Monthly Archives: July 2022

‘విక్రమ్‌ గౌడ్‌’ స్పెషల్‌ పోస్టర్‌

కన్నడ యంగ్‌ హీరో కిరణ్‌ రాజ్‌ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల ‘బడ్డీస్‌’తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు ‘విక్రమ్ గౌడ్’ అంటూ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు.కుమారి సాయి ప్రియ సమర్పణలో మహేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై కణిదరపు రాజేష్, పి. ఉషారాణి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పాశం నరసింహారావు దర్శకులు. కిరణ్ రాజ్, దీపికా సింగ్ హీరో హీరోయిన్లుగా తెలుగు, కన్నడ భాషలలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

Read More »

931.02 కోట్లతో.. జగనన్న విద్యాకానుక

వేసవి సెలవుల అనంతరం 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూళ్లు ప్రారంభమైన తొలిరోజు జూలై 5న సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా వరుసగా మూడో ఏడాది కూడా జగనన్న విద్యాకానుక (జేవీకే) స్టూడెంట్‌ కిట్లను పంపిణీ చేసింది. కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వీటి పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న 47,40,421 మంది విద్యార్థులకు ఇవి అందనున్నాయి. ఇందుకోసం రూ.931.02 కోట్లను ప్రభుత్వం వ్యయం చేస్తోంది. 

Read More »

మరోసారి గాయపడ్డ విశాల్‌

తాజాగా విశాల్ నటిస్తున్న చిత్రం లత్తి. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇప్పటికే రెండుసార్లు గాయపడ్డాడు గాయపడిన ఒకరోజు తర్వాత విశాల్ తిరిగి సెట్ లోకి వచ్చి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు. ఇక గడిచిన రెండు రోజుల క్రిందట ఈ సినిమా షూటింగ్ సెట్లు స్టంట్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు గాయపడినట్లుగా తెలుస్తోంది. తన కాలికి గాయమైందని అతని కోలుకున్న తర్వాతనే షూటింగ్ తిరిగి ప్రారంభిస్తామని చిత్ర బృందం ప్రకటించారు. అయితే ఇంతలోనే విశాల్ మరుసటి రోజు మళ్ళీ సినిమా షూటింగ్లోకి జాయిన్ అయి కొనసాగించాడు. విశాల్ ఒక యాక్షన్ సీక్వెల్ చిత్రంలో పాల్గొనబోతున్నాడు.

Read More »

భీమవరంలో 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ

భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి , ఏపీ మంత్రి రోజా, కేంద్ర మాజీ మంత్రులు, చిరంజీవి, పురందేశ్వరీ తదితర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక మనిషిని.. ఇంకొక మనిషి.. ఒక జాతిని మరొక జాతి.. ఒక దేశాన్ని మరొక దేశం దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని స్వాతంత్ర్య సమరయోధులు ఆకాంక్షించారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దేశ స్వాతంత్ర్యం ...

Read More »

కమల్‌ నటన గురించి మాట్లాడే అర్హత నాకు లేదు.. మహేష్‌

‘ఇప్పటి సినిమాల్లో న్యూ ఏజ్‌ కల్ట్‌ క్లాసిక్‌ విక్రమ్‌. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ . లోకేశ్‌ కనగరాజ్‌.. నేను మిమ్మల్ని కలిసి.. విక్రమ్‌ సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకూ చిత్రీకరణ ఎలా జరిగిందో తెలుసుకుంటా. ఈసినిమా అన్ని రకాలుగా మైండ్‌ బ్లోయింగ్‌. ఈ సినిమాలో లెజెండరీ యాక్టర్‌ కమల్‌హాసన్‌ నటన గురించి మాట్లాడే అర్హత నాకు ఇంకా రాలేదు! నా అనుభవం సరిపోదు కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఆయన అభిమానిని అయినందుకు చాలా గర్వంగా ఉంది.ఇందులో ఫహద్‌ ఫాజిల్‌, ...

Read More »