సబ్జా గింజలు తీసుకుంటే దగ్గు, ఫ్లూ తగ్గుతుందా..

ఆరోగ్యకరమైన ఆహారం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేవి… పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు. అందుకే సరుకులు కొనుగోలు చేసేటప్పుడు కూడా ఇవే తీసుకుంటాం… అయితే వీటితో పాటు ఆహారంలో అధిక పోషకాలు, ఆరోగ్యాన్ని అందించే కొన్నింటిని మరిచిపోతున్నాం అందులో ఒకటే సబ్జా గింజలు. సబ్జా, తుక్మారియా గింజలు పేరు విని వుండరు. కానీ బేసిల్ విత్తనాల గురించి అందరికీ తెలిసిందే. వీటినే సబ్జా గింజలు అంటారు. ఎక్కువగా సూపర్ మార్కెట్స్‌లో ఇవి లభిస్తాయి. అయితతే, ఇవి శరీరానికి చేసే మేలు అంతగా తెలియదు. అందుకే వీటిని చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే, వీటిని తరచూ రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలలో ఉపయోగిస్తారు. సబ్జా గింజల్లో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. అవసరమైన పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో చాలా ఉన్నాయి.

ఇవి తులసి జాతికి చెందినవి. అందుకే తులసి విత్తనాలు, సబ్జా గింజలు కూడా ఒకేలా ఉంటాయి. వీటిని ఇంగ్లీష్‌లో బేసిల్ సీడ్స్ అంటారు. దీనిని స్వీట్ బేసిల్ అని మరో పేరు కూడా ఉంది. కానీ హోలీ బాసిల్, తులసి నుండి భిన్నంగా ఉంటుంది. ఇవి చూడ్డానికి ఆవాల్లా ఉంటాయి. ఇది ప్రతి భారతీయల ఇంటిలో సాధారణంగా, రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. సబ్జా గింజల్లో పిండి పదార్థాలు, అవసరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. మరో ముఖ్య విషయం ఏంటంటే.. ఈ సీడ్స్‌లో కేలరీలు ఉండవు.

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తింటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. అవి నీటిలో వేస్తె ఉబ్బుతాయి. ప్రతి నల్ల గింజకి అపారదర్శక తెల్లని ఫిల్మ్ పూత ఉంటుంది. అవి వాటి పరిమాణానికి రెండింతలు అవుతాయి. మీరు రెండు టీస్పూన్ల సబ్జా విత్తనాలు ఒక కప్పు గోరువెచ్చని నీటిలో సుమారు 15 నిమిషాలు నానబెట్టాలి. వేడి నీటిలో సబ్జా గింజలు నానబెట్టడం వల్ల యాంటీఆక్సిడెంట్స్, ప్రయోజనకరమైన జీర్ణ ఎంజైమ్‌ లను విడుదల చేస్తాయి.

సబ్జా గింజల్లో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ గింజలు ప్రత్యేకమైన రుచిని కలిగి ఉండవు. పోషకాహార కోసం వివిధ రకాల వంటకాలకు ఉపయోగించవచ్చు. పానీయాలు, డెజర్ట్‌లకు అలంకరణగా కూడా వాడొచ్చు. నిమ్మరసం, కుల్ఫీపై చల్లి కూడా తీసుకోవచ్చు.. ఇది తక్కువ కేలరీల అల్పాహారం. క్రంచీ అనుభూతి కోసం దీన్ని పాస్తా, సూప్‌ లలో వేసి తీసుకోవచ్చు.