కరోనా బారినపడిన కట్టప్ప

బాహుబలి కట్టప్ప, సీనియర్ నటుడు సత్యరాజ్ కరోనా బారినపడ్డారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో.. వైద్యుల సూచన మేరకు హోం ఐసోలేషన్‎లో ఉంటున్నారు. కాగా.. గత రాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు వెంటనే చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.