సమంత మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్..

టాలెంటెడ్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం యశోద. ఈ సినిమాను శ్రీదేవి మూవీస్‌ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. హరి – హరీష్… ఇద్దరు యువకులు ఈ సినిమాతో దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా ఇందులో నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్‏లో వరలక్ష్మి జాయిన్ అయ్యారు.