ఎర్ర తోటకూరలో పొటాషియం కంటెంట్ మెండుగా ఉంటుంది. ఇది రక్త పోటును నియంత్రించడంలో హెల్ప్ చేస్తుంది. అంతే కాకుండా రక్త ప్రసరణ కూడా మెరుగు పడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గి.. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. డయాబెటీస్ ఉన్నవారు ఈ ఎర్ర తోట కూర తింటే రక్తంలో.. షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. కంటి సమస్యలను తగ్గించి.. కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. క్యాల్షియం కూడా మెండుగా లభిస్తుంది. కాబట్టి ఎముకల ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. అదే విధంగా ఎర్ర తోటకూరలో ఐరన్ కూడా లభ్యమవుతుంది. కాబట్టి ఇది తినడం వల్ల రక్త హీనత సమస్య ఉండదు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తక్షణమే శక్తిని కూడా ఇస్తుంది. అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది.