మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా ఏప్రిల్ 13న విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి జరగడం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు సతీశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాగా, నిందితుడు సతీశ్ బెయిల్ పిటిషన్ పై విజయవాడ 8వ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు నేడు విచారణ చేపట్టింది.
పోలీసులు సతీశ్ ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారని అతడి తరఫు న్యాయవాది సలీం పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు. నిందితుడి బెయిల్ పిటిషన్ తీర్పుకు సంబంధించి రేపు ఉత్తర్వులు ఇవ్వనున్నారు.