సీఆర్డీఏ కీలక ప్రకటన..

crda-29.jpg

వైసీపీ ప్రభుత్వం హయాంలో నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఎలాంటి విధ్వంసం జరిగిందనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందో అప్పుడే ‘సాహో అమరావతి’ అంటూ ఊపిరిపీల్చుకుంది. ఇప్పటికే ఒకసారి అమరావతిని చుట్టి వచ్చిన సీఎం చంద్రబాబు పనులు వేగవంతం చేయమని ఆదేశాలివ్వడం జరిగింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు చకచకా పనులు కానిచ్చేస్తున్నారు. ఈ క్రమంలో.. రాజధాని అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నోటిఫై చేస్తూ సీఆర్డీఏ గెజిట్ జారీ చేయడం జరిగింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు ఉండనున్నాయి. ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతమైన 1575 ఎకరాల ప్రాంతాన్ని సీఆర్డీఏ నోటిఫై చేసింది. మాస్టర్ ప్లాన్‍లో భాగంగా జోనింగ్ నిబంధనల ప్రకారం నోటిఫై చేస్తున్నట్లు సీఆర్డీఏ కీలక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. సీఆర్డీఏ చట్టం సెక్షన్-39 ప్రకారం సీఆర్డీఏ ఈ బహిరంగ ప్రకటన జారీ చేసింది. రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం గ్రామాల సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వ కాంప్లెక్సు భవనాల కోసం నోటిఫై చేస్తున్నట్టు ప్రకటన జారీ చేయడం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాల కోసం నోటిఫై చేస్తున్నట్లు శనివారం మధ్యాహ్నం సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ బహిరంగ ప్రకటన నోటిఫికేషన్ జారీ చేశారు.

Share this post

scroll to top