కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ మరోసారి డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల షూటింగ్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘విదాముయర్చి’ చిత్రీకరణ అజర్‌బైజాన్‌లో సాగుతోంది. కారులో అజిత్, మరో నటుడు ఉండగానే క్రేన్ల సాయంతో గాల్లోకి తీసుకెళ్లి పల్టీలు కొట్టించారు. దీంతో అజిత్ రియల్ హీరో అంటూ అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అర్జున్, త్రిష కీలక పాత్రల్లో నటిస్తున్నారు.