‘మార్క్‌ ఆంటోనీ’ షూటింగ్‌లో నటుడు విశాల్‌కు గాయలు

‘మార్క్‌ ఆంటోనీ’ ఘూటింగ్‌లో కోలీవుడ్‌ నటుడు విశాల్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకున్నట్లు చిత్రబృందం సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. ”మార్క్‌ ఆంటోనీ చిత్రీకరణలో విశాల్‌కు తీవ్రంగా గాయపడ్డారు. సినిమాలోని కీలక ఫైట్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రథమ చికిత్స అనంతరం విశాల్‌ షూట్‌ నుంచి బ్రేక్‌ తీసుకున్నారు.” అని తెలిపింది. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు.