ప్రస్తుతం బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే ఇందులో పలువురు సినీ సెలబ్రిటీలు ఉన్నట్లు బెంగళూరు పోలీసులు నిర్ధారించిగా అందులో టాలీవుడ్ నటి హేమ కూడా ఉన్నట్లు పోలీసులు బ్లడ్ శాంపిల్స్ సేకరించి డ్రగ్స్ తీసుకున్నట్లు కన్ఫర్మ్ చేశారు. అలాగే ఆమె తన పేరును కృష్ణవేణిగా చెప్పుకుందని అసలు నిజాలు బయట పెట్టారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఈ నెల 27న విచారణకు రావాలని టాలీవుడ్ నటి హేమకు కర్ణాటక పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆమె రక్తం నమూనాలో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో విచారించాలని పోలీసులు నిర్ణయించారు. తాను రేవ్ పార్టీలో లేనని బుకాయిస్తూ తొలుత హేమ ఓ
వీడియోను విడుదల చేయగా.. బెంగళూరు పోలీసులు ఆమె ఫొటోను రిలీజ్ చేసి, క్లారిటీ ఇచ్చారు.