డిసెంబర్ 2023 నాటికల్లా దేశంలో ప్రతి గ్రామ గ్రామాన జియో 5జీ సేవల్ని వినియోగదారులకు అందిస్తామని రిలయన్స్ ఇండిస్టీ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. సోమవారం జరిగిన రిలయన్స్ ఇండిస్టీస్ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ముఖేష్ మాట్లాడుతూ.. జియో 5జీ సేవల్ని విస్త్రతంగా అంబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. దివాళీకి ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కత్తతో పాటు దేశంలో అన్నీ ప్రధాన నగరాల్లో జియో 5జీ నెట్ వర్క్‌లను అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. దేశ మంతా హైక్వాలిటీ, హై అబార్డ్‌బుల్ 5జీ సర్వీసులను అందించనున్నట్లు చెప్పారు.
