడ్‌ ఎంట్రీ ఇస్తున్న చాందిని

ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డుకు ఎంపికైన ‘కలర్‌ ఫోటో’ హీరోయిన్‌ చాందినీ చౌదరి. పలు చిత్రాలతో పాటు వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తూ తన సత్తా చాటుతున్నారు. తాజాగా ఈ తెలుగు హీరోయిన్‌ కోలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ‘మై కడవులే, మన్మథ లీలై’ చిత్రాల హీరో అశోక్‌ సెల్వన్‌కు జంటగా నటించబోతున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ తమిళ రొమాంటిక్‌ కామెడీ చిత్రం ద్వారా హీరో కమల్‌ హాసన్‌ శిష్యుడు సిఎస్‌.కార్తికేయన్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నందుకు చాందినీ ...

Read More »

15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం

భారతదేశానికి ఎన్నికైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం 10.15 గంటలకు పార్లమెంట్‌ హాలులో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారాన్ని సుప్రీంకోర్టు సీజే ఎన్వీ రమణ చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ,  రాంనాథ్ కోవింద్, వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, గవర్నర్‌, ముఖ్యమంత్రి, పార్లమెంట్‌ సభ్యులు, ప్రభుత్వంలోని ప్రముఖ సివిల్‌, మిలటరీ అధికారులు కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు అయ్యారు. ద్రౌపది ముర్ము 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు.  ప్రమాణ స్వీకారం తర్వాత ఆమె ...

Read More »

తెలుగు డైరెక్టర్లకు చిరంజీవి క్లాస్

 టాలీవుడ్‌ డైరెక్టర్లకి మెగాస్టార్‌ చిరంజీవి చురకలంటించారు. తాజాగా ఆయన బాలీవుడ్‌ స్టార్‌ అమీర్‌ఖాన్‌ నటించిన ‘లాల్‌సింగ్‌ చద్దా’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిరు మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం కోసం అమీర్‌ఖాన్‌ డైలాగ్స్‌ ప్రాక్టీస్‌ చేయడానికి కొన్నివారాల సమయం తీసుకున్నారు. కేవలం డైలాగ్స్‌ కోసమే ఆయన ఇతర నటీనటులకు కూడా వర్క్‌షాప్‌ నిర్వహించారు. అదే మన తెలుగు చిత్ర పరిశ్రమలోని డైరెక్టర్స్‌ నటులకు ముందుగా డైలాగ్స్‌ని ఇవ్వరు. అప్పటికప్పుడే సెట్స్‌లోనే డైలాగ్స్‌ రాసి ఇస్తారు. దీంతో వెనువెంటనే.. డైలాగ్స్‌ చెప్పండి అంటే.. నటించేవారికి ...

Read More »